![ఈతే అతని ప్రయాణ మార్గం..](/styles/webp/s3/article_images/2017/09/5/61501358045_625x300.jpg.webp?itok=NkGYl_PF)
ఈతే అతని ప్రయాణ మార్గం..
ఈ ప్రయాణ మార్గం ద్వారా అతను కేవలం అర్ధగంటలోనే రెండు కిలోమీటర్ల దూరంలోని కుల్టర్‌స్ట్రాండ్‌లో ఉన్న తన ఆఫీసుకు చేరుకుంటున్నాడు. ఒక చక్కని బ్యాగులో తడవకుం డా బట్టలు పెట్టుకుని ఈత కొట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు. గమ్యానికి చేరుకోగానే బ్యాగులోని బట్టలు తీసి ఎంచక్కా ఆఫీసుకు వెళ్లిపోవడం అతని దినచర్య. అయితే నదిలో ఈత కొట్టడం ఎంతో ప్రమాదకరం. కాబట్టి ప్రతి రోజూ ఉద్యోగానికి వెళ్లే ముందు ఆన్‌లైన్ నీటి స్థాయి, ఉష్ణోగ్రత, పీడనం ఎంతుందో గమనించి వెళుతుంటాడు. అన్నీ సేఫ్ లెవెల్లో ఉంటేనే ఈతకు సిద్ధపడతాడు. ఒకవేళ ఆ రోజు ఈత కొట్టడం మంచిది కాదని భావిస్తే మాత్రం సాధారణ ప్రయాణ మార్గాన్ని ఆశ్రయిస్తాడు.