ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహ కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా సంగీత్ వేడుక నిర్వహించారు. అన్న కుమారుడి పెళ్లిలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్‌తో ఇరగదీశాడు.
మాస్ డ్యాన్స్
మాస్ మహారాజ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా.. పాటకు స్టెప్పులేశాడు. స్టేజీపై భార్యతో కలిసి రాజమౌళి మాస్ స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సినిమా
శ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
#SSRajamouli Garu 🕺👌 pic.twitter.com/WaU66KvHDe
— TalkEnti (@thetalkenti) December 14, 2024
Comments
Please login to add a commentAdd a comment