Srinivasa Rao
-
సాగుకు ఊతమిద్దాం
‘ఒకప్పుడు బెగ్గింగ్ బౌల్‌గా ఉన్న భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగింది. వరి, గోధుమ వంటి ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఏటా 340 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 345 మిలియన్ టన్నుల కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయడమే కాకుండా ఏటా 55 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. 142 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి సంపూర్ణ ఆహార భద్రత సాధించగలిగాం. అందులో సందేహం లేదు. కానీ పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో బాగా వెనుకబడ్డాం. ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన పప్పులు, నూనె గింజల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈయన ట్రైనీ సైంటిస్ట్ నుంచి ఐఏఆర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం, భవిష్యత్ ప్రణాళిక, తదితర అంశాలపై ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతిబెట్టను తట్టుకునే మరిన్ని రకాలు రావాలిదేశ జనాభా 142 కోట్లు దాటింది. 14 కోట్ల మంది రైతులున్నారు. దేశంలో 6 లక్షల గ్రామాలుండగా, 15 కోట్ల కమతాలున్నాయి. 80–85 శాతానికి పైగా చిన్న కమతాలే. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించలేకపోతున్నారు. అర్బనైజేషన్ కారణంగా గ్రామాలతో పాటు సాగు విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక రైతులు సాగును వదిలేసే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ జనాభాలో 50 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సాగు విస్తీర్ణంలో 50 శాతానికి పైగా నేటికీ వర్షాధారమే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మెజార్టీ సాగు విస్తీర్ణం వర్షాధారమే. 30–40 ఏళ్లుగా వర్షాలకు లోటులేదు. కానీ బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పొలంలో నీళ్లు పొలంలో, గ్రామంలో నీళ్లు గ్రామంలో, ఫామ్ ఫాండ్స్లో నీళ్లు నిల్వ చేసుకొని ఎప్పుడు బెట్ట వస్తే అప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించొచ్చు. నీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదు. వర్షాధారం కింద అధిక దిగుబడులు సాధించే రకాల వంగడాలను, ప్రధానంగా బెట్టను తట్టుకునే వాటిని అభివృద్ధి చేయాలి. కర్బన్ శాతాన్ని సంరక్షించుకోకపోతే ముప్పేప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వెజిటబుల్స్, పండ్లు తినే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల వారీగా అనువైన వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి.కరువు ప్రాంతాల్లో సైతం అధిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు తగిన వంగడాలను అభివృద్ధి చేయాలి. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. నేలల్లో కర్బన్ శాతాన్ని సంరక్షించగలిగినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఫామ్ మెకనైజేషన్ (యాంత్రీకరణ) ద్వారా పెట్టుబడి ఖర్చులను నియంత్రించగలుగుతాం. కొత్త వంగడాలు వేగంగా అందించాలిమన శాస్త్రవేత్తలు ఏటా వందలాది వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే అవి రైతు పొలానికి చేరినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అది ఆశించినంత వేగంగా జరగడం లేదు. పరిశోధనా కేంద్రాలు అందించే ఫౌండేషన్ సీడ్ నుంచి మల్టిపుల్ సీడ్ ఉత్పత్తి చేసి రైతులకు వేగంగా అందించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, సీడ్ ఏజెన్సీలు, సీడ్ కంపెనీలు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో సీడ్ రీప్లేస్మెంట్ జరగాలి. ఉత్తమ వంగడాల డెమో, చీడపీడల నియంత్రణ, నీటి వినియోగం వంటి ప్రయోగాలన్నీ రైతు క్షేత్రంలోనే జరగాలి. పంట అవశేషాలను కాల్చకుండా కంపోస్ట్ మార్చడం, తక్కువ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా అడుగులు వేయాలి. రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో ఓ రైతును ఓ మాస్టర్ ఫార్మర్‌గా తయారు చేయాలి. వారి ద్వారా ఆ గ్రామంలో పరిశోధనా ఫలాలు వేగంగా రైతులకు చేరువవుతాయి. పంట సాగు వేళ, కోత, కోత అనంతరం, నిల్వ సమయంలో ఉత్పత్తి నష్టాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి పంట ఉత్పత్తిని ప్రాసెసింగ్ వ్యాల్యూ ఎడిషన్‌తో మార్కెట్లోకి తీసుకెళ్లగలిగితే రైతులకు మేలు జరుగుతుంది.ఏపీ, తెలంగాణలో జిల్లాకో కేవీకేదేశ వ్యాప్తంగా 113 పరిశోధనా సంస్థలు, 731 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) ఉన్నాయి. గతంతో పోలిస్తే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో కూడా కేవీకేల సంఖ్య సమీప భవిష్యత్‌లో భారీగా పెరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పెరిగిన జిల్లాలకనుగుణంగా కనీసం 10–15 మధ్య కొత్తగా కేవీకేలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కొత్త రీసెర్చ్ స్టేషన్ల ఏర్పాటు కంటే ఉన్న రీసెర్చ్ స్టేషన్లను బలోపేతం చేయడమే నా ముందున్న లక్ష్యం. ఆ విషయంలో అవసరమైన నిధులు సాధించి పరిశోధనలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తాను. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పరిశోధనలకు ఏటా రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్‌లో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వర్షాధారం, బెట్ట పరిస్థితులతో పాటు వరదలు, తుపాన్లు వంటి వైపరీత్యాలను తట్టుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా మల్టిపుల్ టాలెంటెడ్ వంగడాలను అభివృద్ధి చేయడంతో పాటు నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.వాతావరణంలో అనూహ్య మార్పులు, ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయ రంగానికి పెనుసవాళ్లుగా మారాయి. పూర్వం జూన్‌లో వర్షాలు కురిసేవి. ఆ వెంటనే నాట్లు వేసుకునే వారు. కానీ నేడు జూలై–ఆగస్టుల్లో వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో వర్షపాతానికి లోటు లేదు. ఏటా సగటున 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కానీ పడితే కుండపోత.. లేకుంటే కరువు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొన్నేళ్లుగా దశాబ్దాలుగా కరువుతో అల్లాడిన ప్రాంతాలను సైతం కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ సీజన్లను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. అన్ని కష్టనష్టాలను ఎదుర్కొని పంట దిగుబడి సాధిస్తే.. మార్కెటింగ్ తీరుతో రైతులు నష్టపోతున్నారు. ఈ సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఐఏఆర్ఐ ముందుకెళ్తోంది. – డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, ఐఏఆర్ఐ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ -
డిప్యూటీ సీఎం పవన్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు
-
పవన్.. సీజ్ ది షిప్ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్‌ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్‌ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్‌కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్‌కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్‌ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్‌కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్‌కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఐసీఏఆర్ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–న్యూఢిల్లీ) సంచాలకులుగా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి ఈయనే. కృష్ణా జిల్లా అవనిగండ్లపాడుకు చెందిన చెరుకుమల్లి..బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఐసీఏఆర్‌లో పీహెచ్డీ పట్టా పొంది, అదే సంస్థలో ట్రైనీ సైంటిస్ట్‌గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ అయ్యారు. 30 ఏళ్లుగా ఐసీఏఆర్‌లో సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా చెరుకుమల్లి పేరొందారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, విధాన నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. 300కు పైగా ఈయన సమర్పించిన పరిశోధనా పత్రాలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 8 ఏళ్లుగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా, విస్తరణ యాజమాన్య అకాడమీ (ఎన్‌ఏఏఆర్‌ఎం) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యవసాయ పరిశోధన మండలిలో కొత్తగా చేరే యువ శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేస్తూ, బోధనలో మార్పులు తీసుకువస్తున్నారు. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టి దానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చిన ఘనత చెరుకుపల్లిదే. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ పొటాష్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఏఐ) అవార్డుతో పాటు ఎన్ఏఏఎస్, గోల్డెన్ జూబ్లీ, ఐసీఏఆర్ సంస్థల నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డులు అందుకున్నారు. ఇటీవలే పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని కూడా చెరుకుమల్లి అందుకున్నారు. -
వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీపడ్డా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు. న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది. రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
చాయ్ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది!
మూసాపేట: టీస్టాల్ వద్ద కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ (22) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఈ నెల 22న రాత్రి కూకట్‌పల్లిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తింటున్నాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్ తమ చెల్లెలు, మరదలితో కలిసి అదే టిఫిన్ సెంటర్వద్దకు టీ తాగేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్ చెల్లెలు, మరదల్ని కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నబోయిన శ్రీధర్ బానోత్ సురేష్, గుంటుక అజయ్ కుమార్ అనే యువకులకు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. పవన్ హోటల్లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై మోదాడు కొద్దిసేపు ఘర్షణ పడిన ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 23న ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పరీక్షించి తలకు లోపల బలమైన గాయంకారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నబోయిన పవన్, చెన్నబోయిన శ్రీధర్, బానోతు సురేష్, గుంటుక అజయ్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాడ్‌కు తరలించారు. -
రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
3లక్షల పింఛన్లు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్‌ను వెనక్కితీసుకుంటామని చెప్పారు. సీట్లు కేటాయించండి అధ్యక్షా! పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్‌ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు. డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి...
-
స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర.. ‘కూటమి’పై సీపీఎం నేత ఫైర్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కార్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామి అమలు కాలేదని విమర్శలు గుప్పించారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే రూ.500 కోట్లు ఇస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్‌ను ఏర్పాటు చేయాలి. స్టీల్ ప్లాంట్‌కు తక్షణమే రూ.15 వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి’’ అంటూ శ్రీనివాసరావు నిలదీశారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఉద్యమం: సీఐటీయూసీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు.. బీజేపీకి భజన చేస్తున్నారని సీఐటీయూ మండిపడింది.‘‘స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంట్ అనే పదం వాడొద్దంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. సెయిల్‌లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సీఐటీయూ నేతలు సీహెచ్ నరసింగరావు, కుమార్ డిమాండ్ చేశారు. -
పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?
గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు.దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి.. దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయç³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీనివాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణం. అడ్డువచ్చిన ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు. -
కొలికపూడి కక్ష రాజకీయం పోలీసులను తోసేసి మరి...
-
డాక్టర్ కేఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం!
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీ వేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తుంది.భారతీయ భాషాసాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయస్థాయిలో నిరంతర సాహితీసేవకూ గుర్తింపుగా డాక్టర్ కే. శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు నాందీ సేవా న్యాస్ సమితి సన్మాన పత్రంలో పేర్కొంది.వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిందీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ రాధా వల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్ సింహ్ పాండే, డాక్టర్ శశికళా పాండే ప్రభృతులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్.. -
ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పని చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలును సాధించటం కూడా ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలన్నారు. హోదా సాధనకు ఇదే సరైన సమయమన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పదేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకోవాల్సి ఉందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం కాదుసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, అది సజీవ సమస్యగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని, దానికి ప్రతిపక్షం కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. హోదా కోసం 2014 నుంచి పోరాటం జరుగుతోందని, చంద్రబాబు, జగన్ ఇద్దరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూగతంలో చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని, వాటిని మరోసారి కేంద్రానికి పంపించాలని కోరారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందన్నారు. మీడియాపై అప్రకటిత నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాక్ డ్రిల్.. పవర్ఫుల్
సత్తెనపల్లి : ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావు ఘటనా స్ధలికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ గుర్నాథ్బాబు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, సివిల్, ప్రత్యేక సాయుధ దళాలు వ్యాన్లతో అక్కడికి చేరాయి.ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడం.. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా.. మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్ట్రెక్చర్‌పై వాహనంలో తరలించారు. అంబులెన్సుల హడావుడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. కళ్లకు కట్టిన ప్రదర్శన ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్‌లో ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ‘నటించిన’ పోలీసులు అక్కడి నుంచి ని్రష్కమించారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది.స్థలం : సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ సమయం: ఆదివారం సాయంత్రం 5.11 గంటలు 50 మందికి పైగా ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు .. మరో చేతిలో రాళ్లు ... పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తాలూకా సెంటర్లో నడిరోడ్డుపై మంట పెట్టిన టైర్లు.. ఎటుచూసినా భయానక వాతావరణం..అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు అన్నారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ విక్రయాలకు, పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలు, అల్లర్లు, గుమికూడటం చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నరసరావుపేటలో ఒకరిపై చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు, ఏఆర్ డీఎస్పీ గాంధీ, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్, ఎస్ఐలు ఎం. సంధ్యారాణి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
కొలికపూడికి ప్రజా ప్రతిఘటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దురుసు స్వభావం, అహంకారపూరిత ధోరణి ఓటర్లను మరింత దూరం చేస్తోంది. గతంలో ఆయన ట్రాక్ రికార్డు సైతం ప్రజల్లో భయందోళన రేకెత్తిస్తోంది. దీంతో పారీ్టల కతీతంగా సామాన్య ఓటర్లు సైతం ఈయనను ఎమ్మెల్యేగా భరించగలమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ సామాజికవర్గ నేతలు సైతం కొలికపూడి విషయంలో కినుకు వహిస్తున్నారు. కొలికపూడి సైతం వారిని కలుపుకొనిపోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలను టీడీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతోంది. దీంతో చివరి అస్త్రంలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలను సైతం పసిగట్టిన ఓటర్లు తిప్పికొడుతుండటంతో ఆయన విలవిల్లాడుతున్నాడు. ప్రతి సారీ ఎన్నికల సమయంలో పారాచ్యూట్ నేతలను తెచ్చి తమవైపు రుద్దుతున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, చినబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. హంగామా చేసి... టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం అందోళన చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఏకొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా, గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావిడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తరువాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారు. ఇలా కొలికిపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గంపలగూడెం మండలం మంచిరాలపాడులో కొలికపూడికి మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఆయన ప్రచారంలో భాగంగా నోటి దురుసుతో సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి.. అని అనగానే అక్కడ ఉన్న మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు. ఫ్యానుకే మా ఓటు అంటూ మహిళలు చేతులు చూపుతూ కౌంటర్ ఇచ్చారు. ఊహంచని పరిణామం నుంచి వెంటనే తేరుకొని ఇంకా అక్కడ ఉంటే మహిళల నుంచి పరాభవం తప్పదని గ్రహించి రోడ్‌షో చేయకుండానే జారుకున్నాడు. ప్రలోభాలకు తెర.. ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అనే భావనకు వచ్చిన కొలికపూడి ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలల్లో తొలుత హోలి కానుకల పేరుతో మభ్యపెట్టే యత్నం చేశారు. పలు సామాజిక వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి రకరకాల హామీలు గుప్పించారు. స్థలాలు కొని, సామాజిక భవన నిర్మాణాలు చేపడతానని మభ్య పెట్టారు. ఇప్పుడేమో ఎన్నికల తరువాత చూస్తానని నాలుక మడతేశారు. పదో తరగతిలో 500 కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు పారితోíÙకం ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల తరువాత డబ్బులు ఇస్తామని చెబుతున్నాడు. ప్రచారంలో సైతం జనాలు లేకపోవడంతో, ఆ గ్రామాల్లో అద్దె మనుషులను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని టీడీపీలోని నేతలే పేర్కొంటున్నారు. -
జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులకు తగి న అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది. -
కొలికపూడి శ్రీనివాస్ కి స్వామి దాస్ స్ట్రాంగ్ కౌంటర్
-
డాక్టర్ శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక డి.లిట్ ప్రదానం
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లెటర్స్) లభించింది. భారతీయ భాషలకు సాహిత్యానికి విశేషమైన సేవలు అందించినందుకు అదే విధంగా దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర సాహిత్య అకాడమీని అభివృద్ధి పథంలో నడిపించిన పరిపాలనా దక్షతకూ గుర్తింపుగా వారికి గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ ప్రదానం చేస్తున్నట్టు షహిద్ మహేంద్ర కర్మా విశ్వవిద్యాలయం, బస్తర్ ప్రకటించింది. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో గల విశ్వవిద్యాలయంలో 2024 మార్చ్ 5వ తేదీన జరిగిన గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు డి.లిట్. డిగ్రీ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శ్రీ వాస్తవ ఇతర ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సాహిత్య సేవా రంగంలో అత్యంత అరుదైన, ప్రతిష్టాకరమైన గౌరవ డి.లిట్. డిగ్రీని స్వీకరించిన సందర్భంగా కళా సాహిత్య రంగాలకు, పరిపాలనా రాజకీయ రంగాలకూ చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపారు. కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామానికి చెందిన కృత్తివెంటి శ్రీనివాసరావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిషులో డాక్టరేట్ చేశారు. పలు గ్రంధాలు వెలువరించారు. దేశ విదేశాల్లో వందలాది సాహిత్య కార్యక్రమాలలో ప్రసంగించారు. భారత సాంస్కృతిక శాఖకు చెందిన ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శి హోదాలో శ్రీనివాసరావు దాదాపు రెండు దశాబ్దాలుగా విశేషమైన సేవలందిస్తున్నారు. -
ఎంపీ టికెట్ల కోసం బండ్ల, గడల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి.. ఇదిలా ఉంటే.. గాంధీభవన్‌లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది. -
ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా పై కొమ్మినేని రియాక్షన్
-
సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు
-
కొలికపూడి, టీవీ5 సాంబ అరెస్ట్ ?..సీఐడీ విచారణలో కీలక విషయాలు
-
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.