simha
-
నవ్వించేలా 'మత్తు వదలరా 2' టీజర్
సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ పేరుతో సీక్వెల్‌గా వస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. పార్ట్ 1 మాదిరే ఇందులో కూడా శ్రీ సింహా, సత్యలు కామెడీ అదుర్స్ అనేలా ఉంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. -
'మత్తు వదలరా' సీక్వెల్ విడుదలపై ప్రకటన
సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ లాంటి సినిమాలు శ్రీసింహ చేసినా పెద్దగా మెప్పించలేకపోయాడు. దీంతో తన హిట్ సినిమా మత్తు వదలరా సీక్వెల్‌ను స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు.డైరెక్టర్ రితేష్- శ్రీసింహా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 13న 'మత్తు వదలరా-2' చిత్రాన్ని విడుదల చేస్తామని ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. పార్ట్-1లో శ్రీ సింహతోపాటు అతని సహచరుడిగా నటించిన సత్య కూడా ఈ సీక్వెల్లో ఉండనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి కొత్తగా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
‘భాగ్ సాలే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నిఖిల్ సింహా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో తారల సందడి (ఫొటోలు)
-
ఓటీటీలో అమ్ము, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన చిత్రం అమ్ము. నవీన్ చంద్ర, సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. చారుకేశ్ శేఖర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కల్యాణ్ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 19 నుంచి ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అమ్ము టీజర్‌ను రిలీజ్ చేసింది. 'నా పేరు అమ్ము. మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు' అంటూ హీరోయిన్ పరిచయంతో వీడియో మొదలవుతుంది. మరి ఎంతో గారాబంగా పెరిగిన అమ్ము పెళ్లి తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అసలు అమ్ముకేం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! she’s fierce, she’s strong & she’s got a story to tell! ✨ watch #AmmuOnPrime, Oct 19 @karthiksubbaraj @StoneBenchers #KalyanSubramaniam @CharukeshSekar @aishwaryaleksh7 @Naveenc212 @ActorSimha pic.twitter.com/sr5AVZphmX — prime video IN (@PrimeVideoIN) October 6, 2022 చదవండి: ఓటీటీలో లాల్‌సింగ్ చడ్డా బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో నటుడు, ఆస్పత్రికి తీసుకెళ్లగా -
నటుడు సింహా ప్రధాన పాత్రలో ‘రావణ కల్యాణం’
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రావణ కల్యాణం’. ఆలూరి సురేష్, సింహా సమర్పణలో జేవీ మధుకిరణ్ దర్శకత్వంలో అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం ఆరంభమైంది. తొలి సీన్‌కి యాక్టర్ సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సింహా మాట్లాడుతూ.. ‘‘రావణ కల్యాణం’ కథ విన్నప్పుడు నేనెంత ఎగై్జట్ అయ్యానో, థియేటర్స్‌లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు అంతే ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సందీప్ మాధవ్, రాజేంద్రప్రసాద్, శత్రు, శరత్ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. రధన్ సంగీతం, మనోహర్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్. -
‘తెల్లవారితే గురువారం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్
-
చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్ విషెస్ అందజేశారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన హీరో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం.. 'పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్లికి ముందే జరిగిపోతే నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టముంటది' అని హీరో ఫ్రెండ్ వాదించడం లాంటి అంశాలతో టీజర్ మొదలవుతుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి హీరో తన లవ్ స్టోరీ గురించి వినిపిస్తూ..నువ్వు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ మర్యాదరామన్న' అంటూ చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన టీజర్..సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. చిత్ర షుక్ల, మిషా నారంగ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కొర్రపాటి సమర్పణలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సినిమా టైటిల్‌తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు ‘తెల్లవారితే గురువారం’ ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చదవండి : (అల్లు అర్జున్‌కు నో చెప్పడమా?: ప్రియా వారియర్) (అదీ ప్రభాస్ రేంజ్: వంద కోట్ల రెమ్యునరేషన్!) Here is super fun teaser of #ThellavaritheGuruvaram 💯https://t.co/WLo3DjgagU Looking forward for the release. Good luck to the entire team! 👍🏽@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni @VaaraahiCC @Loukyaoffl @Chitrashukla73 @NarangMisha pic.twitter.com/jcxWmw8FA1 — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 26, 2021 -
‘తెల్లవారితే గురువారం’.. ఏం జరిగింది?
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మరి గురువారం ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే. మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చిత్రా శుక్లా, మిషా నారంగ్ కథానాయికలుగా నటించారు. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్ రగుతు. చదవండి: విజయ్ దేవరకొండ సినిమా డేట్ ఫిక్స్ శంకర్ దర్శకత్వంలో చరణ్? -
అఘోరాగా బాలయ్య.. ఇది నిజమేనంటా
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారని లీకువీరులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర తొలి షెడ్యూల్ షూటింగ్ వారణాసిలో జరపుకోవడంతో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బోయపాటి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘మా కాంబినేషన్ లో అభిమానులు ‘సింహా’ చూశారు. ఆ తర్వాత ‘లెజెండ్’ చూశారు. ఈసారి అంతకుమించి కొత్తదనం చూపించాలని అందుకే వందశాతం కష్టపడుతున్నాం. కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు. అభిమానులను కనువిందు చేస్తారు. ఇక అఘోరా విషయానికి వస్తే అఘోరా టైపు క్యారెక్టర్ ఉన్నమాట వాస్తవమే. అయితే దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే’అంటూ బోయపాటి పేర్కొన్నారు. దీంతో ఈ కొత్త చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించడం ఫిక్సని అర్థమయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అంజలి ఓ హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చదవండి: ‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ నిహారిక, యశ్‌ల డ్యాన్స్ చూశారా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గమ్మత్తుగా..
-
రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరో..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలకు ఆయన కుటుంబం అంతా కలిసి పనిచేస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి ప్రతీచిత్రానికి ఆయన అన్న సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతమందిస్తూ వస్తున్నారు. ఈ కుటుంబం నుంచి టెక్నికల్ ఫీల్ట్‌లో చాలా మందే ఉన్నా ఇంత వరకు తెర మీద కనిపించిన వారు చాలా తక్కువ. తాజాగా ఈ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీరవాణి తనయుడు సింహా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న డిఫరెంట్ సినిమాతో సింహా అరంగేట్రం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో కీరవాణి మరో కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడిగా మారనున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కీరవాణి తనయుడు సింహా -
బోయపాటితో మరోసారి..!
నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌గా నిలిచిన సింహా, లెజెండ్ సినిమాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇంతటి ఘనవిజయాలను అందించిన బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కూడా బోయపాటితో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. బాలయ్య వందో సినిమా బోయపాటి దర్శకత్వంలోనే చేయాల్సి ఉండగా అప్పటికే కమిట్ అయిన సినిమాల కారణంగా మిస్ అయ్యింది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా మొదలు కాబోతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా సమాచారం ప్రకారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. -
'మార్చిలో బీసీ సింహ గర్జన'
విజయవాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే యోచనకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని వంద కులాల బీసీ వర్గ నేతలు నిర్ణయించారు. కాపు రిజర్వేషన్లపై విజయవాడలోని ఐలాపురంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు పులువురు నేతలు హాజరు అయ్యారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపులను బీసీ జాబీతాలో చేర్చితే బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేరిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
సినిమా చూపిస్త మావా..
పేరు సింహా. ‘రేసుగుర్రం’లో ‘సినిమా చూపిస్త మావా’... తెలుసంటే, ఆయన గొంతు మీకు సుపరిచితమే. ‘నేను పెళ్లికి రెడీ’లో ‘నీవు నేను ఒకటేలే..’ అనే మెలోడీ ద్వారా పరిచయమైన సింహా, 12 ఏళ్లలో 200 పాటల వరకూ పాడారు. వాటిలో ‘పిల్లా నీ కళ్లకున్న కాటుకేమో సూపరే’ (లయన్), ‘అరే జంక్షన్లో.. జంక్షన్లో..’ (ఆగడు) లాంటి హిట్స్ అనేకం. తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డందుకున్న ఈ ఉత్తమ గాయకుడితో చిట్‌చాట్... మొత్తం మీ లైఫ్ ఒక పాటలా సాగిపోతున్నట్టుంది... (నవ్వుతూ) గత ఏడాది ఇరవైనాలుగు సినిమాలకు పాడాను. వాటిలో పద్ధెనిమిది సినిమాలు బ్లాక్‌బస్టర్స్. నేను పాడేవన్నీ మాస్ సాంగ్సే. ‘గుమ్మా గుమ్మా పండిస్తావా..’ (అందరూ దొంగలే... దొరికితే) పాట బాగా హిట్ కావడంతో అలాంటివి వస్తున్నాయి. తెర వెనక హుషారుగా పాడతాను. అదే వేదిక మీద పాడుతున్నప్పుడు చిన్న చిన్న స్టెప్పులు కూడా వేస్తాను. సింహా ఉంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని అందరూ అంటుంటారు. ఇంతకూ మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది? ఏదో ప్రోగ్రామ్‌లో నేను పాడిన పాట విని, సంగీతదర్శకుడు చక్రి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచీ ఆయన చివరి శ్వాస వరకూ ఏ సినిమా చేసినా దాదాపు నాకో పాట ఇచ్చేవారు. చక్రిని మర్చిపోవడం అంత సులువు కాదు. ఆయన నాకెంతో ఆత్మీయుడు. ఆత్మీయులు పోయినప్పుడు బాధగా ఉంటుంది. బాధ కలగడంతో పాటు వృత్తిపరంగా అవకాశాలు తగ్గుతాయని అనిపించిందా? లేదు. ఎందుకంటే చక్రి దగ్గర పాడటం మొదలుపెట్టాక గుర్తింపు వచ్చింది. దాంతో మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, తమన్ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తమన్ ఏ సినిమా చేసినా నాతో పాడించాలనుకుంటారు. ఇప్పుడు దేవిశ్రీ, దర్శకుడు సురేందర్ రెడ్డి బాగా ఆదరిస్తున్నారు. అవకాశాల పరంగా కొదవ లేదు కానీ, చక్రి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం బాధ అనిపించింది. ఆయన ఎంతోమంది సింగర్స్‌కి లైఫ్ ఇచ్చారు. దాదాపు రెండొందలు పాటలు పాడిన మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తోంది? నేను ఎవరికీ పెద్దగా టచ్‌లో ఉండను. సి.ఏ. చదివా. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ, మరోవైపు పాడుతుంటాను. గాయకునిగా ఇంత బిజీ అయ్యాక కూడా ఉద్యోగం చేస్తున్నారంటే... సెక్యూర్టీ కోసమా? ప్రసిద్ధ నోవార్టిస్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా చేస్తున్నా. సౌకర్యవంతమైన జీవితం. పైగా, నాకు లైఫ్‌లో రిస్కులు తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఉద్యోగం వదులుకోలేదు. పైగా సాఫ్ట్వేర్ సైడ్ కాబట్టి శని, ఆదివారాలు సెలవు. దాంతో ఆ రెండు రోజులూ పాటల రికార్డింగ్‌కి కేటాయిస్తాను. ఈ విషయంలో సంగీతదర్శకుల సహకారం మరవలేనిది. ఎప్పుడైనా విడి రోజుల్లో పాడాలంటే మా ఆఫీసు నుంచి సులువుగానే అనుమతి లభిస్తుంది. అందుకని రెండు పడవల మీదా వెళుతున్నా. తెలుగులో హిందీ సింగర్స్ కూడా ఎక్కువయ్యారు? అవును. వాళ్ల ఉచ్చారణే బ్యూటీ అని అంటున్నారు. అఫ్కోర్స్ శ్రోతలు కూడా ఇష్డపడుతున్నారు