వోడ్కా తాగుతూ.. బిగ్‌ బీతో చెస్‌ ఆట! | Big B, Farhan's tipsy chess tale of 'Wazir' | Sakshi
Sakshi News home page

వోడ్కా తాగుతూ.. బిగ్‌ బీతో చెస్‌ ఆట!

Published Wed, Nov 18 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

వోడ్కా తాగుతూ.. బిగ్‌ బీతో చెస్‌ ఆట!

వోడ్కా తాగుతూ.. బిగ్‌ బీతో చెస్‌ ఆట!

వోడ్కా తాగుతూ.. చెస్‌ ఆడటం కొత్త పద్ధతి కదా! ఈ కొత్త చదరంగం ఆటను బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన ఫర్హాన్‌ అఖ్తర్‌తో కలిసి.. చెస్‌ ఆడుతూ మధ్యమధ్యలో వోడ్కా సిప్ చేయనున్నారు. అయితే ఇది నిజజీవితంలో కాదు. 'వజీర్‌' అనే సినిమా కోసం. త్వరలో రాబోతున్న ఈ చిత్రంలో ఈ చిత్రమైన చదరంగం ఆట ఉండనుంది.

అమితాబ్‌ బచ్చన్‌, ఫర్హాన్ అఖ్తర్ సీరియస్‌గా చెస్‌ ఆడుతూ.. ఎదుటివారి బంటును బలిగొన్న ప్రతిసారి వోడ్కాను గుటుక వేసే సీన్‌ ఈ సినిమాలో ఉండనుందట. ఈ విషయాన్ని 'వజీర్' చిత్ర యూనిట్‌ ధ్రువీకరించింది. చెస్‌ ఆటను సరికొత్తరీతిలో ఆసక్తికరంగా ఈ సనివేశంలో చూపించనున్నాం. ఇందులో అమితాబ్‌-ఫర్హాన్‌ చెస్‌ ఆడుతూ కనిపిస్తారని 'వజీర్' ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధవారం విడుదలైన 'వజీర్' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

ట్రైలర్ ప్రకారం ఫర్హాన్ భద్రతా దళాల్లో చేరి.. అమితాబ్‌ సాయంతో విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ను ఎదుర్కోవడం ఈ సినిమా కథగా కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వజీర్' సినిమాలో జాన్ అబ్రహం, అదితిరావ్ హైదరి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫర్హాన్ ఏటీఎస్ అధికారిగా, అమితాబ్‌ వైకల్యమున్నా.. పదునైన మేధస్సు ఉన్న వ్యక్తిగా, అదితిరావు ఫర్హాన్ ప్రేమికురాలిగా కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement