‘సెక్సీ’ అమ్మాయిలను జూమ్‌ చేస్తే.. | No Zooming In On Hot Female Fans | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 10:32 AM | Last Updated on Sun, Jul 15 2018 2:20 PM

No Zooming In On Hot Female Fans - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మాస్కో : అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్‌ చేస్తూ కెమెరాలతో జూమ్‌ చేస్తే చర్యలు తప్పవని ఫిఫా ప్రపంచకప్‌ నిర్వాహకులు బ్రాడ్‌కాస్టర్‌లను హెచ్చరించారు. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీలో బ్రాడ్‌కాస్టర్‌​లు సెక్సీ అమ్మాయిలను పదేపదే చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని, దీనికి ఫిఫా వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే ఒక ఫుట్‌బాల్‌ ఆటలోనే కాకుండా అన్నీ క్రీడా టోర్నీల్లోను ఇలా అందమైన అమ్మాయిలను జూమ్‌ చేయడం టెలివిజన్‌ ప్రొడ్యూసర్లు ఓ అలవాటుగా మార్చుకున్నారు. ఈ తరహా సాంప్రదాయం 1970ల్లోనే మొదలైంది. దీనికి ఆద్యుడు అమెరికన్‌ టెలివిజన్‌ డైరెక్టర్‌ ఆండీ సిదారిస్‌. ఈ ఓల్డ్‌ మ్యాన్‌ క్రీడా టోర్నీల్లో ‘హానీ షాట్స్‌’  తీయడంపై ఆసక్తి కనబర్చేవాడు. ఇలా అమ్మాయిలను చూపించడం ఫుట్‌బాల్‌లోనే కాకుండా క్రికెట్‌లోను కనిపిస్తోంది.

టెలివిజన్‌ల తీరుపై ఫిఫా బాస్‌ ఫెడెరికో అడెక్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిని ఫిఫా ఉపేక్షించబోదని, వీటిపై ఓ పాలసీ రూపొందించి ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నాడు.  రష్యాలో అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షించటానికి ఫేర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పైరా పవర్‌ తెలిపారు. సెక్సీజమ్‌ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓ సమస్యగా మారిందన్నారు. కొంత మంది ఆకతాయిలు సెక్సీ అమ్మాయిల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.




No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement