Broadcasters
-
కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్‌కాస్టర్స్ మధ్య ముగిసిన వివాదం
న్యూఢిల్లీ: కొత్త టారిఫ్ ఆర్డరుపై (ఎన్టీవో) బ్రాడ్కాస్టర్లు, లోకల్ కేబుల్/మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ మధ్య వివాదం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆపరేటర్లు అంగీకరించారు. దీంతో బ్రాడ్కాస్టర్లు శుక్రవారం తిరిగి చానల్స్ కనెక్షన్లను పునరుద్ధరించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రేట్లను పెంచుతూ రూపొందించిన ఒప్పందాలను కుదుర్చుకోని కేబుల్ ఆపరేటర్లకు డిస్నీ స్టార్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఫీడ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త ఎన్టీవో ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. అంతక్రితమే ఫిబ్రవరి 15లోగా కొత్త ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా బ్రాడ్‌కాస్టర్స్ నోటీసులు ఇచ్చారు. కానీ ఆలిండియా రేట్లను 18–35 శాతం మేర పెంచేశాయంటూ డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (ఏఐడీసీఎఫ్) సభ్యులు నిరాకరించడంతో బ్రాడ్కాస్టర్లు సిగ్నల్స్‌ను నిలిపివేశాయి. -
కొత్త సంవత్సరంలో టీవీ చూసేవారికి ఊహించని షాక్!
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా టీవీ లవర్స్‌కి సైతం కొత్త ఏడాదిలో పెద్ద షాక్ తగలనుంది. ప్రముఖ టీవీ బ్రాడ్కాస్టర్లు ఛానళ్లకు సంబంధించి అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచేశాయి. ఈ ధరల పెంపు నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా, టీవీ రీఛార్జ్ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఖరీదుగా మారనుంది. 3 సంవత్సరాల తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. సోనీ పిక్చర్స్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్తో సహా 42 ప్రసారకర్తలు 332 కంటే ఎక్కువ ఛానెల్‌లు ఉన్నాయి. ప్రసారకర్తలు ఈ ఛానెల్‌లను చూడటానికి నెలవారీ రుసుములను నిర్ణయించారు. దీని ధర 10 పైసల నుంచి 19 రూపాయల వరకు ఉంటుంది. టీవీ బ్రాడ్కాస్టర్లు 3 సంవత్సరాల తర్వాత ఛానెల్‌ల ధరలను సవరించారు. నవంబర్ 22న ప్రసార సేవల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ట్రాయ్ (TRAI) సవరించినందున ఈ ధరల పెంపు జరిగింది. ఆ తర్వాత జీ (ZEE), కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ సోనీ, సన్ టీవీనెట్వర్క్ తమ రిఫరెన్స్ ఇంటర్‌కనెక్ట్ ఆఫర్లను (RIO) ఫైల్ చేశాయి. ఆర్ఓఐ అనగా సర్వీస్ ప్రొవైడర్ జారీ చేసిన నియమ నిబంధనల పత్రం. ఒక సర్వీస్ ప్రొవైడర్ మరో నెట్‌వర్క్‌తో ఇంటర్కనెక్షన్ కోరుకునే నిబంధనలు, షరతులు అందులో ఉంటాయి. మరో వైపు డిస్నీ స్టార్ ఇండియా, వయాకామ్ 18 వంటి సంస్థలు కూడా త్వరలోనే ఆర్‌ఐఓలను దాఖలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు నివేదిక ప్రకారం.. టీవీ వీక్షకుల నెలవారీ టీవీ చందా బిల్లు పెరగబోతోంది. ఎందుకంటే, ప్రధాన టెలివిజన్ ప్రసారకర్తలు ఛానెల్‌ల బౌక్వెట్ రేట్లను పెంచాయి. ఛానెల్‌లను వీక్షించడానికి పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో టీవీ ఛానెల్‌లను చూడటానికి వీక్షకులు ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బౌక్వెట్స్ ధరలు 10-15% రేట్లు పెంచినట్లు సమాచారం. సోనీ తన రూ. 31 ధర గల బౌక్వెట్ని నిలిపివేసి, దాని స్థానంలో రూ. 43 కొత్తదాన్ని తీసుకొచ్చిందని ఓ కేబుల్ టీవీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వార్తా సంస్థకు తెలిపారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు..
న్యూఢిల్లీ : దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్ బ్రాడ్కాస్టర్స్కు, డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లకు కీలక సూచనలు చేసింది. వీక్షకులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కష్ట సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా టెలివిజన్ ప్రసారాలు అందించాలని కోరింది. ఈ మేరకు బ్రాడకస్టర్స్కు, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, ఎమ్‌ఎస్‌వోలకు, లోకల్ కేబుల్ ఆపరేటర్స్‌కు ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. చందదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రసారాలు అందేలా చూడాలని ఆ లేఖలో కోరింది. ఈ కష్ట సమయంలో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని తెలిపింది. ఇలా చేయడం ద్వారా కరోనాకు సంబంధించిన వార్తలను, ప్రస్తుత పరిస్థితులను ప్రజలు నిరంతరం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని సదరు మంతిత్వ శాఖ భావిస్తోంది. చదవండి : లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు -
ట్రాయ్ షాక్; ఆ షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: కేబుల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా ట్రాయ్ తీసుకొచ్చిన టారిఫ్ నిబంధనల సవరణలు కేబుల్ టీవీ ఆపరేటర్లకు షాక్ ఇచ్చాయి. స్టాక్మార్కెట్లో టీవీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కేబుల్ , ప్రసార సేవల కోసం కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో ట్రాయ్ సవరణలు చేసిన తరువాత గురువారం ఆపరేటర్ల షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి. సన్ టీవీ నెట్వర్క్ 6.37 శాతం, డెన్ నెట్వర్క్స్ 3.90 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ 2.99 శాతం, డిష్ టీవీ ఇండియా 0.85 శాతం కుప్పకూలాయి. మరోవైపు సెన్సెక్స్ 232 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో 2017 టారిఫ్ నిబంధనలను సవరించిన మరీ తీసుకొచ్చిన ట్రాయ్ కొత్త నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎంఎస్‌వోలకు షాక్, వినియోగదారులకు ఊరట -
‘సెక్సీ’ అమ్మాయిలను జూమ్ చేస్తే..
మాస్కో : అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కెమెరాలతో జూమ్ చేస్తే చర్యలు తప్పవని ఫిఫా ప్రపంచకప్ నిర్వాహకులు బ్రాడ్కాస్టర్లను హెచ్చరించారు. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో బ్రాడ్కాస్టర్లు సెక్సీ అమ్మాయిలను పదేపదే చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని, దీనికి ఫిఫా వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే ఒక ఫుట్‌బాల్ ఆటలోనే కాకుండా అన్నీ క్రీడా టోర్నీల్లోను ఇలా అందమైన అమ్మాయిలను జూమ్ చేయడం టెలివిజన్ ప్రొడ్యూసర్లు ఓ అలవాటుగా మార్చుకున్నారు. ఈ తరహా సాంప్రదాయం 1970ల్లోనే మొదలైంది. దీనికి ఆద్యుడు అమెరికన్ టెలివిజన్ డైరెక్టర్ ఆండీ సిదారిస్. ఈ ఓల్డ్ మ్యాన్ క్రీడా టోర్నీల్లో ‘హానీ షాట్స్’ తీయడంపై ఆసక్తి కనబర్చేవాడు. ఇలా అమ్మాయిలను చూపించడం ఫుట్‌బాల్‌లోనే కాకుండా క్రికెట్‌లోను కనిపిస్తోంది. టెలివిజన్ల తీరుపై ఫిఫా బాస్ ఫెడెరికో అడెక్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిని ఫిఫా ఉపేక్షించబోదని, వీటిపై ఓ పాలసీ రూపొందించి ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నాడు. రష్యాలో అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షించటానికి ఫేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైరా పవర్ తెలిపారు. సెక్సీజమ్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓ సమస్యగా మారిందన్నారు. కొంత మంది ఆకతాయిలు సెక్సీ అమ్మాయిల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
మూడు టెస్టులకు రూ. 9 కోట్లే!
శ్రీలంక బోర్డు నిరాశ కొలంబో: భారత్‌తో సిరీస్ అంటే భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని ఆశపడిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బ్రాడ్కాస్టర్లు షాక్ ఇచ్చారు. సొంతగడ్డపై ఈ ఏడాది ఆగస్టులో జరిగే మూడు టెస్టుల సిరీస్ ప్రసార హక్కుల కోసం టెన్ స్పోర్ట్స్ కేవలం 1.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9 కోట్లు) మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క చానల్ మినహా మరెవరూ హక్కుల కోసం టెండర్ వేయలేదు. ఇదే సిరీస్‌లో సంగక్కర తన కెరీర్ చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఆరంభంలో స్టార్, సోనీ సంస్థలు ఆసక్తి చూపించినా టెండర్ మాత్రం వేయలేదు. ఇటీవల ప్రపంచకప్, ఐపీఎల్ల కారణంగా ఈ చానల్స్ బ్రాడ్‌కాస్టింగ్ బడ్జెట్ అయిపోవడంతో పాటు వర్షాలు కూడా సిరీస్‌ను దెబ్బ తీసే అవకాశం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘భారత్‌తో ఒక్కో మ్యాచ్‌కు కనీసం 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 13 కోట్లు) అయినా వస్తాయని ఆశించాం. కానీ ఈ పరిణామం మమ్మల్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఇప్పుడు కోట్ చేసిన మొత్తం చాలా చాలా తక్కువ. దీనిని పెంచమని టెన్‌స్పోర్ట్స్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తాం. లేదంటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తాం’ అని లంక బోర్డు చైర్మన్ సిదాత్ వెట్టిముని ఆవేదనగా చెప్పారు. గత ఏడాది విండీస్ జట్టు అర్ధాంతరంగా వెనుదిరగడంతో భారత్ వచ్చి వన్డేలు ఆడిన లంకకు ప్రత్యుపకారంగా బీసీసీఐ ఈ సిరీస్ ఆడించేందుకు సిద్ధమైంది.