Information and Broadcasting Ministry
-
చైనాలో మన సినిమా ఆడుతోంది
ముంబై: భారతీయ సినిమాలు మన దేశంలో కంటే చైనాలో ఎక్కువగా ఆడుతున్నాయట. ‘అయిదారేళ్ల క్రితం భారత్‌లో 12,000 థియేటర్లు ఉండేవి. ఇప్పుడీ సంఖ్య 8,000లకు వచ్చి చేరింది. ఇదే సమయంలో చైనాలో సినిమా ప్రదర్శనశాలలు 10,000 నుంచి ఏకంగా 70,000లకు పెరిగాయి. అందుకే కొన్ని భారతీయ సినిమాలు ఇక్కడి కంటే మెరుగ్గా చైనాలో రాణిస్తున్నాయి’ అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ ట్రెండ్‌ను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరిన్ని థియేటర్లు ప్రారంభం కావడమే ఇందుకు పరిష్కారమని అన్నారు. పశ్చిమ బెంగాల్లో 10 లక్షల జనాభా ఉన్న మాల్డాలో ఒక్క థియేటర్ లేదని గుర్తుచేశారు. సరైన ధరలో సినిమా.. సినిమా ప్రదర్శనశాలలను తెరవాలనుకునే ఔత్సాహికుల కోసం ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ప్రారంభించామని చంద్ర తెలిపారు. ‘ఇన్వెస్ట్ ఇండియాతోపాటు అనుమతులను సులభతరం చేసేందుకు నేషనల్ సింగిల్ విండో పోర్టల్ సాయంతో ఇది పనిచేస్తుంది. కర్నాటకలో జిల్లా కేంద్రాల్లో గడిచిన 3–4 నెలల్లో ఆరు థియేటర్ల ఏర్పాటుకు సాయం చేశాం. ‘రూ.75కు టికెట్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. సినిమా సరైన ధరలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎగ్జిబిషన్ పరిశ్రమ కూడా ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. నేరుగా మొబైల్లో.. 5జీ నెట్వర్క్ రాకతో టీవీ ఛానెళ్లను నేరుగా మొబైల్‌కు ప్రసారం చేసే అవకాశం ఉంటుందని అపూర్వ చంద్ర అన్నారు. ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఫోన్లో చిన్న పరికరాన్ని జోడించడం ద్వారా వందలాది ఛానెళ్లను వీక్షించడంపై ప్రసార భారతి ఇప్పటికే అమలు చేయదగ్గ భావనతో ముందుకు వచ్చిందని తెలిపారు. -
8 యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్ చేసిన ఐటీశాఖ
-
కేంద్రం సీరియస్.. యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్తాన్‌కు చెందినది. ఇదిలా ఉండగా.. కేంద్రం అంతకు ముందు కూడా 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్‌ను బ్లాక్ చేసింది. ఇక, గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది. ఇక, ఈ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్.. దాదాపు 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. .@MIB_India blocks 8 YouTube channels for spreading disinformation related to India’s national security, foreign relations and public order, 7 Indian and 1 Pakistan based YouTube news channels blocked under IT Rules, 2021#YouTube #channels#blocked #MIB pic.twitter.com/rHVSHTX2Ou — BIKASH KUMAR ROUTRAY (@Bikash_Media) August 18, 2022 ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం -
Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: ‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసలు మనుగడలోనే లేని సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటివారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఓ ప్రకటనలో తెలిపారు. -
రెచ్చగొట్టేలా హెడ్‌లైన్స్ వద్దు: కేంద్రం హెచ్చరికలు
వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్స్, సంచలనాల పేరిట ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయొద్దంటూ టీవీ ఛానెల్స్‌కు కేంద్రం చురకలంటించింది. న్యూస్ ఛానెల్స్‌లో టెలికాస్ట్ చేసే కంటెంట్ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ.. శనివారం ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, జహంగీర్‌పురి హింస నేపథ్యంలో.. పలు మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు దృష్టికి రావడంతో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ స్పందించింది. ఉక్రెయిన్ పరిణామాలపై.. చాలావరకు న్యూస్ యాంకర్లు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు ఇవ్వడం, వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, ట్యాగ్ లైన్లు తగిలించడం దృష్టికి వచ్చిందని కేంద్రం పేర్కొంది. అలాగే ఢిల్లీ జహంగీర్‌పురి హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు.. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని కేంద్రం అభిప్రాయపడింది. అలాగే టీవీ ఛానెల్స్‌లో డిబేట్స్ సందర్భంగా ఘటనలకు సంబంధించి.. నీచమైన భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని రీతిలో భాషను గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంటెంట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(నియంత్రణ) చట్టం 1995 ప్రకారం.. టీవీ ఛానెల్స్ నడుచుకోవాలి. ►కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు. ► ఇంకొకరి పరువు, ప్రతిష్టలను దెబ్బతినేలా ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు. ► తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు ► తప్పుడు సమాచారం, అశ్లీల కథనాల వార్తలు వద్దు. ► జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు ► అసత్యాలను వల్లె వేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు ► సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయొద్దు ► కథనాలను సగం చెప్పి.. వీక్షకులకు పక్కదారి పట్టించొద్దు. ► వివిధ వర్గాల మనోభావాలను కించపరిచే, దెబ్బతీసే కథనాలు వద్దు. -
కేంద్రం కొరడా.. 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం.. వాటి లక్ష్యమదే!
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దేశ భద్రత, జాతీయ సమగ్రత, విదేశీ సంబంధాలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో 22 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధించింది. ఇందులో 18 భారతీయ, 4 పాకిస్థాన్‌కు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. సంబంధిత యూట్యూబ్ చానళ్లు టెలివిజన్ లోగోలు, యాంక్లరను ఉపయోగించి, తప్పుడు థంబ్‌నెల్స్‌తో వీక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఐటీ రూల్స్ 2021ను ఉల్లంఘించిన కారణంతో తొలిసారిగా 18 యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. వీటితోపాటు మూడు ట్విటర్ అకౌంట్లు, ఒక ఫేస్బుక్ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఈ చానళ్లు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ వివాదం వంటి అంశాలపై సామాజిక మధ్యమాల ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. అంతేగాక ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొన్ని భారతీయ యూట్యూబ్ ఛానెల్‌లు తప్పుడు కంటెంట్‌ను పబ్లిష్ చేస్తున్నారని, ఇవన్నీ ఇతర దేశాలతో భారత్‌కున్న విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపింది. ఇవి పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్.. ‘హ్యాట్సాఫ్ సార్’ -
యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం బారత్‌కి విరుద్ధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్న పాక్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్సైట్లు, ఒక ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్ సహాయ్ అన్నారు. ఈ మేరకు బ్లాక్ చేసిన ఖాతాలలో అప్నీ దునియా నెట్వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్...) -
అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు!
స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌పై తొలి ఫిర్యాదు నమోదు అయ్యింది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీ షార్ట్ ఫిల్మ్ కిందటి ఏడాది జవనరిలో రిలీజ్ అయ్యి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టర్ మృత శిశువును చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్ తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని జులై 27న నమోదు అయిన ఆ ఫిర్యాదు పేర్కొని ఉంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్‌ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్‌ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్-2021’ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ‘సాక్రెడ్ గేమ్స్, ఏ సూటబుల్ బాయ్’ ద్వారా నెట్‌ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
గూగుల్ హెచ్చరిక.. ఇలా అయితే కంటెంట్ కట్!
