Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్‌పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.
రూ.1 కోటి విలువైన ప్రశ్న
రూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్‌లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్‌బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్‌కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్‌ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.
ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!
ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్‌లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్‌బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్‌బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుని వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment