వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన చంద్రబాబు | Sajjala Ramakrishna Reddy Comment on Chandrababu | Sakshi
Sakshi News home page

వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన చంద్రబాబు

Published Wed, Aug 16 2023 6:33 AM | Last Updated on Wed, Aug 16 2023 6:33 AM

Sajjala Ramakrishna Reddy Comment on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు నాశనం చేశారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిప­డ్డారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా విజయ­వాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడు­కల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లా­డు­తూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్‌ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమ­యంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ బెస్ట్‌ స్టేట్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరా­లతో రాయదగ్గదన్నారు.

సచివాలయం, వల­ంటీర్ల వ్యవస్థను దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రశంసిస్తుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాబు, పవన్‌లకు మాత్రమే చెల్లిందని ధ్వజ­మెత్తారు. పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్‌ విజయం సాధించారని చెప్పా­రు. ఎవరెంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, తిరిగి వైఎస్‌ జగన్‌కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement