టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి పెళ్లి వేడుక జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేదికను సిద్ధం చేస్తున్నట్లు చైతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే వీరి పెళ్లి వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఓటీటీ రైట్స్‌కు ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. నాగ చైతన్య, శోభితాల వివాహ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించిన వార్తలను అక్కినేని ఫ్యామలీ ఇంకా ధృవీకరించలేదు.
అయితే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. చైతూ- శోభిత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లిని సింపుల్‌గానే నిర్వహించాలని నాగ చైతన్య కోరినట్లు ఇటీవల నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులను శోభిత, చైతూనే చూసుకుంటున్నట్లు తెలిపారు.
Naga Chaitanya - Sobhita Dhulipala wedding rights bagged by netflix for a whopping ₹50 cr. pic.twitter.com/w6P4x1i9ZK
— Manobala Vijayabalan (@ManobalaV) November 26, 2024
Comments
Please login to add a commentAdd a comment