propaganda
-
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్‌లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్‌పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్‌లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్‌లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్‌ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్‌బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్‌లు, ఇతర మెసేజ్‌లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్‌లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
-
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
-
వాలంటీర్లపై వేటు? టీడీపీ తప్పుడు ప్రచారం
-
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనపై ఇటీవల సోషల్‌మీడియాలో పలు అవినీతి ఆరోపణలు వ్యాప్తి చెందాయి. దీంతో మహేందర్‌రెడ్డి మంగళవారం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నవని తెలియజేశారు. ‘నేను 36 ఏళ్ళకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పదవీ విరమణ వరకు అంకిత భావంతో పనిచేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశా. నా కెరీర్ మొత్తంలో.. నేను క్లీన్ రికార్డ్, ఖ్యాతిని కొనసాగించాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న/ సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు, పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
విషయాలను మరచి సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు
ఆంధ్రప్రదేశ్ నుంచి దావోస్ సభలకు సీఎం జగన్ వెళ్ళలేదంటూ ఈనాడు విషం చిమ్ముతోంది. నిజానికి మొత్తం 29 రాష్ట్రాల్లో దావోస్‌కు వెళ్లింది కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులే. గతంలో ఐదు సార్లు దావోస్ వెళ్లానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఒక్క విదేశీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. చంద్రబాబు.. నేనే తెచ్చినట్లు గొప్పగా చెప్పుకునే కియా పరిశ్రమ కూడా ప్రధాని మోదీ కొరియా పర్యటనలో ఉన్నప్పుడు చేసిన సూచన మేరకు ఆ కంపెనీ ఏపీకి వచ్చిందనేది వాస్తవం. అయితే ఈ కంపెనీ తీసుకు వచ్చింది నేనే అంటూ బాబు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. సీఎం జగన్ దావోస్ ఇప్పుడు దావోస్ సభలకు వెళ్లకపోయినా.. ఇప్పటి వరకు తన పాలనలో రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనలో ఉన్నన్ని రోజులు (దిగిపోయేనాటికి) రాష్ట్రానికి వచ్చిన ఎంఎస్ఎంఈల సంఖ్య 1.93 లక్షలు మాత్రమే. దీంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈలు రెట్టింపు అని స్పష్టమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే 2023 మార్చిలో జరిగిన విశాఖ సమ్మిట్‌లో మాత్రమే పారిశ్రామిక వేత్తలు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక వృద్ధిలో దూసుకెళ్తోందన్న విషయం పారదర్శకంగా కనిపిస్తున్నాయనే.. విషయాలన్నీ తెలిసినా విష ప్రచారాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. -
లేని బ్రాండ్లపై ఎల్లో బ్యాండ్ కథనాలు
-
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్‌కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్‌షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్‌కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్‌కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
క్రిసిల్ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్ సర్వే నివేదిక అంటూ శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ రిపోర్ట్)గా వెబ్సైట్లో రాసుకున్న అంశాలని సాక్ష్యాధారాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచిన గ్రౌండ్ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్ రిపోర్టును ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి(ఎన్సీఏఈఆర్)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్సీఏఈఆర్ ఆ రిపోర్టును తిరస్కరించింది. అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి ఎవరో విజిల్ బ్లోయర్ (అవినీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది. అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవరిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్ షా పిలిచారని లోకేశ్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్‌కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులిచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరమన్న లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆరోపణలపై జగన్ సిబీఐ విచారణ కోరాలి రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని, సీఎంజగన్ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అనుమతులు పొందాయని, అయితే 2019 తర్వాత మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు. -
నేను పార్టీ మారడం లేదు
కైలాస్‌నగర్: పార్టీ మారుతున్నట్లు కొద్దిరోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని, తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని ఎంపీ సోయం బాపూరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక అని, దాన్ని నెరవేర్చే ఉద్దేశంతో రెండు నెలలుగా ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ రైల్వేలైన్‌కు సంబంధించి ఫైనల్ లోకేషన్ సర్వే వరకు తెచ్చానని, వచ్చే బడ్జెట్లో దానికి కేంద్రం నిధులు కేటాయించే అవకాశముందని తెలిపారు. స్థానికంగా పార్టీకి సమయం ఇవ్వకపోవడంతో తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలపడుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని బాపూరావు స్పష్టం చేశారు. -
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు నాశనం చేశారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమయంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గదన్నారు. సచివాలయం, వలంటీర్ల వ్యవస్థను దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రశంసిస్తుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాబు, పవన్‌లకు మాత్రమే చెల్లిందని ధ్వజమెత్తారు. పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్ విజయం సాధించారని చెప్పారు. ఎవరెంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, తిరిగి వైఎస్ జగన్‌కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల యాత్ర చేస్తూ మద్యం సరఫరా గురించి మాట్లాడుతున్నారు. కర్నూలు న్యాయరాజధాని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. తన హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్లు కోతల మీద కోతలు కోస్తున్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలలో బాగా చొచ్చుకుపోయిన ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన అధిక శాతం అభాండాలు మోపడమే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్టులు చేపడతానంటూ శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టులవద్దకు వెళ్లి పూలు పెట్టి నిరసన తెలిపారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రస్తుతం ఆ పద్దతిలోనే పాట్లు పడుతున్నారు. (చదవండి: సినిమాలు తీసి అప్పులు తీర్చాలనుకోవడం అమాయకత్వం) ఉమ్మడి ఎపిలోకాని, విభజిత ఎపిలో కాని కలిపి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అసలు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సత్వరమే పూర్తి కావని, వాటివల్ల రాజకీయ ప్రయోజనం రాదన్నది ఆయన సిద్దాంతం. అందువల్లే తెలుగుదేశం నేతలు కోరినా పోలవరం, పులిచింతల, వెలిగొండ తదితర ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. రాజశేఖరరెడ్డి వచ్చాకే ప్రాజెక్టులకు ప్రాధాన్యత వచ్చింది. ఆయన ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. చకచకా చేపట్టారు. వాటిని అడ్డుకోవడానికి తెలుగుదేశం చేయని ప్రయత్నం లేదు. అంతదాకా ఎందుకు! 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఏ ప్రాజెక్టు ప్రారంభించారు? దేనిని పూర్తి చేశారు? ఏదో ఒకటి చెప్పడం తప్ప ఆయనకు నిజాయితీ లేదన్నది వాస్తవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చేపట్టినా, పోతిరెడ్డిపాడును విస్తరించాలని తలపెట్టినా చంద్రబాబు సహకరించారా? వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడును విస్తరించడానికి ప్లాన్ చేస్తే టిడిపి నేతలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమా, కోడెల వంటి నేతలతో ధర్నాలు చేయించింది చంద్రబాబు కాదా? అది రాయలసీమకు మేలు చేయడానికా? ద్రోహం చేయడానికా? పోతిరెడ్డిపాడు విస్తరిస్తే కోస్తాకు నీరు రావని ప్రచారం చేసింది టిడిపి నేతలు కాదా? అప్పుడేమో అలా వ్యవహరించి ఇప్పుడేమో రాయలసీమకు తానేదో పోడిచేశానని, జగన్ చేయడం లేదని అసత్య ప్రచారం చేయడానికి ఈ యాత్రను సంకల్పించారన్న సంగతి తెలుస్తూనే ఉంది. (చదవండి: అలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి అంజాద్ బాషా) కడప జిల్లాలో గండికోట రిజర్వాయిర్ లో 27 టిఎమ్.సిల నీటిని నిలబెట్టడానికి వైఎస్ చేసిన కృషిని జిల్లా ప్రజలు ఎన్నటికి మరవరు. చంద్రబాబు ఎంత చెప్పినా అవన్ని ఉబుసుపోక కబుర్లే అవుతాయన్న సంగతి అందరికి తెలుసు. పులివెందులకు గండికోట నుంచి నీరు తెస్తానని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ ఆర్ చెబితే ఎవరూ నమ్మలేదట. అదెలా సాధ్యమని చాలా మంది భావించారట. కాని ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే కొండను తొలిచి టన్నెల్ ను నిర్మించి నీరు రప్పించిన తీరు చూశాకా ఔరా! అని అనుకున్నామని పులివెందులలో ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పారు. చంద్రబాబు గురించి ఎవరైనా అలా చెబుతారేమో ఆలోచించండి. ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టును టేకప్ చేసేవారా? విశేషం ఏమిటంటే ఆ లిఫ్ట్ ద్వారా వచ్చిన నీటిని వైఎస్ తవ్వించిన కాల్వ ద్వారానే కృష్ణానదికి తరలించవలసి వచ్చింది. ఆ కాల్వే లేకపోతే పట్టిసీమే లేదు. అదే కాదు వైఎస్ ముందు చూపుతో పోలవరం కాల్వలు తవ్వించి ఉండకపోతే పోలవరం ఇప్పటికి కూడా మొదలయ్యేది కాదు. కేంద్రం చేపట్టవలసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకుని మొత్తం ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టారు. లేకుంటే పునరావాసం తో సహా అన్ని వ్యయాల బాధ్యత కేంద్రానిది అయి ఉండేది. నిజంగా చంద్రబాబుకు ప్రాజెక్టులపై చిత్తశుద్ది ఉంటే , నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లి మద్యం గురించి ప్రసంగాలు చేస్తారా? పైగా అందులోను అసత్యాలు! మంచి మద్యాన్ని తక్కువ రేటుకు సరఫరా చేస్తానని నలభై ఐదేళ్ల సీనియర్ నేత అయిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నారంటే ఏమన్నా అర్ధం ఉందా? ఇంతకన్నా నీచం ఉంటుందా? మద్యం తాగవద్దని చెప్పాల్సిన ఆయన తాగండి.. బాబూ.. తాగండి అని ప్రచారం చేస్తున్నారు. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వపరంగా నడుస్తుండడంతో ప్రైవేటు దందాకు అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు టైమ్ లో ఏమి జరిగేది. మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. దాని ప్రభావంతో ఆయన గత ఎన్నికలలో ఓటమి పాలైనా, ఇప్పటికీ అదే దిక్కుమాలిన నినాదం ఎత్తుకుని తిరుగుతున్నారు. మందుబాబుల ఓట్లతో గెలిచిపోతానని బాబు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కాని ఆయన ఉపన్యాసాలను మహిళలు చీత్కరించుకుంటారని తెలుసుకోలేకపోతున్నారు. (చదవండి: నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్) కర్నూలు న్యాయ రాజధానిగా ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించడం మిలియన్ డాలర్ జోక్ అయినా కావాలి.. మరో అవకాశవాదపు హేళన స్టేట్ మెంట్ అన్నా కావాలి. ఎందుకంటే కర్నూలులో హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నదే ఆయన అయితే.. దానిని నిస్సిగ్గుగా బుకాయించడం శోచనీయం అని చెప్పాలి. అమరావతి గ్రామాలకు వెళ్లి ఆయన కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పగలరా? అక్కడేమో వ్యతిరేకిస్తారు. ఇక్కడేమో తానేదో అనుకూలం అన్నట్లుగా జగన్ ను ప్రశ్నిస్తారు. రాయలసీమ ప్రజలందరికి తెలుసు. ఎవరు కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నది. తద్వారా రాయలసీమకు ద్రోహం చేస్తున్నది చంద్రబాబే అని న్యాయవాదులే కాకుండా అన్ని వర్గాల వారికి స్పష్టత ఉంది. మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆయన అధికారంలోకి వస్తే వైసిపివారి పని పడతారట. మురికి కాల్వలో వేసి తొక్కుతారట. ఇది ఒక నాయకుడు మాట్లాడవలసిన తీరేనా? ఇలాంటి నేతను ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్దపడతారా? తన ప్రత్యర్ధి పార్టీవారిని మురికి కాల్వలో తొక్కడం ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అన్నమాట. ఏది ఏమైనా వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి జనం చర్చించుకోకుండా, వాటిని మర్చిపోయేలా చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు విపరీతంగా తంటాలు పడుతున్నారు. అదంతా కేవలం ఓటమి భయంతోనే అని అంతా గుర్తించాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
మూలధన వ్యయంలో దేశంలోనే ఏపీ టాప్
-
దేవుడితోనే ఆటలాడబోయి...చివరకు...
-
ఏది నిజం?: కమీషన్లు అందటం లేదనే.. రామోజీ నేలబారు రాతలు
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు... కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు. చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యర్థిస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు. వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆరి్థక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్‌లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి. ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆరి్థక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆర్థిక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్‌సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా? 2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు. 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు. 2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు. అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు. అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ? ఈనాడు ఆరోపణ రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు. వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు. ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యరి్థంచారు. దీనికీ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా దుష్ప్రచారం
-
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
ఏపీలో విద్యుత్ డిమాండ్ పెరిగినా, కోతల్లేవ్..
-
రామోజీ ‘‘డ్రామాల’’ ఆర్థిక నిపుణుడు: దువ్వూరి కృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందని, దీని వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కీలకమైన ఆర్థిక అంశాలన్నింటినీ గణాంకాలను మీడియా ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారాయన. ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం. రుణాలు.. నాడు–నేడు: రాష్ట్రానికి సంబంధించిన రుణాలు (పబ్లిక్ డెట్)తో.. పబ్లిక్ ఎక్కౌంట్ వివరాలు చూస్తే.. ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. ఇంకా అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు. టీడీపీ ప్రభుత్వ హయాంలో: విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అదే 5 ఏళ్లలో, 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో: ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది కూడా ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు: ఇదే కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఆ రుణాలు రూ.14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, మే నాటికి ఆ రుణాలు రూ.59,257.31 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది. గ్యారెంటీ లేని రుణాలు: ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్ రంగంలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు. డిస్కమ్‌లు–బకాయిలు: విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే. టీడీపీ కంటే మేం చేసిన అప్పులు తక్కువే: మొత్తం మీద పబ్లిక్ డెట్ టు పబ్లిక్ ఎక్కౌంట్ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు, ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ.4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం సీఏజీఆర్ మాత్రమే పెరిగింది. రూ.10 లక్షల కోట్లు అని దుష్ర్పచారం: నిజానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.6.51 లక్షల కోట్లు మాత్రమే కాగా, ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ మిగతా అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎవరైనా అలా లెక్క లేకుండా అప్పులు ఇస్తారా?. అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం. టీడీపీ హయాంలో కంటే రుణాల సేకరణ తగ్గింది: 2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు చూస్తే.. (డెట్ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. అంటే ఏ రకంగా చూసినా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఏ మాత్రం ఎక్కువ కాదు. ఇంకా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని, ఆ గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు. ఉదాహరణకు: మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్ వ్యయం కాగా, పిల్లలను స్కూల్‌కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం అవుతుంది. దేని ప్రాధాన్యం అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి, పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు. పథకాలు–ప్రయోజనాలు: విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కలిగిన ప్రయోజనాలు చూస్తే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈరోజు మన రాష్ట్ర జీఈఆర్ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. దీనిపై స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి (నాడు-నేడు) విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు కాగా, అందుకోసం ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.1209 కోట్లు ఖర్చు చేస్తోంది. 👉 పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏటా సగటున రూ.5600 కోట్లు వ్యయం చేయగా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కోట్లు వ్యయం చేస్తోంది. మరి దీన్ని కూడా వృథా వ్యయం అంటారా? 👉 కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం, ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయడం జరిగింది. కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు కూడా పెంచడం జరిగింది. ఆదాయం కోల్పోయాం: కోవిడ్ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల, ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది. అప్పటి కంటే తక్కువ ఫైన్లు: వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తున్న విపక్షం.. వాహనాల నుంచి ఫైన్లపైనా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.183.94 కోట్లు మాత్రమే. అంటే ఎలా చూసినా, ప్రజలపై భారం వేయడం లేదు. మూలధన వ్యయమూ ఎక్కువే: కాగ్ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండీచర్) వివరాలు చూస్తే.. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అందుకోసం చేసిన వ్యయం రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటు వ్యయం రూ.15,227.80 కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అయినా విపక్షంతో పాటు, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీ దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు అనే వ్యక్తి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి ఆయన్ని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. చదవండి: ఏపీ అప్పులపై ఈనాడు అర్థం, పర్థం లేని వార్తలు.. -
కుహానా మేధావి విశ్లేషణ.. ఈనాడు అర్థం, పర్థం లేని రాతలు
ఈనాడు దినపత్రిక అసూయ, అక్కసు, అసహనం వంటి సమస్యలతో రగిలిపోతుంది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతోందో ఏమో తెలియదు కానీ, నిత్యం అసత్యాల, అర్థం ,పర్థం లేని వార్తలతో పత్రికను నింపేస్తోంది. టీవీలలో గంటల కొద్ది తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది. వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని. ఏదో అయిపోతోందని అంటూ చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉంది. ఎవరో ఒకరిని మేధావి అంటూ టాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారు కుహానా మేధావులో, నిజంగానో మేధావులో కానీ, ఈనాడు, తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఆ మధ్య ఒక మహిళా మేధావి అంటూ అప్పులపై మాట్లాడించారు. తాజాగా ఎవరో జీవీ రావు గారట.. ఆయనను పట్టుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారనిపిస్తుంది. వీరు నిజమైన మేధావులే అయితే, రాష్ట్రానికి ఎంత అప్పు ఉండాలి? ఎంత ఉంది? ఎందుకు పెరిగింది? కరోనా వంటి సంక్షోభాలలో అప్పులు చేయాలా? వద్దా? ప్రజలకు వివిధ స్కీముల ద్వారా డబ్బు ఇవ్వడం వల్ల జీఎస్డీపీ పెరిగే అవకాశం ఉందా? లేదా? నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ స్కీములపై ఏమి చెప్పారు. ప్రమాదకర పరిస్థితిలో అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. రుణాలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధి,విధానాలను అమలు చేస్తోంది. వాటిని దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఉదాహరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం మితిమీరి అప్పులు చేసిందని చెప్పి, ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు పదిహేడు వేల కోట్ల రుణంపై కోత విధించింది. గత ప్రభుత్వం సుమారు రెండు లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పుడు కూడా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారు. అప్పుడేమో రాష్ట్రం సిరిసంపదలతో తులతూగినట్లు, ఇప్పుడేమో శ్రీలంక అయిపోయినట్లు ఈ కుహానా మేధావులు చిత్రీకరించే యత్నం చేయడం దారుణంగా ఉంది. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఈ మేధావులంతా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాను రైతులకు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన లక్ష కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేస్తానని చెబితే ఆహా,ఓహో అని అన్నారు. చంద్రబాబుకు ఉన్న సీనియారిటీతో అది సాధ్యమేనని టీవీలలో కూర్చుని మరీ వాదించేవారు. తీరా ప్రభుత్వం వచ్చాక నాలుక మడతేసినా వీరు కూడా కిమ్మనలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ మహిళలకు ,రైతులకు డబ్బు పంచితే , ఇంకేముంది వీరంతా చంద్రబాబుకు ఓటు వేసేస్తారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారు అని డబ్బా కొట్టారు. వీరికన్నా రైతులు, మహిళలకే ఎక్కువ విజ్ఞత ఉంది కనుక ఈ మేధావుల అసత్య ప్రచారాన్ని నమ్మలేదు. అయినా వారు మళ్లీ ఎన్నికల ముందు బయల్దేరినట్లుగా ఉంది. జీవీ రావు అనే మేధావి విశ్లేషించదలిస్తే, రెండు ప్రభుత్వాల తీరును పోల్చి మంచి సలహాలు ఇస్తే బాగుండేది. ఆయన అలా చేయలేదు. పైగా చిత్రమైన వాదన చేశారు. ప్రజల జేబుల్లో పది రూపాయలు పెట్టి, వారి నుంచి వంద రూపాయలు తీసుకుంటోందని ఈయన అన్నారని ఈనాడు రాసింది. ఆయన నిజంగానే అలా అని ఉంటే ఆర్దిక నిపుణుడు ఎలా అవుతారో అర్థం కాదు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజుకుంటే అసలు అప్పులు చేయవలసిన అవసరం ఏమి వస్తుంది? ఆర్థిక సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇది కనీస ఇంగితం కాదా! ఉచితంగా ఇచ్చే మొత్తాలకన్నా అధికంగానే ప్రజల నుంచి తీసుకుంటోందని ఆయన చెప్పారట. అది ఏ రకంగానో వివరించాలి కదా? తెలుగుదేశం నేతల అర్థరహిత ప్రచారానికి ,ఈయన అభిప్రాయానికి ఏమైనా తేడా ఉందా? ఒక ప్రైవేటు సంస్థ అయిన మార్గదర్శి అక్రమంగా వందల కోట్ల రూపాయల డిపాజిట్లను తీసుకుంది. అదంతా అప్పు గానే పరిగణించాలి కదా? గతంలో 1800 కోట్ల నష్టాలలో ఉన్నా డిపాజిట్ల సేకరణ ఆపలేదు కదా! మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ దీనిపై ఫిర్యాదు చేసిన తర్వాత కదా తన టీవీచానళ్లను అమ్మి దానినుంచి బయటపడింది. అయినా మరోరూపంలో డిపాజిట్లు తీసుకుంటే అదేమో పారదర్శకమట. ప్రభుత్వం అదేమిటని అడిగితే కక్ష అట. ఇలా మాట్లాడే మేధావులంతా ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి అమ్మో అప్పా? అంటూ గుండెలు బాదుకుంటూ నటిస్తుంటారు. శ్రీలంక, పాకిస్తాన్ వంటివాటితో ఈ రావుగారు పోల్చి మాట్లాడడం కూడా విడ్డూరమే. నిజంగానే ఏ రాష్ట్రం అయినా అలా సంక్షోభంలోకి వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?పోనీ ఈ ప్రభుత్వం వివిధ స్కీముల కింద ఆర్దిక సాయం చేయడం తప్పు అని ఈ మేధావి భావిస్తే, మరి ఈ సంక్షేమ కార్యక్రమాల కన్నా మరింత అధికంగా అమలు చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా! ఆయనను ఎందుకు విమర్శించడం లేదు. అంటే చంద్రబాబు 2019 నాటికి ప్రభుత్వంలో వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయినా, వీరి దృష్టిలో ఆయన మంచి ఆర్దికవేత, విజనరీ.ఇప్పుడు జగన్ కన్నా అధికంగా స్కీములు ఇస్తామని చెబుతుంటే అప్పుడు మాత్రం రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ ల లా గా మారదట. ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరట. ఏపి వేరట. తెలంగాణ అప్పులపై ఈనాడు ఏనాడన్నా ఒక్క కథనాన్ని అయినా ఇచ్చిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎందుకు ఈనాడు రామోజీ అంత భయపడుతున్నారు. అదే టైమ్ లో ఏపీలో మాత్రం పనికట్టుకుని ఇలాంటి అప్పుల తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారు. వెలుగు దినపత్రిక ఇచ్చిన ఒక కథనంలో తెలంగాణ ప్రభుత్వం 2.12 లక్షల కోట్ల అప్పును బడ్జెట్లో చూపకుండా చేసిందని తెలిపింది. ఈనాడులో ఎప్పుడైనా ఈ వార్తను ఇచ్చారా! గతంలో ఈనాడు రాసింది కనుక, తెలుగుదేశం ఆరోపించింది కనుక జి.వి.రావు అనే మేధావి కూడా ఏపిలో పది లక్షల కోట్ల అప్పు ఉందని చె్ప్పారని అర్థం అవుతూనే ఉంది. ఆయన దగ్గర అప్పులు సమాచారం ఉంటే ఆ క్లాసిఫికేషన్ ఇచ్చి ఉండేవారు కదా? ఈనాడులో వచ్చిన వార్తలనే మళ్లీ తాను కూడా చెప్పడానికి ఇంటర్వ్యూ ఎందుకు? ఏదో ఈనాడులో మేధావిగానో,నిపుణుడుగానో ఉచిత ప్రచారం చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది ఈ ఇంటర్వ్యూ. 'గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేేస్తే అభివృద్ది కాదట. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పితే అది ప్రజలకు నష్టమట. స్కూళ్లకు వేల కోట్ల వ్యయం చేసి బాగు చేసి పేదలకు విద్యాబుద్దులు నేర్పడం మంచిది కాదట. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వరాదట... కేంద్రం నాలుగు లక్షల కోట్ల అప్పే ఏపీకి ఉందని చెప్పినా ఒప్పుకోరట. ఈనాడులో రాశారు కనుక మరో ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పాల్సిందేనట." ఆ మేధావి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఏపీలో ఆయనకు అభివృద్ది కనిపించలేదుగతంలో ఎప్పుడూ రోజువారి అప్పులు చేయలేదా? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 35 వేల కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది! అందుకూ ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు ఏడుపే. కేంద్రంలో కొందరు అదికారులు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అప్పుడు రాశారు. పోనీ ప్రభుత్వం ఈ స్కీములు అమలు చేయవద్దని రాస్తారా?అంటే అది రాయరు. ఇంకా అదనంగా ఇవ్వాలంటారు. వారికి కావల్సినప్పుడు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందని రాస్తారు. ఇప్పుడు కూడా ఈ మేధావి ఎవరో జీవీ రావు గారు కూడా పది రూపాయలు ఇచ్చి పంద రూపాయలు తీసుకుంటే , ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ఎందుకు వస్తాయో వివరించి ఉండాలి కదా? కేవలం తెలుగుదేశం కోసమో, ఈనాడు మీడియా కోసమో ఇలాంటి పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సోకాల్డ్ మేధావులు అప్రతిష్టపాలు కాకుండా ఉంటే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ (చదవండి: మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం) -
సర్వే నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కొమ్మినేని శ్రీనివాసరావు
-
రైతే రాజన్న ఆలోచనలతో వైఎస్ జగన్ పాలన
-
బందరులో భయపడ్డ బాబు..