టాలీవుడ్ హీరో నాగచైతన్య గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి కోసం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగానే వేదికను ఏర్పాటు చేశారు. హీరో వెంకటేశ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు.
పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు చైతూ, శోభిత. ఈ పొంగల్ వేడుక ఫోటోలను శోభిత ఇన్ స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. భోగిమంటతో పాటు ముగ్గులు వేసిన ఫోటోలను పంచుకుంది. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా శోభిత సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.
కాగా.. నాగ చైతన్య, శోభిత ధూళిపాల 2022 నుంచి రిలేషన్‌లో ఉన్నారు. గతేడాది ఆగస్టు 8న ఈ జంట హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.
తండేల్‌లో నాగ చైతన్య..
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తండేల్ కథేంటంటే..
నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment