ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్‌లోని లాకర్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్‌టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది.
తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్‌ను ప్రశ్నించాడు.
''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్ జడ్డి ఆదేశించారు.
2018 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు
2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం
Comments
Please login to add a commentAdd a comment