విలి్మంగ్టన్: గాజాలో హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు.
తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment