టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మన తండేల్ హీరో చైతూ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా వెడ్డింగ్ ప్లానింగ్ విషయంలో క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందన్నారు. శోభిత మన తెలుగు సంప్రదాయాలను పాటిస్తుందని తెలిపారు. మా పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆమెనే డిజైన్ చేసిందని వెల్లడించారు. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనని నాగచైతన్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment