రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరో..! | Music Director Keeravani Son Simha Turning Hero | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 3:32 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Music Director Keeravani Son Simha Turning Hero - Sakshi

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలకు ఆయన కుటుంబం అంతా కలిసి పనిచేస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి ప్రతీచిత్రానికి ఆయన అన్న సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతమందిస్తూ వస్తున్నారు. ఈ కుటుంబం నుంచి టెక్నికల్‌ ఫీల్ట్‌లో చాలా మందే ఉన్నా ఇంత వరకు తెర మీద కనిపించిన వారు చాలా తక్కువ.

తాజాగా ఈ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. కీరవాణి తనయుడు సింహా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న డిఫరెంట్‌ సినిమాతో సింహా అరంగేట్రం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో కీరవాణి మరో కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడిగా మారనున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
                               కీరవాణి తనయుడు సింహా
                                                     కీరవాణి తనయుడు సింహా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement