
న్యూఢిల్లీ: సినీ ప్రేమికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో 50 శాతానికే పరిమితమైన సీటింగ్ సామర్థ్యాన్ని పెంచింది. థియేటర్లలో అధిక శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వవచ్చని తాజా నిబంధనల్లో పేర్కొంది. ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అయితే ఎంత మేరకు సీట్లను బుక్ చేసుకోవచ్చన్న వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించనుంది. (చదవండి: ఆర్‌ఆర్‌ఆర్: రాజమౌళి కాపీ కొట్టారట!)
కాగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుందని థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. అన్నింటికీ పూర్తి స్థాయిలో అనుమతులిచ్చినప్పుడు కేవలం థియేటర్ల బిజినెస్‌కు మాత్రమే నిబంధనలు విధించడం సబబు కాదని ప్రభుత్వాలకు విన్నవించాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం నిబంధనలను పక్కన పెట్టి థియేటర్లలో 100 శాతం కెపాసిటీకి పచ్చజెండా ఊపింది. కానీ కేంద్రం మాత్రం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. (చదవండి: పళని సర్కార్‌కు కేంద్రం షాక్!)
Comments
Please login to add a commentAdd a comment