కాబట్టి వాళ్లతో పాడిస్తున్నారు. అదేం తప్పు కాదు. అందుకే నేను కూడా స్టయిల్ మార్చి, ట్రెండ్‌ని అనుసరిస్తూ పాడుతున్నాను. సంగీతంలో శిక్షణ ఏమైనా తీసుకున్నారా? లేదు. మా నాన్న గారు మిలట్రీలో చేశారు. లయన్ అంటే ఇష్టం కాబట్టి, నాకీ పేరు పెట్టారు. మాది సంప్రదాయ కుటుంబం. అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. మా అన్నయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నేనూ బాగా చదువుకుంటూనే, పాటల వైపు వచ్చా. చిన్నప్పటి నుంచి నాకు కిశోర్‌కుమార్, మహమ్మద్ రఫీ పాటలంటే ఇష్టం. వారి పాటలు పాడుకునేవాణ్ణి. హిందీ సాంగ్స ఇష్టంగా పాడుకున్న మీకు అక్కడ పాడాలని లేదా? నా లక్ష్యమదే. అక్కడా మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నా. పెద్ద హీరోతో ప్రముఖ దర్శకుడు తీస్తున్న ఫిల్మ్‌లో ఛాన్సొచ్చింది. ఫలానా సంగీత దర్శకులకు పాడలేదనే కొరత ఉందా? కీరవాణిగారి ట్యూన్‌కి ఇప్పటి వరకూ పాడలేదు. అదే పెద్ద లోటు. ఇళయరాజా, రహమాన్‌ల స్వరాలకు పాడాలని ఆశ. మర్చిపోలేని సంఘటనలేమైనా? ‘సినిమా చూపిస్త మావా..’ పాటను టీవీలో చూస్తూ, ఓ 80 ఏళ్ల వృద్ధురాలు డ్యాన్స్ చేయడం యూ ట్యూబ్‌లో చూసి, ఆనందపడిపోయా. ఈ పాట పెడితేనే అన్నం తింటామని మారాం చేస్తున్న పిల్లలున్నారని తెలిసి, చిన్నపిల్లాడిలా సంబరపడ్డా. ఆ పాటకే మొన్న ఫిల్మ్‌ఫేర్ అందుకున్నా. - డి.జి. భవాని -
ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే..
నట సింహం బాలకృష్ణ కెరీర్లో ఎత్తులతో పాటు పల్లాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్‌తో చెలరేగిపోయి.. అట్టర్ ప్లాప్స్‌లో పడిపోయిన సందర్భాలు అనేకం. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవటానికి బాలకృష్ణకు చాలా సమయం పట్టింది. ఆ అల్టిమేట్ హిట్ ఇచ్చింది దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ సినిమా పేరు.. సింహా. బాలయ్య సింపుల్‌గా డైలాగ్ చెప్పినా డైనమేట్ లా పేలుతుందని బోయపాటి సింహాతో రుజువు చేశాడు. బాలయ్య కెరీర్లో సరికొత్త అధ్యాయం రాశాడు. సింహాలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టే బోటపాటికి బాలకృష్ణ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. రెండోసారి కూడా అదే రిపీటైంది. లెజెండ్ హిట్ అయింది. బాలయ్య ఇమేజ్ రేంజ్‌ని సరిగ్గా క్యాచ్ చేశాడు కాబట్టే బోయపాటి రెండు హిట్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. డెఫినెట్‌గా కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇచ్చిన రెండు అవకాశాల్నీ బోయపాటి సమర్థవంతంగా డీల్ చేశాడు. అందుకే బాలయ్య 100 సినిమా కూడా ఈ డైరెక్టర్ చేతికి చిక్కింది. ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే దక్కింది. బాలయ్య వందో సినిమా గురించి ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టాడట బోయపాటి. అయితే నటసింహం 99వ సినిమాని శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కబోతుంది. ఇది పూర్తి కాగానే బాలయ్య సెంచరీ కొట్టేందుకు సిద్ధం అవున్నాడు. -
చార్లి మూవీ పోస్టర్స్
-
లెజెండ్ సినిమా టీజర్
-
సంగీతం హాబీగా నేర్చుకున్నా...
సింహా చిత్రంలో ‘సింహమంటి చిన్నోడే..’, కెమెరామెన్ గంగతో రాంబాబులో ‘జర్రమెచ్చింది..’, తీన్మార్లో ‘అలేబాలే..’ అంటూ శ్రావణభార్గవి ఆలపించిన పలు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టించాయి. గాయకురాలిగానే కాకుండా యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలో దూసుకెళుతున్నారు ఆమె. ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్న సహ గాయకుడు, సంగీత దర్శకుడు హేమచంద్రను ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం హనుమాన్ జంక్షన్ వచ్చిన శ్రావణభార్గవి కొద్దిసేపు... న్యూస్‌లైన్ : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ? భార్గవి : నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న శివకుమార్ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. అమ్మ అరుణ గృహిణి. న్యూ : శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారా? భార్గవి : హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన బి.లలిత గారి వద్ద ఐదేళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. ఏదో హాబీగా నేర్చుకుందామని చేరిన తర్వాత సంగీతంపై ఆసక్తి పెరిగి గాయనిగా నిలదొక్కుకోవాలని నిశ్చయించుకున్నా. న్యూ : మీరు పాట పాడిన తొలి చిత్రం ఏది.. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో పాడారు? భార్గవి : రమణ గోగుల సంగీత దర్శకత్వంలో 2009లో విడులైన ‘బోణి’ చిత్రంలో తొలి పాట పాడాను. ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాల్లో పాడాను. సింహా, తీన్మార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, రాజన్న, దమ్ము తదితర చిత్రాల్లో పాడిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రేయ్’ చిత్రం, రఘు కుంచె సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రంలోని పాటలు పాడాను. న్యూ : హేమచంద్రతో ప్రేమ ఎలా మొదలైంది? భార్గవి : 2009లో రైడ్ సినిమాకు పాట పాడే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తరుచూ మేసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో స్నేహం మరింత పెరిగింది. మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నాం. న్యూ : సినీ పరిశ్రమలో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? భార్గవి : పాపులర్ పాటను ఆలపించి సింగర్‌గా పేరు తెచ్చుకోవటం సాధారణ విషయమే... కానీ శ్రావణ భార్గవి పాటనే పాపులర్ చేసే సింగర్.. అంటూ ఇద్దరు, ముగ్గురు పరిశ్రమ పెద్దలు అభినందించటం మర్చిపోలేనిది. -
ఒక రాత్రిలో జరిగే కథ
‘‘సమాజంలో మనకు ఎప్పుడో ఒకప్పుడు తారసపడే పాత్రలతో ఈ సినిమా చేశాను. ఒక రాత్రిలో జరిగే కథ ఇది’’ అని దర్శకుడు శివనాగరెడ్డి చెప్పారు. సింహా, అశోక్, కార్తిక్ ముఖ్యతారలుగా రేర్ డన్ పిక్చర్స్ పతాకంపై సతీష్‌రెడ్డి నిర్మిస్తున్న ‘చార్లి’ చిత్రం లోగోని ‘మధుర’ శ్రీధర్, ప్రచార చిత్రాలను మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘టైటిల్ కొత్తగా ఉంది. ట్రైలర్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది’’ అని అభినందించారు. ఈ నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. గూగుల్ సంస్థలో ఉద్యోగం చేసే తనకు హీరోగా తొలి సినిమా అని సింహా చెప్పారు. మారుతి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇది విజయవంతమై, దర్శక, నిర్మాతలకు మరో సినిమా చేసే శక్తినివ్వాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అశోక్, ఎఫ్.ఎం.బాబాయ్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ ఎస్.ఎస్, కెమెరా: వరప్రసాద్. -
లెజెండ్‌గా బాలకృష్ణ?
నటునిగా భిన్నమైన పాత్రలు పోషించి, స్టార్‌గా పలు రికార్డులు సృష్టించి, హీరోగా వంద చిత్రాలను పూర్తి చేసుకుంటూ... సినీ పరిశ్రమలోని లెజండ్స్లో ఒకరిగా నిలిచారు బాలకృష్ణ. అందుకే... ఆయన్ను తెరపై కూడా ‘లెజెండ్’గా చూపించబోతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రానికి ‘లెజెండ్’ అనే పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. దానికి తగ్గట్టే ప్రతిష్టాత్మకంగా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉండొచ్చని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో... బాలకృష్ణ రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కథా కథనాలు, పాత్ర చిత్రణ కూడా బాలయ్య పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయ్యేలా ఉంటాయని సమాచారం. ‘సింహా’ని మించే స్థాయిలో అత్యంత శక్తిమంతంగా బోయపాటి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా స్టూడియోలో జరుగుతోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. బాలయ్య చిత్రానికి దేవిశ్రీ స్వరాలందించడం ఇదే ప్రథమం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.