Benjamin
-
విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత
-
ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు
జెరూసలెం: యుద్ధ నేరాల కింద తనకు అరెస్టు వారెంట్ ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో ప్రాసిక్యూటర్ చేసిన వాదనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మండిపడ్డారు. అబద్ధాల ఆధారంగా తనపై ఆ వారెంట్ కోరుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయన బుధవారం(మే22) మీడియాతో మాట్లాడారు. గాజాలో ఆకలి కేకలను అడ్డం పెట్టుకుని హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోందన్న వాదనను ఖండించారు. ఆకలి మంటలను ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని గతంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.ఇదే గనుక నిజమైతే దానిని యుద్ధ నేరం కింద పరిగణిస్తామని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐక్యరాజ్యసమితి ఆందోళన సరైనదే అనేందుకు కావాల్సిన ఆధారాలున్నాయని ఐసీసీ ప్రాసిక్యూటర్ల బృందం తాజాగా వెల్లడించింది. -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్‌కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా'
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్లోని లాకర్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్‌ను ప్రశ్నించాడు. ''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్ జడ్డి ఆదేశించారు. 2018 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపికచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానంచేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఐజాక్ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్ పెరీస్‌సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
Benjamin J W Mills: ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
లీడ్స్(యూకే): అనంతమైన విశ్వంలో మనమంతా ఒంటరి జీవులమా? లేక ఇతర గ్రహాలపైనా జీవం ఏదైనా ఉందా? మన సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాలపై వాతావరణం ఉనికి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా మానవులను వేధిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధాలు కనిపెట్టేందుకు జిజ్ఞాసులు అలుపెరుగని కృషి సాగిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవం జాడ తెలుసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. రహస్యాన్ని ఛేదించే విషయంలో మనం కొంత పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసింతవరకూ కేవలం మన భూగోళంపైనే జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ను శ్వాసిస్తున్నాయి. జీవుల మనుగడకు ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరమన్న సంగతి తెలిసిందే. భూమిపై ఆక్సిజన్ ఎల్లవేళలా ఒకేలా లేదని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన బయోకెమికల్ మోడలింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ బెంజమిన్ జేడబ్ల్యూ మిల్స్ చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఆక్సిజన్ పరిమాణం మారుతూ వచ్చిందని అన్నారు. ఈ మార్పు ఎప్పుడు, ఎలా జరిగిందో, ఆయా సమయాల్లో ఏయే జీవులు పుట్టాయో కచ్చితంగా తెలుసుకుంటే ఇతర గ్రహాలపై ఉన్న వాయువుల పరిమాణం గురించి, తద్వారా అక్కడి జీవజాలం గురించి ఒక అంచనాకు రావొచ్చని వివరించారు. మన గ్రహంపై ఉన్న ఆక్సిజన్ పరిమాణంపై తమ పరిశోధనలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. భూమిపై ఆక్సిజన్, జీవం భూగోళంపై వాతావరణంలో ప్రస్తుతం 21 శాతం ఆక్సిజన్ ఉంది. అయితే, ఇప్పుడున్నంత ఆక్సిజన్ కోట్ల సంవత్సరాల క్రితం లేదు. గతంలోకి.. అంటే 45 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అక్కడ జీవించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా వెంట తీసుకొని పోవాల్సిందే. ఎందకంటే అప్పట్లో స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ ఉండేది. జీవులు కూడా ఇంకా పుట్టలేదు. ప్రధానంగా మూడు దశల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై పెరిగాయి. మొదటిది ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’. దాదాపు 240 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. భూమిపై వాతావరణం ఏర్పడింది. ఆక్సిజన్ నిల్వలు ప్రారంభమయ్యాయి. రెండోది నియోప్రొటెరోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్ (ఎన్ఓఈ). 80 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. భూమిపై ఆక్సిజన్ పరిమాణం పెరిగింది. దాదాపు ఇప్పుడున్న స్థాయికి ప్రాణవాయువు చేరుకుంది. ఆ తర్వాత 20 కోట్ల సంత్సరాలకు భూమిపై తొలితరం జంతువులు పుట్టాయి. మూడోది ‘పాలెజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్’.. 42 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఆక్సిజన్ ఇప్పుడున్న స్థాయికి పూర్తిగా చేరింది. 75 కోట్ల ఏళ్ల క్రితం భూమి వాతావరణంలో కేవలం 12 శాతం ఆక్సిజన్ ఉండేది. ఇది ఇప్పుడు 21 శాతానికి ఎగబాకింది. ఆక్సిజన్ పరిమాణాన్ని బట్టి కొత్త జీవులు ఉద్భవించడం, పాతవి అంతరించిపోవడం వంటివి జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొక్కలు పుట్టాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్ఏ) భాగస్వామ్యంతో గత ఏడాది జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది మన సౌర మండలం ఆవల ఉన్న గ్రహాలపై వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తోంది. అక్కడి వాయువులు, వాటి పరిమాణం గురించి తెలిస్తే జీవం ఉందా? లేదా? అనేది తేల్చవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి
సాక్షి, నాగోలు: తెలంగాణ అమ్మాయి.. ఇంగ్లాండ్‌కు చెందిన అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో నాగోలు పీఎంఆర్ కన్వెన్షన్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి విఘ్నేశ్వర్ రెడ్డి, లత భార్యాభర్తలు. వీరు కొంతకాలం క్రితం నగరానికి వచ్చి ఎల్బీ నగర్లో నివాసముంటున్నారు. వీరి కుమార్తె సింధూజ ష్యాషన్ డిజైన్ కోర్సు చేయడానకి ఎనిమిదేళ్ల కిందట ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంజిమిన్ డేవిడ్ హాస్‌తో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. ఇరువురి తల్లిదండ్రులూ అంగీకరించటంతో వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకు వరుడి తల్లిదండ్రులు జోమే హాస్, రోబెక్ట్ హాస్‌తో పాటు వారి బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
మధుమేహం..బీపీ మందులతో
మధుమేహం... రక్తపోటుల చికిత్సకు వాడే రెండు మందులు కలిపి వాడితే కేన్సర్ కణితుల పెరుగుదలను అడ్డుకోవచ్చునని అంటున్నారు బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్ కణాలు పెరిగేందుకు అవసరమైన ఇంధన సరఫరాలను అడ్డుకోవడం ద్వారా ఈ మందులు కణితి పెరుగుదలను అడ్డుకుంటాయని సెల్ రిపోర్ట్స్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మధుమేహం కోసం వాడే మెట్ఫార్మిన్ నేరుగా కేన్సర్ కణాలపై దుష్ప్రభావం చూపగలదని.. అయితే ఈ మందును వాడే మోతాదు కారణంగా ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని... సైరోసింగోపైన్ అనే రక్తపోటు నివారణ మందు కూడా చేరినప్పుడు ప్రభావం ఎక్కువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బెంజిమన్ తెలిపారు. పోషకాలను శక్తిగా మార్చే కీలకమైన అణువు ఎన్ఏడీ + తగినంత ఉత్పత్తి కాకుండా ఈ మందుల మిశ్రమం కేన్సర్ కణాలపై ప్రభావం చూపుతుందని హాల్ వివరించారు. కేన్సర్ కణాలు అత్యధికం తమ శక్తి అవసరాల కోసం గ్లూకోజ్‌ను లాక్టేట్‌గా మార్చుకుంటాయని, సైరోసింగోపైన్ ఈ లాక్టేట్ను సరఫరా చేసే రెండు మూలకాలను అడ్డుకుంటుందని తమ పరిశోధనల్లో తెలిసినట్లు బెంజిమన్ వివరించారు. -
ఈతే అతని ప్రయాణ మార్గం..
జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉండే విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ల వల్ల సమయానికి ఆఫీసులకు, స్కూళ్లకు చేరుకోవడానికి అక్కడివారు ఎంతో ఆపసోపాలు పడుతున్నారు. గంటలు గంటలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. కానీ ఈ కష్టాలన్నిం టినీ ఈది పారేస్తున్నాడు 40 ఏళ్ల బెంజమిన్ డేవిడ్. రోజూ ఆ పట్టణం నడిబొడ్డున ప్రవహిస్తున్న ఇసార్ నదిలో ఈదుకుంటూ బెంజమిన్ ఆఫీసుకు చేరుకుంటున్నాడు. దశాబ్దాలుగా ఈ నదిని ప్రయాణం నిమిత్తం ఎవరూ ఉపయోగించలేదు. కానీ రెండేళ్లుగా బెంజమిన్ మాత్రం తన ప్రయాణ మార్గంగా వినియోగిస్తున్నాడు. ఈ ప్రయాణ మార్గం ద్వారా అతను కేవలం అర్ధగంటలోనే రెండు కిలోమీటర్ల దూరంలోని కుల్టర్స్ట్రాండ్లో ఉన్న తన ఆఫీసుకు చేరుకుంటున్నాడు. ఒక చక్కని బ్యాగులో తడవకుం డా బట్టలు పెట్టుకుని ఈత కొట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు. గమ్యానికి చేరుకోగానే బ్యాగులోని బట్టలు తీసి ఎంచక్కా ఆఫీసుకు వెళ్లిపోవడం అతని దినచర్య. అయితే నదిలో ఈత కొట్టడం ఎంతో ప్రమాదకరం. కాబట్టి ప్రతి రోజూ ఉద్యోగానికి వెళ్లే ముందు ఆన్లైన్ నీటి స్థాయి, ఉష్ణోగ్రత, పీడనం ఎంతుందో గమనించి వెళుతుంటాడు. అన్నీ సేఫ్ లెవెల్లో ఉంటేనే ఈతకు సిద్ధపడతాడు. ఒకవేళ ఆ రోజు ఈత కొట్టడం మంచిది కాదని భావిస్తే మాత్రం సాధారణ ప్రయాణ మార్గాన్ని ఆశ్రయిస్తాడు. -
మల్లన్న హుండీలో సాంబ్రాణి రవ్వలు
- రూ.1,060 దగ్ధం శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో సోమవారం పొరపాటున సాంబ్రాణి నిప్పు రవ్వలు పడడంతో హుండీలోని రూ.1060 దగ్ధమైనట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. శ్రీస్వామివార్ల ఆలయంలోని హుండీని మంగళవారం దేవాదాయశాఖ అధికారి సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ.6,42,373 వచ్చిందని.. ఇందులో నిప్పు రవ్వల వల్ల రూ.1,060 వినియోగానికి అవకాశం లేకుండా పోయినట్లు వెల్లడించారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, మహామంగళహారతి సేవలు, సాయంత్రం జరిగే మహామంగళహారతి సేవలలో స్వామివార్లకు ప్రత్యేకంగా సాంబ్రాణితో ధూపం వేస్తారు. సోమవారం స్వామివార్ల హారతుల సమయంలో ధూపంవేసి గర్భాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న హుండీలో నిప్పురవ్వ హుండీలో పడినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది కూడా ఇది గమనించకపోవడం.. కొద్దిసేపటికి హుండీల్లో పొగరావడంతో వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
పసి వయసులోనే వృద్ధాప్యం!
చిన్న పిల్లలకు సోకే అత్యంత అరుదైన చర్మవ్యాధి బెంజమిన్ బటన్. పసివయసులోనే వృద్ధాప్యం వచ్చినట్లుగా మారిపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ చర్మవ్యాధి సోకిన చిన్నారులు వయసు పైబడినవారిలా కనిపిస్తారు. ఏడేళ్ల అంజలి కుమారి, 18 నెలల కేశవ్ కుమార్ లాంటి చాలా మంది ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే చర్మమంతా ముడతలు పడిపోయి, వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. జన్యుపరంగా వచ్చే ఆ అరుదైన రుగ్మతతో అక్కాతమ్ముళ్లు బాధపడుతున్నారు. జార్ఖండ్ రాంచికి చెందిన అంజలి, కేశవ్‌లను క్యూటిస్ లాక్సాగా పిలిచే అత్యంత భయంకరమైన రోగం పట్టిపీడిస్తోంది. శత్రుఘ్న రాజక్, రింకీదేవి దంపతులకు అంజలి, కేశవ్ లతో పాటు... 11 ఏళ్ల మరో కుమార్తె శిల్పి కూడా ఉంది. ఆమెలో మాత్రం పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా కనిపించలేదట. ఇండియాలో డాక్టర్లు కూడా ఈ వ్యాధిని తగ్గించడం కష్టమని చెప్పేశారు. అయితే తమను వీధిలోని వారంతా వింతగా చూస్తున్నారని, చెత్త కామెంట్లు చేస్తున్నారని అంజలి వాపోతోంది. దాది అమ్మా (బామ్మ), బుడియా (ముసలి), బందరియా (కోతి) వంటి పదాలతో పిలుస్తూ స్కూల్లో అంతా గేలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ పిల్లలకు సోకిన ఈ వింతవ్యాధి ఎప్పటికైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వైద్యులు మాత్రం దీనికి ఇతర దేశాల్లో తప్ప.. భారత్‌లో మందు లేదని తేల్చిచెప్పేశారు. లాండ్రీ మ్యాన్‌గా పనిచేస్తూ నెలకు రూ. 4,500 మాత్రమే సంపాదించే శత్రుఘ్నకు విదేశాల్లో వైద్యం చేయించే తాహతు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఎప్పటికైనా తమ పిల్లలు సాధారణ స్థితికి వస్తారని ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
her కేలియే..
పాప్ సింగర్‌గా ఉర్రూతలూగించే పాటలతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన రెగ్గి బెంజిమన్.. తన కళను ఓ ప్రయోజనానికి వేదికగా మలచుకున్నాడు. అవనిలో అతివలపై జరుగుతన్న దాడులను అడ్డుకునే లక్ష్యంతో.. ఆమె కోసం.. మిషన్ సేవ్ హర్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. బుధవారం హైదరాబాద్‌లో తన ఫౌండేషన్ విధివిధానాలను తెలియజేశాడు. తాను రాసిన ‘సేవ్ హర్’ పాటను పాడి వినిపించారు. ఈ సందర్భంగా బెంజిమన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... - వాంకె శ్రీనివాస్ మా పేరెంట్స్‌ది మెదక్ జిల్లాలోని నర్సాపూర్. నాన్న రాస్కో బెంజిమన్ పాస్టర్. అమ్మ రోజ్ బెంజిమన్ నర్స్. నేను పుట్టకముందే వాళ్లు కెనెడాకు వెళ్లారు. నేను కెనెడాలోనే పుట్టాను. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు అమెరికాకు షిఫ్ట్ అయ్యాం. స్కూలింగ్, కాలేజ్ డేస్ అంతా చికాగాలోనే సాగిపోయాయి. నాన్న క్రిస్టియన్ ప్రీచర్ కావడంతో చిన్నతనంలోనే మ్యూజిక్ అబ్బింది. మ్యూజిక్ వాయిస్‌లో డిగ్రీ చేశాను. బిజినెస్ కమ్యూనికేషన్ కోర్స్ కూడా చేశాను. తర్వాత మ్యూజిక్కే పూర్తి టైమ్ కేటాయించాను. నా ఫస్ట్ ఆల్బమ్ 2ఎక్స్ సెంట్రిక్స్కు ఇండియాలో మంచి ఆదరణ లభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. పాప్ కెరీర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. నా పాటలు 25 దేశాల్లో వినిపిస్తున్నాయి. ఇండో, అమెరికన్ పాప్ స్టార్‌గా పేరు రావడం ఆనందంగా ఉంది. ఆ ఘటన కదిలించింది.. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు, ఇండియాలో ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ లైంగిక వేధింపులకు గురువుతున్నారు. కెనెడాలో ప్రతి 17 మంది మహిళల్లో ఒకరు, యూకేలో ప్రతి ఐదుగురి ఆడవాళ్లలో ఒకరిపై అత్యాచారం జరుగుతోంది. ఇటీవల ఇండియాలో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి జరిపి.. ఆపై వారిని ఉరి తీయడం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడాను. ఇక్కడ మహిళల అక్రమరవాణా కూడా ఆందోళనకర స్థాయిలో సాగుతోంది. తల్లిలా చూడాల్సిన ఆడవారిపై జరుగుతున్న దాడులను ఆపడానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నా. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడి ‘మిషన్ సేవ్ హర్’ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టా. ‘సేవ్ హర్’ అనే పాట రాసి.. పద్నాలుగు మంది హాలీవుడ్ సెలబ్రిటీలతో పాడించాను. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది. ఈ పాట విని కొందరైనా.. మారితే చాలు. ఈ ఆల్బమ్‌కు వచ్చే నిధులను ‘సేవ్ హర్ ఫౌండేషన్’కు అందేలా చూస్తున్నాం. స్పెషల్ ఫోకస్... ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ హర్’ విస్తరించాలని భావిస్తున్నాం. భారత్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. ముంబై, పూణె, ఢిల్లీ, బెంగళూరులలో మా సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించాం. నాకు మంచి పేరెంట్స్‌తో పాటు ఎంతో మంది భారత్ అభిమానులను ఇచ్చిన ఈ పుణ్యభూమికి ఈ రకంగానైనా సేవ చేయాలనుకుంటున్నా. అందరి సహకారం అందుతుందని ఆశిస్తున్నా. -
బెంజిమన్ హత్య కేసులో ఏడుగురి అరెస్టు
నూజివీడు : మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగ గా భావించి స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన కేసులో నూజివీడు మండలం అన్నవరం గ్రా మానికి చెందిన ఏడుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కేవీ స త్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అ న్నవరంలో ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి సమయంలో సంచరిస్తున్న ముదినేపల్లి చిగురుకోటకు చెందిన మతిస్థిమితం లేని సంధి బెంజి మన్(46)ను దొంగగా భావించి గ్రామస్తులు పలువురు స్తంభానికి కట్టివేసి చితకబాదారు. ఈ ఘటనలో బెంజిమన్ మరణించాడు. దీని పై కేసు నమోదైంది. దర్యాప్తు సందర్భంగా గ్రామానికి చెందిన ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో పోలిశెట్టి సీతారామయ్య, లేళ్ల గోపాలరావు, యాదల వెంకటేశ్వరరావు, పాటిమీద ప్రసాదరావు, దున్నపోతుల శ్రీనివాసరావు, మొలుగుమాటి కృష్ణమోహన్, మట్టా రామకృష్ణలను బుధవారం ఉదయం అన్నవరంలో అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్బసాని అవినాష్‌ను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులున్నారని, వారిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుడు బీ టెక్ చదివాడని, విజయవాడలోని ఓ ప్రైవేటు మందుల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా పనిచేశాడన్నారు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారన్నా రు. ఇ తని తండ్రి కూడా విజయవాడలోని అదే కంపెనీలో ఏజీఎంగా పనిచేశాడన్నారు. బెంజిమన్ మతిస్థిమితం లేకపోవడంతో ఊళ్ల వెంట తిరుగుతాడని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. అన్నవరం వాసులు తొందరపాటుతో దొంగ గా భావించి కొట్టడంతోచనిపోయాడన్నారు. ఎవరినీ కొట్టవద్దు రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గ్రామస్తులు ఎక్కడైనా పట్టుకుంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలే గానీ కొట్టవద్దని సీఐ సత్యనారాయణ సూచించారు. చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతులలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.