అఫీషియల్: నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు | Naga Chaitanya and Sobhita Dhulipala Knot On This Date Goes Viral | Sakshi
Sakshi News home page

Naga Chaitanya-Sobhita: నాగచైతన్య- శోభిత పెళ్లి డేట్ ఫిక్స్‌

Published Wed, Oct 30 2024 5:08 PM | Last Updated on Wed, Oct 30 2024 7:50 PM

Naga Chaitanya and Sobhita Dhulipala Knot On This Date Goes Viral

అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఏఎన్నార్‌ శతజయంతి వేడుకల్లోనూ శోభిత ధూళిపాళ్ల మెరిసింది. తమ కాబోయే కోడలిని మెగాస్టార్‌ చిరంజీవికి నాగార్జున పరిచయం కూడా చేశారు.

తాజాాగా వీరి పెళ్లి తేదీపై నాగార్జున కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై స్పందించారు. అదే రోజున వివాహం జరగనుందని అక్కినేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

అయితే ఎంగేజ్‌మెంట్‌ జరిగిన తర్వాత నుంచి వీరి పెళ్లి తేదీపై నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారా? లేదంటే కొత్త సంవత్సరంలో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందా? అని నెటిజన్స్‌తో పాటు అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. తాజాగా జరిగిన ఏఎన్నాఆర్‌ శతజయంతి వేడుకల్లో శోభిత కనిపించడంతో మరోసారి పెళ్లి తేదీపై మరోసారి ఆరా తీశారు.

పెళ్లి తేదీపై రూమర్స్...

గత కొద్ది రోజులుగా ఈ జంట ఈ ఏడాది డిసెంబర్‌లోనే పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. చై- శోభిత డిసెంబర్ మొదటి వారంలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు టాలీవుడ్‌లోనూ టాక్ వినిపించింది. వచ్చే డిసెంబరు 4న వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అందరూ అనుకున్నట్లుగానే పెళ్లి తేదీ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది. 

(ఇది చదవండి: రామ్‌చరణ్‌,వెంకటేష్‌ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే‌: దర్శకుడు )

మొదలైన పెళ్లి పనులు..

ఇటీవల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించింది. శోభిత ఇంట్లో  తన తల్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు అక్కినేని ఫ్యాన్స్‌ వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

తండేల్‌తో చైతూ బిజీ..

కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. మత్స్యకారుల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement