ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో వీరిద్దరు టాలీవుడ్ నటుడు మురళిమోహన్ మనవరాలు రాగా మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ వేడుక్లలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్ చేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. శ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment