Kaun Banega Karodpati program
-
రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!
Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్‌పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.రూ.1 కోటి విలువైన ప్రశ్నరూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్‌లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్‌బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్‌కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్‌ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్‌బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్‌బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుని వెళ్లిపోయింది. -
బతకాలనిపించలేదు, చనిపోదామనుకున్నా.. కానీ, : దీపికా పదుకొనె
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె 2014లో తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ దీపికా మాత్రం అన్నీ చెప్పుకుంది. తాజాగా ఆమె బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్.. దీపిక డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేయగా, దాని గురించి ఆమె మరోసారి వివరించింది. లేవగానే విచిత్రంగా ఉండేదని, ఏ పని చేసినా ఏదో లాగుతున్నట్లు ఉండేదని, నిద్ర పట్టకపోయేదని, ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ననీ.. అన్నీ.. అన్నీ చెప్పుకుంది. (చదవండి: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అమితాబ్ సాయం) ‘2014లో నేను డిప్రెషన్లో ఉన్నాను.లేవగానే విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని గానీ అనిపించేంది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఏమీ చేయలేకపోతున్నా ఎందుకు బతకడం అనిపించేది. ఆ సమయంలో చనిపోదామనుకున్నా. నా మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన మా అమ్మ.. వెంటనే సైకియార్టిస్ట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’అని దీపికా ఎమోషనల్ అయింది. తను అనుభవించిన బాధ మరెవరూ అనుభవించొద్దనే ఉద్దేశ్యంలో ‘లివ్ లవ్ లాఫ్’ఫౌండేషన్ స్థాపించానని దీపికా చెప్పుకొచ్చింది. ఈ పౌండేషన్ ద్వారా చాలా మంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేసింది. దీపిక ఇలా బాధపడే సమయంలోనే ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో నటించిందని, షూటింగ్ సమయంలో ఒక్క శాతం కూడా బాధపడుతున్నట్టు కనిపించలేదని చెప్పింది ఆ చిత్ర దర్శకురాలు ఫరాఖాన్. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కరోడ్‌పతి
ఉన్నట్టుండి ఐదు కోట్ల రూపాయలు లభిస్తే? ‘జీవితమే మారిపోతుంది’ అనే సమాధానాన్నే చెబుతారెవరైనా. మరి నిజంగా మారిపోతుందా? ప్రాక్టికల్‌గా అది సాధ్యం అవుతుందా.. అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇలాంటి ఆలోచననే జనింపజేస్తోంది సుశీల్‌కుమార్ జీవితం. సుశీల్‌కుమార్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2011లో దేశవ్యాప్తంగా సుశీల్ పేరు మార్మోగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే సోనీటీవీ వారి కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఐదు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీని గెలుచుకొన్న విజే తగా ఈ బిహారీ అందరికీ పరిచయం అయ్యాడు. కేబీసీ చరిత్రలోనే తొలిసారి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకొన్న వ్యక్తి కూడా కావడంతో ఇతడికి అప్పట్లో బీభత్సమైన క్రేజ్ కనిపించింది. ఉత్తర బీహార్‌లోని మోతిహరి ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి సుశీల్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని... నెలకు ఆరువేల రూపాయల జీతం వస్తుందని.. కేబీసీ సీజన్ ఫైవ్‌లో సుశీల్ తన నేపథ్యం గురించి చెప్పుకున్నాడు. ఆ షోలో సుశీల్ ఐదు కోట్ల రూపాయలు గెలుచుకొని ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడి పరిస్థితి ఏమిటి అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇప్పుడు సుశీల్‌కు ఆ ఉద్యోగం కూడా లేదు! అతను ఒక నిరుద్యోగి. అంతే. సుశీల్ నేటికీ తన సొంతూళ్లోనే ఉంటున్నాడు. ఉమ్మడి కుటుంబంతోనే గడుపుతున్నాడు. ఇదంతా సింప్లిసిటీ అనుకోవద్దు. ఇంతకన్నా గొప్పగా బతకడానికి తన ఆర్థిక స్థితి సరిపోలేదని సుశీల్ చెబుతాడు! ఐదు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీలో పన్నులు పోనూ మూడు కోట్ల అరవై లక్షలు చేతికి వచ్చాయట. ఆ డబ్బుతో సొంతూళ్లో ఒక ఇల్లు కట్టడం, నలుగురు సోదరులు సెటిలవ్వడానికి కొంత కేటాయించడం, స్థానికంగా కొంత భూమిని కొని, మిగిలిన కొంచెం డబ్బును తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్లో జమ చేయడంతోనే సుశీల్ బ్యాలెన్స్‌షీట్ జీరోను చూపించిందట! ఇక ప్రత్యేకంగా తను సెటిలవడానికి, విలాసంగా గడపడానికీ డబ్బులేమీ లేకుండాపోయాయట. వినడానికి కొంత విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉన్నా సుశీల్ ప్రస్తుత సాదాసీదా జీవన శైలి ఇదే వాస్తవమని చెబుతోంది. డబ్బు వచ్చిందనే ఆనందంలో ఉద్యోగం మానేశాడు సుశీల్. బీఎడ్ పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, సివిల్స్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్‌లో ఉన్న మొత్తంపై వచ్చే వడ్డీ డబ్బు, ఇంటి దగ్గర ఉన్న నాలుగు ఆవులు సుశీల్ కుటుంబానికి జీవనాధారం. సోదరులు సుశీల్ ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తున్నా అది వారి కుటుంబాల పోషణకే సరిపోతోంది. దీంతో తన భార్య ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తితో ఉందని సుశీల్ చెబుతున్నాడు. అంత డబ్బు వచ్చినా మన జీవితాలేమీ మారలేదు కదా.. అని అమె సుశీల్ దగ్గర అంటూ ఉంటుందట. నాలుగేళ్ల కిందట సుశీల్ ఒక సెలబ్రిటీ. మీడియా ఇతడి మేధోతనాన్ని మెచ్చుకొంది. సమాజం ఇతడిని ఆరాధించింది. అప్పటి బి హార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సుశీల్ ఇంటికి వెళ్లి మరీ రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు సుశీల్‌ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవారెవరూ లేరు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మరి సుశీల్ వ్యవహారం ‘డబ్బు- జీవితం’తో ముడిపడిన సమీకరణాల గురించి ఏదో సందేశాన్నే ఇస్తోంది. కొంచెం ఆలోచిస్తే అది ఎవరికైనా అర్థం అవుతుంది! - జీవన్ డబ్బు వచ్చిందనే ఆనందంలో ఉద్యోగం మానేశాడు సుశీల్. బీఎడ్ పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, సివిల్స్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.