Big B
-
కల్కి సినిమా అర్థం కాలేదన్నారు: అమితాబ్ బచ్చన్
కొందరు హాలీవుడ్ సినిమాలను ఆహా.. ఓహో.. అని పొగుడుతుంటారు. మరికొందరికేమో ఆ చిత్రాలేవీ బుర్రకెక్కవు. తనది రెండో కేటగిరీ అంటున్నాడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలోని తాజా ఎపిసోడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రిషూల్ చౌదరి కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అతడు టెన్షన్ పడటం చూసిన బిగ్‌బీ.. ఆ కంగారును పోగొట్టేందుకు త్రిషూల్ను హత్తుకుని తనతో మాట కలిపాడు.అమితాబ్‌కు కౌంటర్‌నా మనవళ్లు, మనవరాళ్ల కోసం వారితో కలిసి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు వెళ్తుంటాను. కానీ ఆ సినిమాలు నాకసలు అర్థమే కావని చెప్తే వాళ్లేమన్నారో తెలుసా? అవునా, మాకు కూడా కల్కి 2898 ఏడీ మూవీ అస్సలు అర్థం కాలేదని రివర్స్ పంచ్ ఇచ్చారు అని తెలిపాడు. ఈ మాటలు విని నవ్వేసిన త్రిషూల్.. కల్కిలో అశ్వత్థామగా పాత్ర, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నాయని బిగ్‌బీపై ప్రశంసలు కురిపించాడు.సినిమా సంగతులు..ఇకపోతే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నాగ్ అశ్విన దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీతో పాటు ద ఇంటర్న్ సినిమా రీమేక్‌లోనూ బిగ్‌బీ నటించనున్నాడు.చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు -
బిలాల్ ఈజ్ బ్యాక్
బిలాల్ జాన్ కృషింగల్ పెద్ద గ్యాంగ్‌స్టర్. నలుగురి అన్నదమ్ముల్లో పెద్దవాడు. అందరూ అతన్ని బిగ్ బి అని పిలుస్తారు. ఈ బిగ్ బి మదర్ని ఎవరో మర్డర్ చేస్తారు. హంతకులను కనిపెట్టి, వారిని అంతం చేస్తారు బిగ్ బి అండ్ బ్రదర్స్. ఇది ఆల్మోస్ట్ పది సంవత్సరాల క్రితం అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘బిగ్ బి’ సినిమా కథ. ఈ సినిమాలో బిలాల్ క్యారెక్టర్ని మమ్ముట్టి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు నీరద్. ‘బిలాల్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘హీ ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే.. బిలాల్ ఈజ్ బ్యాక్ అన్నమాట. ఇన్సెట్లో మీరు చూస్తున్న ఫొటో అదే. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా కెమెరామెన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ దర్శకుడిగా మారి ‘స్ట్రీట్‌లైట్స్’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంతేకాదు... ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్ టాక్. -
సెన్సేషనల్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది
సాక్షి, సినిమా : మళయాళ మెగాస్టార్ మమ్మూటీ నటించిన బిగ్ బీ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే సినిమాకు థియేటర్లో అంతంత మాత్రమే స్పందన లభించినప్పటికీ.. ఆ చిత్ర డీవీడీలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి కేరళలో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఎంతలా అంటే బెంగళూర్ డేస్, ప్రేమమ్ లాంటి యూత్‌ఫుల్ హిట్లు, బడాస్టార్ల సినిమాలు కూడా ఇప్పటిదాకా ఆ మార్క్‌ను అందుకోలేకపోయాయి. అలాంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ ప్రకటించేశారు. 2007లో విడుదలైన బిగ్ బీ చిత్రానికి దర్శకుడు అమల్ నీరద్ ఈ సీక్వెల్ బాధ్యతలను స్వీకరించాడు. కమింగ్ సూన్.. బ్లడీ సూన్ అంటూ ఓ సందేశంతో తన ఫేస్ బుక్ ఖాతాలో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. హాలీవుడ్ చిత్రం ఫోర్ బ్రదర్స్‌గా వచ్చిన బిగ్ బీ చిత్రం మమ్ముకా(మమ్మూట్టీ ముద్దుపేరు) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చిత్రంగా చెప్పుకుంటారు. అందులో హీరో పాత్ర పేరు బిలాల్. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌కు బిలాల్ టైటిల్‌నే ఫిక్స్ చేసేశారు. వచ్చే ఏడాది ద్వితియార్థంలో బిలాల్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే మమ్మూట్టీ మరో చిత్రం స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానుంది. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నప్పటికీ... రజనీకాంత్ 2.ఓ చిత్రం వాయిదా పడటంతో రిబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ద్విభాషా(తమిళంలో కూడా) చిత్రంగా ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన స్ట్రీట్ లైట్స్ లో మమ్మూటీ పోలీసాఫీసర్ రోల్ పోషించారు. సినిమాటోగ్రఫర్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మమ్మూట్టీ సొంత బ్యానర్ ప్లే హౌజ్ మోషన్ పిక్చర్స్ లో స్ట్రీట్ లైట్స్ తెరకెక్కుతుంది. -
స్టాక్ మార్కెట్లో కూడా ఆయన సూపర్ స్టారే
ముంబై: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, వాటి ద్వారా లాభాలు అంటే కత్తిమీద సామే. అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్టాక్ మార్కెట్లో స్థిరమైన పెట్టుబడుల ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించి మరోసాగి బిగ్ బిగా అవతరించారు. ఎంచుకున్న షేర్లలో పెట్టుబడులపై అయిదురెట్ల లాభాలను సాధించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా ఫినోటెక్స్ కెమికల్స్ షేర్ పెట్టుబడుల ద్వారా 5 రెట్ల లాభాలను గడించారు. న్యూల్యాండ్ ల్యాబ్స్ లో మూడు రెట్ల ఆదాయాన్ని సాధించారు. మరోవైపు 2013 లో ఐపీవో లో పది రూపాయలకు సొంతం చేసుకున్న జస్ట్ డయల్ షేరును బిగ్ బీ ఇటీవల ఈ షేర్ ను రూ 1,150 స్థాయిలో అమ్మడం ద్వారా భారీ లాభాలను సాధించారు. న్యూ లాండ్స్, ఫినోటెక్స్ కెమికల్స్ 3 కోట్ల పెట్టుబడులకు గాను 14.49 కోట్టు, జస్ట్ డయల్ లో రూ.0.06 కోట్లకు గాను 7.22కోట్లను, ఉజాస్ ఎనర్జీ లో సుమారు నాలుగు కోట్ల పెట్టుబడులకు గాను ఎనిమిది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించారు. జస్ట్ డయల్ ప్రస్తుతం రూ.474.80 వద్ద ఉండగా, ఫినోటెక్స్ బీఎస్ సీలో 1.12 శాతం నష్టపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం అమితాబ్ పోర్ట్ ఫోలియో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. స్టాంపీడ్ క్యాపిటల్ లో సుమారు 24.34 కోట్లు, ఫినోటెక్స్ కెమికల్1.75 కోట్ల మార్కెట్ల వాల్యూ వుండగా, బిర్లా పసిఫిక్ మెడ్ స్పాలో దాదాపు వంద కోట్ల నష్టం, నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ లో సుమారు నాలుగుకోట్ల నష్టంతోనూ ఉన్నాయి. కాగా న్యూల్యాండ్ ల్యాబ్స్ , ఫినోటెక్స్ కెమికల్, బిర్లా పసిఫిక్ మెడ్ స్పా తదితర కంపెనీల్లో గత కొన్నాళ్లుగా బిగ్ బి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. -
నేను బిగ్ బీ ని కాదు: అమితాబ్
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియా గేట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమ ప్రాధాన్యాన్ని అమితాబ్ వివరించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి అమితాబ్ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక బాలిక ప్రశ్నకు అమితాబ్ నేలపై కూర్చొని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడవ తరగతి విద్యార్థిని సుగమ్ అమితాబ్ ఉద్దేశించి మీరు బిగ్ బీ ఎలా అయ్యారు? మీ చిన్ననాటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను? అని అడిగింది. వెంటనే అమితాబ్ కింద కూర్చొని.. ఎవరు చెప్పారు నేను బిగ్ బీ అని, చూడు నేను నీకన్నా చిన్నగా ఉన్నాను అని చమత్కరించారు. దీంతో అక్కడున్న వాళ్లందరిలో నవ్వులు విరిసాయి. బిగ్ బీ అనేది మీడియా, ప్రజలు ఇచ్చిన బిరుదు అని అన్నారు. అంతేకాని బిగ్ బీలు ఎవరూ లేరన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకొని ఉన్నత లక్ష్యం దిశగా కృషి చేయాలని వారికి అమితాబ్ సూచించారు. ఈ సందర్భంగా తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రచించిన 'మధుశాల'లోని కొన్ని పంక్తులను అమితాబ్ ఉదహరించారు. విద్యార్థులు రాసిన రెండు పద్యాలను కూడా ఆయన చదివారు. 'బేటీ బచావో-బేటీ పడావో' ఉద్దేశాన్ని వివరిస్తూ.. ఆడ, మగ పిల్లల మధ్య ఎటుమంటి వివక్ష చూపకూడదని అన్నారు. మన పూర్వీకులు మహిళలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. -
వర్మతో నాకు విభేదాల్లేవు
ముంబై:బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రామ్ గోపాల్ వర్మతో కలిసి సర్కార్-3 సినిమాను తీయనున్నారు. తమ కుటుంబ స్నేహితుడు ఈ సినిమాను నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని అమితాబ్ బచ్చన్ విలేకరులతో అన్నారు. ప్రస్తుతం బిగ్ బీ టీఈ3ఎన్ సినిమాలో నటిస్తున్నారు. ముంబైలోని క్రైం డ్రామాను కథాంశంగా తీసుకుని సర్కార్-3 సినిమా నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. వర్మతో విభేదాలున్నాయన్న ప్రశ్నను అమితాబ్ ఖండించారు. వర్మ తనకు మంచి స్నేహితుడని స్పష్టం చేశారు. -
'ఛోటీ బీవీ'ని గుర్తుచేసుకున్న బిగ్ బీ!
'జిస్కీ బీవీ ఛోటీ, ఉస్కా భీ బడా నాం హై .. గోద్మే బైఠాలో.. బచ్చేకా క్యా కామ్ హై'.. దాదాపు 35 ఏళ్ల కిందట వచ్చిన 'లావారిస్' సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాడిన పాట ఇది. మూడున్నర దశాబ్దాలు గడిచిపోయినా భాషలకు అతీతంగా భారతీయులందరినీ ఈ పాట ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. 'మేరే అంగ్నేమే తుమ్హారా క్యాం కామ్ హై' అంటూ సాగే ఈ పాట అప్పట్లో చాలా సూపర్ హిట్ అయింది. ఈ పాటను అమితాబ్ పాడిన స్టైల్ ఎంతో ఆకట్టుకుంది కూడా. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాల్లోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ జారుకున్నారు. 'మేరే అంగ్నేమే' పాటను పాడుతూ.. 'జిస్కీ బీవీ ఛోటీ, ఉస్కా భీ బడా నాం హై' అన్న చరణం వద్ద తన భార్య జయాబచ్చన్‌ను ఎత్తుకునే దృశ్యాన్ని ఆయన నెమరువేసుకున్నారు. అదే సమయంలో న్యూయార్క్‌లో లతా మంగేష్కర్ సంగీత కచెరీ సందర్భంగా ఆమె కోరిక మేరకు వేదికపై తాను ఈ పాట పాడానని, దాంతో శ్రోతల నుంచి ఊహించిన ప్రతిస్పందన వచ్చిందని, ప్రేక్షకులంతా ముందుకు వచ్చి తనతోపాటు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారని, దీంతో వారిని నియంత్రించడం న్యూయార్క్ పోలీసులు చాలా సమయమే పట్టిందని ఆయన వివరించారు. -
బాత్రూమ్ లోనూ 'సెల్ఫీ' కోసం వెంటపడ్డాడు!
ముంబై: సెలబ్రిటీ సినీ తారలంటే ప్రజల్లో క్రేజ్ ఉండటం సహజం. కానీ వారు ఎక్కడికీ వెళ్లినా వెంటపడటం.. బాత్రూమ్లోకి వెళ్లినా.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ ఓ 'సెల్ఫీ' కోసం బతిమాలుకోవడం ఏమన్నా బావుంటుందా? ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఇదేరకమైన వింత అనుభవం ఎదురైంది. బాలీవుడ్ లివింగ్ లెజెండ్ అమితాబ్‌కు కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా బిగ్ బీ చుట్టూ అభిమానులు గుమిగూడటం సహజమే. అయితే ఇటీవల ఓ 'తిక్క' అభిమాని బాత్రూమ్లోనూ 'సెల్ఫీ' కోసం ఆయన వెంటపడ్డాడట. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించాడు. 'ఇటీవల పెరిగిపోయిన కమ్యూనికేషన్స్, వ్యక్తుల కోరికలు, తమ జీవిత చరిత్రలో 'సెల్ఫీ'ని కూడా భాగం చేసుకోవాలన్న భయంకరమైన ఆలోచనలు నన్ను విస్తుగొలిపాయి. ఇటీవల పబ్లిక్ వాష్‌రూమ్‌లో కొందరు తారసపడ్డారు. నిజమే వాష్‌రూమ్‌లోనే. అందులో ఒకతను నాతో 'సెల్ఫీ' దిగాలని కోరాడు. నిజంగా నీకేమైనా తిక్కనా? దీనికి నేను ఎలా అంగీకరిస్తానని నువ్వు అనుకున్నావు?' అని బిగ్ బీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. 'ఈ ప్రపంచంలో అందరిదే ఇదే అజెండా. ఆ లక్ష్యం కోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. దీని నుంచి బయటపడాలి' అని 'సెల్ఫీ' మోజును వదులుకోవాలంటూ ఆయన సూచించారు. అమితాబ్ ప్రస్తుతం విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి 'టీఈ3ఎన్' సినిమాలో నటిస్తున్నారు. -
వోడ్కా తాగుతూ.. బిగ్ బీతో చెస్ ఆట!
వోడ్కా తాగుతూ.. చెస్ ఆడటం కొత్త పద్ధతి కదా! ఈ కొత్త చదరంగం ఆటను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి.. చెస్ ఆడుతూ మధ్యమధ్యలో వోడ్కా సిప్ చేయనున్నారు. అయితే ఇది నిజజీవితంలో కాదు. 'వజీర్' అనే సినిమా కోసం. త్వరలో రాబోతున్న ఈ చిత్రంలో ఈ చిత్రమైన చదరంగం ఆట ఉండనుంది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్ సీరియస్‌గా చెస్ ఆడుతూ.. ఎదుటివారి బంటును బలిగొన్న ప్రతిసారి వోడ్కాను గుటుక వేసే సీన్ ఈ సినిమాలో ఉండనుందట. ఈ విషయాన్ని 'వజీర్' చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. చెస్ ఆటను సరికొత్తరీతిలో ఆసక్తికరంగా ఈ సనివేశంలో చూపించనున్నాం. ఇందులో అమితాబ్-ఫర్హాన్ చెస్ ఆడుతూ కనిపిస్తారని 'వజీర్' ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధవారం విడుదలైన 'వజీర్' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ ప్రకారం ఫర్హాన్ భద్రతా దళాల్లో చేరి.. అమితాబ్ సాయంతో విలన్ నీల్ నితిన్ ముఖేష్‌ను ఎదుర్కోవడం ఈ సినిమా కథగా కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వజీర్' సినిమాలో జాన్ అబ్రహం, అదితిరావ్ హైదరి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫర్హాన్ ఏటీఎస్ అధికారిగా, అమితాబ్ వైకల్యమున్నా.. పదునైన మేధస్సు ఉన్న వ్యక్తిగా, అదితిరావు ఫర్హాన్ ప్రేమికురాలిగా కనిపించనున్నారు. -
'ఆయనతో నటించటం నా అదృష్టం'
బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్దీన్ సిద్ధికీ.. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశంపై స్పందించారు. అంతటి లెజెండరీ యాక్టర్‌తో కలిసి నటించటం తన అదృష్టం అన్నారు. సుజయ్ ఘోష్ కథతో విభుపూరి డైరెక్ట్ చేస్తున్న 'కేరళ' సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, అమితాబ్ బచ్చన్లు కలిసి నటిస్తున్నారు. 'ఎప్పటి నుంచో అమితాబ్ తో కలిసి నటించాలన్నది నా కల. నా తర్వాతి సినిమాలోనే ఆయనతో కలిసి నటించబోతున్నాను. ఇది నిజంగా నా అదృష్టం' అని తన అభిమానాన్ని చాటుకున్నారు. అమితాబ్ స్వయంగా తన సినిమాలో నవాజ్‌కు ఓ క్యారెక్టర్ ఇవ్వమని కోరటంతో మరింత ఆనందంలో ఉన్నారు ఈ విలక్షణ నటుడు. ఇప్పటికే ఈ ఏడాది 'భజరంగీ బాయ్‌జాన్', 'మాంఝీ' లాంటి సినిమాల్లో నటించిన నవాజుద్దీన్ ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి 'రాయిస్' సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్, నవాజ్‌ల కాంబినేషన్ లో రూపొందనున్న 'కేరళ' వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
జిమ్‌లో కసరత్తులు చేస్తున్న అమితాబ్
తన పాత్రల కోసం ఎంత శ్రమకైనా ఓర్చే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. రాబోయే సినిమా కోసమే ఆయనిలా కష్టపడుతున్నారు. 72 ఏళ్ల వయసులో ఉన్న బిగ్ బీ.. తన శరీరం షేపును మార్చుకోవాల్సి ఉంటుందని, అందుకే జిమ్‌కు వెళ్తున్నానని చెబుతున్నారు. వర్కవుట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయని, తన శరీర ఆకారంలో మార్పు మూడు నెలల తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఉన్నట్టుండి తాను రోజూ ఎందుకు జిమ్‌కు వెళ్తున్నానని చాలామంది అడుగుతున్నారని, తన రాబోయే సినిమాలో చేయబోయే పాత్రే ఏకైక కారణమని అమితాబ్ తెలిపారు. తనకు ఏదో ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల చికిత్సలో ఉన్నానేమోనని, అందుకే వ్యాయామానికి వెళ్తున్నానని చాలామంది అనుకున్నారంటూ బిగ్ బీ తన బ్లాగులో రాశారు. అయితే ప్రస్తుతానికి తాను ఎలాంటి చికిత్సా తీసుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. -
రైల్వే స్టేషన్ లో అమితాబ్ తప్పిపోయాడట!
అవును.. బిగ్ బీ అమితాబ్ ఓసారి కిక్కిరిసిన రైల్వే స్టేషన్లో తప్పిపోయారట. అప్పుడు ఆయన వయస్సు ఎనిమిదేళ్లు. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన బ్లాగ్‌లో వెల్లడించారు. తాత, అమ్మమ్మలను చూడటానికి తల్లిదండ్రులు ప్రముఖ కవి హరివంశ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ లతో కలిసి అలహాబాద్ నుంచి కరాచీకి వెళుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు. రెండు రోజుల ప్రయాణంలో ఒక రైలు నుంచి మరో రైలు మారాల్సి ఉండేది. ప్రయాణీకులు కిక్కిరిసి ఉన్న కారణంగా తాను తప్పిపోయానని, ఆ విషయాన్ని తన తల్లి గ్రహించి.. తండ్రికి చెప్పిందని.. దాంతో వాళ్లిద్దరు ఆందోళన చెంది రైల్వేస్టేషన్ అంతా వెతికారని అమితాబ్ తెలిపారు. చాలాసేపు వెతికిన తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఓ పిల్లాడు అక్కడ ఉన్నాడని వాళ్లకు చెప్పడంతో కథ సుఖాంతమైందని అమితాబ్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. తనకు రైలు ప్రయాణమంటే చాలా ఇష్టమంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రైలును చూసే ఓ ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. -
షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్
బాల్కి దర్శకత్వంలో కొత్తగా వస్తున్న 'షమితాబ్' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాట పాడుతున్నారు. అవధేష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన మ్యూజిక్ స్టూడియోలో రాత్రి చాలా సేపు కూర్చున్నానని, షమితాబ్ సినిమా కోసం మరోసారి తాను పాట పాడుతున్నానని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు తాను పాడానని ఆయన రాశారు. ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ ఆయన స్వరాలు మాత్రం సరికొత్తగానే ఉంటాయని, ఆయన ప్రాధాన్యం అలాగే కొనసాగుతోందని అమితాబ్ చెప్పారు. చాలామంది సుప్రసిద్ధ సంగీతదర్శకులను ఆయన తయారుచేశారని, దాదాపు 900కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారని ప్రశంసల జల్లు కురిపించారు. షమితాబ్ చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ కూతురు అక్షర కూడా నటిస్తున్నారు. అక్షర బాలీవుడ్ రంగప్రవేశం అమితాబ్ చిత్రంతో జరగడం విశేషం. -
అమితాబ్ భారీగా కొనేశాడు!
ముంబై: స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీ స్టాంపెడ్ కాపిటల్ లిమిటెడ్ వాటాలను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ అందించిన సమాచారం ప్రకారం స్టాంపెడ్ కాపిటల్ కంపెనీకి చెందిన 1.1 లక్షల వాటాలను కొనుగోలు చేసినట్టు తెలిసింది. స్టాంపెడ్ కాపిటల్ వాటా ఒక్కంటికి 109.92 రూపాయల చొప్పున 1.21 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోళు చేశారు. గత నెలరోజుల్లో స్టాంపెడ్ కాపిటల్ 30 శాతం వృద్దిని నమోదు చేసింది. బుధవారం నాటి ట్రేడింగ్ స్టాంపెడ్ కాపిటల్ ఓ దశలో 119.95 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరికి 114.90 వద్ద క్లోజైంది. ఇటీవల అమితాబ్ జస్ట్ డయల్ అనే కంపెనీలో షేర్లను కొనుగోలు చేశారు. జస్ట్ డయల్ కంపెనీ వాటాను 10 రూపాయల చొప్పున 62794 వాటాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం అమితాబ్ కొనుగోలు చేసిన జస్ట్ డయల్ వాటాలు 9 కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి. -
భర్త మోడీతో, భార్య ములాయంతో'
రాజకీయాలు ఎన్నెన్నో వింత కాంబినేషన్లకు దారితీస్తూంటాయి. భార్య భర్తపై, తండ్రి కొడుకుపై, అన్న తమ్ముడిపై పోటీచేయడం ఎన్నికల వేళ జరుగుతూంటాయి. ఇప్పుడు బిగ్ బి కుటుంబంలోనూ ఇలాంటి విచిత్రం కనిపిస్తోంది. బిగ్ బి అమితాబ్ నరేంద్ర మోడీకి సన్నిహితుడు. ఆయన గుజరాత్ టూరిజంకి బ్రాండ్ ఎంబాసిడర్ కూడా. కానీ ఆయన భార్య జయా బచ్చన్ మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. అయితే అమితాబ్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. 1984 లో కొన్నాళ్లు ఎంపీగా ఉన్నాక ఆయన తనకు రాజకీయాలు పడవని గుర్తించి, తప్పుకున్నారు. అప్పట్నుంచీ ఆయన రాజకీయులతో సన్నిహితంగా ఉన్నా కండువాలు మాత్రం వేసుకోలేదు. జయా బచ్చన్ మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఒకప్పటి బిగ్ బి కుటుంబ మిత్రుడు, రాజకీయ నేత అమర్ సింగ్ దీన్నే ఎత్తి చూపి, భర్త మోడీతో, భార్య ములాయంతో. వాహ్... క్యా ఫామిలీ హై' అని ఎద్దేవా చేస్తున్నారు. -
కుర్రాళ్లతో సమానంగా అమితాబ్ డాన్సులు
ఆయన వయసు 71. కానీ మనసు మాత్రం ఇంకా పదిహేడే. అందుకే కుర్రాళ్లతో సమానంగా డాన్సులు వేస్తున్నారు. ఆయనెవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తన తోటి నటించిన హీరోలు, హీరోయిన్లంతా వృద్ధాప్య భారంతో కనిపిస్తున్నా, అమితాబ్ మాత్రం తెల్లగడ్డం వచ్చినా ఇప్పటికీ కుర్రాడిలా చకచకా నడుస్తుంటారు. త్వరలో రాబోతున్న 'భూత్నాథ్ రిటర్న్స్' చిత్రం కోసం ఓ డాన్సు చేయాల్సి వచ్చినప్పుడు కుర్రాళ్లతో పోటీలు పడి మరీ ఆయన డాన్సు చేశారు. కొరియోగ్రాఫర్లు కూడా ఆయన వయసు మర్చిపోయి క్లిష్టమైన మూమెంట్లు ఇచ్చారట. అయినా కూడా అమితాబ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ విషయాన్నే తన బ్లాగులో కూడా రాశారు. 'భూత్నాథ్ రిటర్న్స్' సినిమా కొరియోగ్రాఫర్లు తన వయసు మర్చిపోయారని, అయినా తాను కూడా ఆ డాన్సులను ఆస్వాదించానని చెప్పారు. ఇప్పటికీ జిమ్‌కు కూడా వెళ్తూనే ఉన్నానని, అలా చేయగలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ పాటలో చేసిన వ్యాయామాల వల్లే తాను మరో దశాబ్దం కూడా సులభంగా నటించగలనన్న నమ్మకం కుదిరిందని తెలిపారు. గణేశ్ ఆచార్య కంపోజ్ చేసిన డాన్సులను ఆయన చేశారు.