ఇంటర్నెట్లో సెక్సువల్ కంటెంట్ అప్లోడ్ చేసే సైకోలు, కాపీపేస్ట్ రాయుళ్లు, వివాదాస్పద అంశాలు జోడించే వ్యక్తులపై గూగుల్ కొరడా ఝులిపించింది. స్థానిక చట్టాలను గౌరవించని, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇందుకు సాక్ష్యంగా ఆటోమేషన్, వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా.. అభ్యంతరక కంటెంట్‌ని పెద్ద ఎత్తున తొలగిస్తోంది. తొలగించిన కంటెంట్ 13.78 లక్షలు వరల్డ్ నంబర్ వన్ సెర్చింజన్ గూగుల్ అభ్యంతరకరమైన పోస్టులపై చర్యలు తీసుకుంటోంది. ఆటోమేషన్ ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ని గుర్తించడంతో పాటు వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఇండియాకు సంబంధించి ఏకంగా 13.78 లక్షల కంటెంట్‌ని గూగుల్ తొలగించింది. ఆటోమేషన్‌లో కొత్త ఐటీ చట్టాలను అనుసరించి వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా గూగుల్ ఇప్పటి వరకు 2,17,095 లింక్‌లను తొలగించగా ఆటోమేషన్ పద్దతిలో ఇంతకు పదితంతల సంఖ్యలో అభ్యంతరకర, వివాదాస్పద సమాచారాన్ని గూగుల్ డిలీజ్ చేసింది. ఆటోమేషన్‌లో తొలగించిన కంటెంట్ మేలో 6,34,357 ఉండగా జూన్‌లో 5,26,866గా నమోదైంది. ఇందులో ఎక్కువ భాగం చిన్నారులను లైంగికంగా వేధించడం, జుగుప్సకరమైన హింసకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు గూగుల్ తెలిపింది. వ్యక్తిగత ఫిర్యాదులు భారత ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను గూగుల్ క్రమం తప్పకుండా వెల్లడిస్తోంది. అందులో భాగంగా స్థానిక చట్టాలకు లోబడి ఇంటర్నెట్లో అభ్యంతరకర నేర పూరిత, చట్ట విరుద్ధమైన కంటెంట్ (టెక్ట్స్, వీడియో, ఫోటోలు, ఆడియో) ఉందంటూ భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్‌లో గూగుల్‌కి అందిన ఫిర్యాదులు తీసుకున్న చర్యల వివరాలు ఇలా ఉన్నాయి. - ఏప్రిల్‌లో 27,700 మంది ఫిర్యాదు చేయగా వీటికి సంబంధించి 59,350 వివిధ కంటెంట్‌లని గూగుల్ తొలగించింది, - మేలో 34,883 ఫిర్యాదులు అందగా 71,132 కంటెంట్‌పై గూగుల్ చర్యలు తీసుకుంది. - జూన్‌లో 36,265 కంప్లైంట్స్ రాగా... గూగుల్ తొలగించిన కంటెంట్ సంఖ్య 83,613కి చేరుకుంది. కాపీరైట్ గూగుల్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో చట్టపరమైన పరువు నష్టం, కాపీరైట్, నకిలీ సమాచారం తదితర కేటగిరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో కాపీరైట్, పరువు నష్టానికి సంబంధించినవే నూటికి ఎనభై శాతం ఉంటున్నాయి. తమ కంటెంట్‌ను మరెవరో పోస్టు చేశారని, తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గూగుల్‌ని వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. -
సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: సినీ ప్రేమికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో 50 శాతానికే పరిమితమైన సీటింగ్ సామర్థ్యాన్ని పెంచింది. థియేటర్లలో అధిక శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వవచ్చని తాజా నిబంధనల్లో పేర్కొంది. ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అయితే ఎంత మేరకు సీట్లను బుక్ చేసుకోవచ్చన్న వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించనుంది. (చదవండి: ఆర్ఆర్ఆర్: రాజమౌళి కాపీ కొట్టారట!) కాగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుందని థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. అన్నింటికీ పూర్తి స్థాయిలో అనుమతులిచ్చినప్పుడు కేవలం థియేటర్ల బిజినెస్‌కు మాత్రమే నిబంధనలు విధించడం సబబు కాదని ప్రభుత్వాలకు విన్నవించాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం నిబంధనలను పక్కన పెట్టి థియేటర్లలో 100 శాతం కెపాసిటీకి పచ్చజెండా ఊపింది. కానీ కేంద్రం మాత్రం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. (చదవండి: పళని సర్కార్‌కు కేంద్రం షాక్!) -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఓటీటీకి కూడా సెన్సార్
సాధారణంగా సినిమాలైతే సెన్సార్ అవ్వకపోతే విడుదల చేయలేరు. సినిమా తయారైన తర్వాత ఎవరెవరు ఆ సినిమా వీక్షించవచ్చో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, జీ5 మొదలైనవి) ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ లేదు. కానీ ఇకనుంచి ఓటీటీ కంటెంట్‌కి కూడా కత్తెర తప్పదని సమాచార మరియు ప్రసారశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక పై ఆన్లైన్లో ప్రసారమయ్యే కంటెంట్ కూడా ప్రభుత్వం గమనిస్తుంటుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని డిజిటల్ మాధ్యమాల్లో సినిమా, సిరీస్‌లు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్న పలువురు దర్శక–నిర్మాతలు వ్యతిరేకించారు. -
ఎఫ్2' సినిమాకు కేంద్ర అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : 2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. కాగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. చదవండి: ఆస్కార్స్‌కు ప్రియాంక? -
‘రిపోర్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి’
న్యూఢిల్లీ : దేశంలోని పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(ఐ అండ్ బీ) పలు సూచనలు జారీచేసింది. కరోనాకు సంబంధించిన వార్తలు కవర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులను కోరింది. ఈ మేరకు బుధవారం ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలోని పలు ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల్లో చాలా మందికి కరోనా సోకినట్టుగా తమ దృష్టికి వచ్చింది. కరోనాకు సంబంధించి వార్తలు సేకరిస్తున్న మీడియా ప్రతినిధులు(రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు..) కంటైన్మెంట్ జోన్లు, హాట్‌స్పాట్స్, కరోనా ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లే మీడియా ప్రతినిధులు వారి విధులు నిర్వర్తించేటప్పుడు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్షేత్రస్థాయిలో వార్తలను సేకరిస్తున్న రిపోర్టర్‌లతోపాటుగా ఆఫీసులో పనిచేసే సిబ్బందికి సంబంధించి మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేసింది. కాగా, దేశంలో ఇప్పటికే పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు, చైన్నెలోని ఓ టీవీ చానల్లో పనిచేస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. చదవండి : న్యూస్ ఛానల్లో పని చేస్తున్న 27 మందికి కరోనా జర్నలిస్టులను వణికిస్తున్న కరోనా: ఒక్కరోజే 53 మందికి.. -
టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు..
న్యూఢిల్లీ : దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్ బ్రాడ్కాస్టర్స్కు, డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లకు కీలక సూచనలు చేసింది. వీక్షకులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కష్ట సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా టెలివిజన్ ప్రసారాలు అందించాలని కోరింది. ఈ మేరకు బ్రాడకస్టర్స్కు, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, ఎమ్‌ఎస్‌వోలకు, లోకల్ కేబుల్ ఆపరేటర్స్‌కు ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. చందదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రసారాలు అందేలా చూడాలని ఆ లేఖలో కోరింది. ఈ కష్ట సమయంలో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని తెలిపింది. ఇలా చేయడం ద్వారా కరోనాకు సంబంధించిన వార్తలను, ప్రస్తుత పరిస్థితులను ప్రజలు నిరంతరం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని సదరు మంతిత్వ శాఖ భావిస్తోంది. చదవండి : లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు -
ఏ ఆపరేటర్‌కైనా అదే సెట్‌టాప్ బాక్సు
న్యూఢిల్లీ: డీటీహెచ్ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే సెట్‌టాప్ బాక్సులు... ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినా సరే ఉపయోగపడేటట్లు ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే వినియోగదార్లకు ఇవ్వాల్సిందిగా కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. అంటే వినియోగదారుడు ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్ పోర్టబిలిటీ) సెట్‌టాప్ బాక్సు మాత్రం మార్చాల్సిన పని ఉండదు. ఈ సెట్‌టాప్ బాక్సులన్నీ యూఎస్బీ ఆధారిత కనెక్షన్‌తో పనిచేసేలా ఉండాలని కూడా ట్రాయ్ స్పష్టంచేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ మార్గదర్శకాలను సవరించాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలల గడువివ్వాలని ట్రాయ్ పేర్కొంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాలు అమలు చేస్తున్నదీ లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
ప్రైవేటు టీవీ చానళ్లకు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందండంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు కీలక సూచనలు చేసింది. హింసను ప్రేరేపించేలా, దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణల దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయకుండా అన్ని చానళ్లు అప్రమత్తతో ఉండాలని, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. గతంలో కూడా పలుమార్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ టీవీ చానళ్లపై అంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
అశ్లీలత.. బీప్ లేకుండా బూతు డైలాగులు!
సెన్సార్ కష్టాలు త్వరలో వెబ్ సిరీస్‌లను కూడా చుట్టుముట్టబోతున్నాయి. ఇప్పటిదాకా బుల్లితెర, వెండితెరలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ కత్తెరలను త్వరలో వెబ్ సిరీస్‌కు కూడా వర్తింపజేయాలని ప్రసార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కఠినతరమైన నిబంధనలను రూపొందించబోతున్నట్లు సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖ ప్రకటించింది. ‘మార్గదర్శకాలు ఇప్పటికైతే ఓ కొలిక్కి రాలేదు. కానీ, వాటిని రూపొందించి వీలైనంత త్వరగా అన్వయింపజేస్తాం’ అని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘టీవీల్లో ప్రసారం అయ్యే వాటికి ఇప్పటిదాకా నిబంధనలు వర్తిస్తున్నాయి. కానీ, ఇంటర్నెట్ కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. అడ్డు అదుపులేకుండా మేకర్లు హింస, అశ్లీలతను చూపించేస్తున్నారు. ఇది మాములు మోతాదులో ఉంటే పర్వాలేదు. కానీ, శృతి మించిపోతోంది. బీప్ లేకుండా బూతు డైలాగులను వాడేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం. అయితే నియంత్రణ పేరిట.. స్వేచ్ఛను మాత్రం హరించే ఉద్దేశం మాత్రం మాకు లేదు’ అని అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఏప్రిల్ నెలలో మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో 10 మందితో కూడిన ఓ కమిటీని మార్గకదర్శకాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్ గేమ్స్’ విడుదలై.. వివాదాస్పదమైంది. నేర ప్రపంచం.. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఓచోట మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయటం, కాంగ్రెస్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం తెలిసిందే. విక్రమ్ చంద్రా నవల ‘సాక్రెడ్ గేమ్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా.. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానీ రూపొందించారు. -
ఐబీ నుంచి స్మృతి ఇరానీ ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. సమాచార ప్రసార (ఐ అండ్ బీ) శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖను అదే శాఖలో సహాయమంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు స్వతంత్ర హోదాతో అప్పగించారు. దాంతో, ఇక ఇరానీ టెక్స్టైల్ శాఖ మంత్రిగా మాత్రమే కొనసాగనున్నారు. స్మృతి ఇరానీని కీలక మంత్రిత్వ శాఖ నుంచి తొలగించడం ఇది రెండోసారి. గతంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నుంచి కూడా ఆమెను తొలగించి, టెక్స్టైల్ శాఖను ఇచ్చిన విషయం తెలిసిందే. పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైట్లీ కోలుకునేంత వరకూ గోయల్ ఆ పదవిలో కొనసాగుతారు. ఎస్ఎస్ అహ్లూవాలియాకు తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి స్థానంలో ముఖ్యమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆల్ఫోన్స్ కన్నథానం ఇకపై పర్యాటక శాఖ సహాయమంత్రిగా మాత్రమే కొనసాగుతారు. గత సంవత్సరం జూలైలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య నాయుడు సమాచార ప్రసార శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. దాంతో వెంకయ్య నాయుడు స్థానంలో స్మృతి ఇరానీ నియమించారు. కానీ పలు సందర్భాలలో ఇరానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. తాజాగా, నకిలీ వార్తలు రాసే జర్నలిస్ట్‌లపై కేసులు నమోదు చేసి, శిక్షించాలనే నిబంధనలతో ఆమె జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు ప్రధాని మోదీ ఆదేశాలతో ఆ ఉత్తర్వులను ఆమె వెనక్కు తీసుకున్నారు. -
అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదు..
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రయాపడ్డారు. ఎవరైనా నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్‌ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఫేక్ న్యూస్ ఆదేశాలు.. వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్‌ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో వివిధ ఛానెళ్ల, పత్రికల ఎడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు ఎదురయ్యాయి. దీనికి తోడు ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించటమేనంటూ రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. ఆ ఉత్తర్వుల్లో ఏవైనా మార్పులు సూచించాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉదయం ట్వీట్ చేశారు. అయినా ఆందోళనలు చల్లారకపోవటంతో నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఫేక్ న్యూస్‌ల వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చర్చించిన తర్వాతే ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. -
ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ రాజీనామా
బాలీవుడ్ తెరపై మరో వివాదం మొదలైంది. ప్రస్తుతం ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించే సినిమాల ఎంపిక విషయంలో వచ్చిన బేధాభిప్రాయాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 మంది సభ్యులతో కూడిన ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ ఎంపిక చేసిన సినిమాల జాభితా నుంచి మలయాళ సినిమా‘ఎస్ దుర్గ’, మరాఠి సినిమా ‘న్యూడ్’ లను సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తొలగించింది. అందుకు నిరసనగా సుజోయ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ప్రదర్శనకు 5 మెయిన్‌స్ట్రీమ్ సినిమాలతో కలిపి మొత్తం 26 చిత్రాలను ఎంపిక చేశారు. -
దూరదర్శన్ న్యూస్‌ను స్వాధీనం చేసుకుంటుందా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసమంటూ ఇప్పటికే జాతీయ అధికారిక మీడియాను క్రియాశీలకంగా వాడుకుంటున్న మోదీ ప్రభుత్వం వాటిపై మరింత పట్టు బిగించబోతోందా.. తాజా పరిణామం చూస్తోంటే ఈ అనుమానం రాకమానదు. 'మన్ కీ బాత్' పేరిట ఆకాశవాణిని తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్న మోదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడకాస్టర్ దూరదర్శన్ (జాతీయ ప్రజా ప్రసారకర్త) న్యూస్‌ను ప్రభుత్వం.. స్వాధీనం (టేక్ ఓవర్) చేసుకున్నట్లు తెలుస్తోంది. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అక్షయ్ రౌత్ స్థానంలో వీణా జైన్‌ని నియమిస్తూ శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రసార మంత్రిత్వ శాఖలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్‌గా ఉన్న జైన్, రెండు బాధ్యతలను ఉమ్మడిగా నిర్వహిస్తారని తెలిపింది. దూరదర్శన్ ఛానల్‌కు క్రమేపీ తగ్గుతున్న ప్రేక్షకాదరణ, క్షీణిస్తున్న ఆదాయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది . స్వయం ప్రతిపత్తి కలిగిన దూరదర్శన్పై పెత్తనం చెలాయించేందుకు, వార్తా ప్రసారాలను తమ నియంత్రణలో ఉంచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా దూరదర్శన్లోని అన్ని మీడియా విభాగాల హెడ్లకు జైన్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని అందించి, ప్రసార భారతి సీఈఓ, ప్రసార భారతి బోర్డ్ ఛైర్మన్‌ను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. కాగా జాతీయ అధికార ఛానల్ అయిన దూరదర్శన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. స్వతంత్య ప్రతిపత్తిని కలిగి ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినం సందర్భంగా, దసరా సందర్భంగా అక్టోబర్ 3న దూరదర్శన్ ఛానల్లో భాగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్‌ను వాడుకున్నారని విమర్శించాయి. ఈ క్రమంలో డీడీ ద్వారా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రసార భారతిని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన ప్రసంగ పాఠాన్ని కట్ చేశారని ఆరోపిస్తూ జాతీయ టీవీ(డీడీ) ప్రొఫెషనల్ ఫ్రీడమ్ పాటించడం లేదని విచారం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.