క్రిసిల్‌ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం | Purandeshwari fake news CRISIL survey report | Sakshi
Sakshi News home page

క్రిసిల్‌ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం

Published Sun, Oct 15 2023 6:41 AM | Last Updated on Sun, Oct 15 2023 6:41 AM

Purandeshwari fake news CRISIL survey report - Sakshi

క్రిసిల్‌ రిపోర్ట్‌ పేరుతో ఓ వ్యక్తి పరిశీలన పత్రాలు చూపుతున్న పురందేశ్వరి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్‌ సర్వే నివేదిక అంటూ శనివారం విజయ­వాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్‌ రిపోర్ట్‌)గా వెబ్‌సైట్‌లో రాసుకున్న అంశాలని సాక్ష్యా­ధా­రాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన గ్రౌండ్‌ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్‌ రిపోర్టును ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చి­(ఎన్‌సీఏఈఆర్‌)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్‌సీఏఈఆర్‌ ఆ రిపోర్టును తిరస్కరించింది.

అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్‌ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్‌ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి
ఎవరో విజిల్‌ బ్లోయర్‌ (అవి­నీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలి­సిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యా­ఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేక­రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది.

అవి­నీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని  అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవ­రిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్‌ షా పిలిచారని లోకేశ్‌ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్‌కి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. చంద్ర­బాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులి­చ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూర­మన్న లోకేశ్‌ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు.

ఆరోపణలపై జగన్‌ సిబీఐ విచారణ కోరాలి
రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని,  సీఎంజగన్‌ నిజాయితీని నిరూ­పించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అను­మతులు పొందాయని, అయితే 2019 తర్వాత  మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్‌సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement