టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు.. | I And B Ministry Tells Continue Uninterrupted Services | Sakshi
Sakshi News home page

టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు..

Published Mon, Apr 13 2020 1:03 PM | Last Updated on Mon, Apr 13 2020 1:07 PM

I And B Ministry Tells Continue Uninterrupted Services - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టర్స్‌కు, డీటీహెచ్‌, కేబుల్‌ ఆపరేటర్లకు కీలక సూచనలు చేసింది. వీక్షకులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కష్ట సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా టెలివిజన్‌ ప్రసారాలు అందించాలని కోరింది. ఈ మేరకు బ్రాడకస్టర్స్‌కు, డీటీహెచ్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు, ఎమ్‌ఎస్‌వోలకు‌, లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌కు ఐ అండ్‌ బీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 

చందదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రసారాలు అందేలా చూడాలని ఆ లేఖలో కోరింది. ఈ కష్ట సమయంలో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని తెలిపింది. ఇలా చేయడం ద్వారా కరోనాకు సంబంధించిన వార్తలను, ప్రస్తుత పరిస్థితులను ప్రజలు నిరంతరం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని సదరు మంతిత్వ శాఖ భావిస్తోంది. 

చదవండి : లాక్‌డౌన్‌ అమలులో ఏపీ నెంబర్‌ వన్‌

కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement