బాత్రూమ్‌ లోనూ 'సెల్ఫీ' కోసం వెంటపడ్డాడు! | Big B asked for selfie in washroom | Sakshi
Sakshi News home page

బాత్రూమ్‌ లోనూ 'సెల్ఫీ' కోసం వెంటపడ్డాడు!

Published Wed, Feb 24 2016 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

బాత్రూమ్‌ లోనూ 'సెల్ఫీ' కోసం వెంటపడ్డాడు!

బాత్రూమ్‌ లోనూ 'సెల్ఫీ' కోసం వెంటపడ్డాడు!

ముంబై: సెలబ్రిటీ సినీ తారలంటే ప్రజల్లో క్రేజ్ ఉండటం సహజం. కానీ వారు ఎక్కడికీ వెళ్లినా వెంటపడటం.. బాత్రూమ్‌లోకి వెళ్లినా.. ప్లీజ్‌.. ప్లీజ్‌ అంటూ ఓ 'సెల్ఫీ' కోసం బతిమాలుకోవడం ఏమన్నా బావుంటుందా? ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఇదేరకమైన వింత అనుభవం ఎదురైంది. బాలీవుడ్ లివింగ్ లెజెండ్ అమితాబ్‌కు కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా బిగ్‌ బీ చుట్టూ అభిమానులు గుమిగూడటం సహజమే. అయితే ఇటీవల ఓ 'తిక్క' అభిమాని  బాత్రూమ్‌లోనూ 'సెల్ఫీ' కోసం ఆయన వెంటపడ్డాడట. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించాడు.

'ఇటీవల పెరిగిపోయిన కమ్యూనికేషన్స్‌, వ్యక్తుల కోరికలు, తమ జీవిత చరిత్రలో 'సెల్ఫీ'ని కూడా భాగం చేసుకోవాలన్న భయంకరమైన ఆలోచనలు నన్ను విస్తుగొలిపాయి. ఇటీవల పబ్లిక్ వాష్‌రూమ్‌లో కొందరు తారసపడ్డారు. నిజమే వాష్‌రూమ్‌లోనే. అందులో ఒకతను నాతో 'సెల్ఫీ' దిగాలని కోరాడు. నిజంగా నీకేమైనా తిక్కనా? దీనికి నేను ఎలా అంగీకరిస్తానని నువ్వు అనుకున్నావు?' అని  బిగ్‌ బీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. 'ఈ ప్రపంచంలో అందరిదే ఇదే అజెండా. ఆ లక్ష్యం కోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. దీని నుంచి బయటపడాలి' అని 'సెల్ఫీ' మోజును వదులుకోవాలంటూ ఆయన సూచించారు. అమితాబ్ ప్రస్తుతం విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి 'టీఈ3ఎన్‌' సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement