
సాక్షి, నాగోలు: తెలంగాణ అమ్మాయి.. ఇంగ్లాండ్‌కు చెందిన అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో నాగోలు పీఎంఆర్ కన్వెన్షన్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి విఘ్నేశ్వర్ రెడ్డి, లత భార్యాభర్తలు. వీరు కొంతకాలం క్రితం నగరానికి వచ్చి ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్నారు.
వీరి కుమార్తె సింధూజ ష్యాషన్ డిజైన్ కోర్సు చేయడానకి ఎనిమిదేళ్ల కిందట ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెంజిమిన్ డేవిడ్ హాస్‌తో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. ఇరువురి తల్లిదండ్రులూ అంగీకరించటంతో వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకు వరుడి తల్లిదండ్రులు జోమే హాస్, రోబెక్ట్ హాస్‌తో పాటు వారి బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment