
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రయాపడ్డారు. ఎవరైనా నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్‌ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment