washroom
-
వాష్‌రూంలో టూత్‌బ్రష్.. మీ పళ్లు మటాష్!!
‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా?’.. అంటూ వచ్చే టీవీ యాడ్‌ను చూసే ఉంటారుగా.. దృఢమైన దంతాలు, చిగుళ్ల కోసం ఉప్పున్న తమ పేస్ట్‌నే వాడాలంటూ ఓ ప్రముఖ టూత్‌పేస్ట్ కంపెనీ చేసుకొనే ప్రచారం అది. మరి మీ టూత్‌బ్రష్‌లు వాష్‌రూంలో ఉంటాయా? బ్రష్ చేసుకొని తిరిగి వాటిని అక్కడే ఉంచుతారా? అయితే మీకు పంటి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది!! సాక్షి, సిద్దిపేట: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవడం ఒక్కటే సరిపోదని.. టూత్‌బ్రష్‌లను సరైన చోట ఉంచడం కూడా ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన పరిశోధన తేల్చిచెబుతోంది. టూత్‌బ్రష్‌లపై ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని.. బ్రష్‌ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. వాష్‌రూంలలో ఉంచితే అంతే.. అటాచ్డ్ వాష్‌రూంలు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్‌బ్రష్‌లను భద్రపరుస్తుండటం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. టూత్ బ్రష్‌లను వాష్‌రూంలో ఉంచడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారీ కమోడ్ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్‌లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్‌లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. అదే వాష్‌రూంకు దూరంగా, కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్‌బ్రష్‌లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్‌బ్రష్‌లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని నిరూపితమైంది. 45 రోజులపాటు సాగిన పరిశోధన టూత్ బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణ అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజులపాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌ల నుంచి 100 నమూనాలను శ్వాబ్‌ల ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా? ఉంటే ఏయే రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు. మూడు రకాల బ్యాక్టీరియాల గుర్తింపు శాంపిల్స్ సేకరించిన టూత్బ్రష్లలో ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ రకం బ్యాక్టీరియా 50 శాతం, స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ 40 శాతం, ఎస్చెరిషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా 20 శాతం ఉన్నట్లుగా తేల్చారు. పిప్పిపళ్లు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈ–కోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.యూవీ లైట్‌తో బ్యాక్టీరియా మాయంబ్యాక్టీరియా ఉన్న బ్రష్‌లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్బాక్స్లో పెట్టి పరీక్షించగా వాటిపై ఎలాంటి క్రిములు లేవని తేలింది. టూత్ బ్రష్‌లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్స్‌లో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్నారు. మరోవైపు ఒకవేళ బ్రష్‌లను ఒకేచోట పెట్టాల్సి వస్తే వాటికి క్యాప్‌లను పెట్టాలని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న విద్యార్థులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వేడినీటితో బ్రష్‌ను శుభ్రం చేశాకే వాడాలని.. మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రిన్సిపాల్ సునీత సూచనలతో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పర్యవేక్షణలో టూత్‌బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణపై పరిశోధన చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాం. యూవీ బాక్స్‌ను సైతం తయారు చేశాం. – విద్యార్థినులు.. మౌనిక, షారోన్, నాగలక్ష్మి, సిద్ద, స్నేహ, సుష్మిత ప్రభుత్వ జిజ్ఞాస పోటీలకు పంపుతాం.. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జిజ్ఞాస పోటీలకు పంపిస్తున్నాం. టూత్ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోందన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిశోధన చేపట్టాం. – డాక్టర్ మదన్ మోహన్, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
‘ఆపుకోలేని’ ఆవేదన!
రైలింజన్లలో వాష్‌రూంలు లేక మహిళా లోకోపైలట్ల యాతనఒక్కసారి ఊహించుకోండి.. మీరు బిజీ సెంటర్లో ఉన్నారు. చాలా అర్జెంటు.. ఎక్కడా వెళ్లే పరిస్థితి లేదు. మీకెలా అనిపిస్తుంది? నరకయాతన కదూ.. ఒక్క రోజుకే మన పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో రైళ్లను నడిపే మహిళా లోకోపైలట్లు రోజూ ఈ నరకయాతనను అనుభవిస్తున్నారు. అదీ ఎన్నో ఏళ్లుగా.. దేశవ్యాప్తంగా..లోకోపైలట్లు 86,000దక్షిణమధ్య రైల్వేలో 12,000మహిళలు 3,000 మహిళలు 500భారతీయ రైల్వే.. గతంతో పోలిస్తే ఎంతో మారింది. మన రైళ్లలోనూ ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే రైళ్లను నడిపే లోకోపైలట్లకు కనీస సదుపాయమైన వాష్‌రూం మాత్రం నేటికీ అందు బాటులోకి రాలేదు. వీటిని ఏర్పాటు చేయాలని 2016లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా.. నేటికీ అది సాకారం కాలేదు. దీంతో చేసేది లేక.. కొందరు మహిళా లోకోపైలట్లు అడల్ట్ డైపర్లు వాడుతున్నారు.. మరికొందరు డ్యూటీకెళ్లేటప్పుడు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.మా సమస్యను పట్టించుకునేవారేరి?వాష్‌రూం లేకపోవడం వల్ల స్త్రీ, పురుష లోకోపైలట్లు ఇద్దరికీ ఇబ్బంది అయినా.. తమ సమస్యలు వేరని తమిళనాడుకు చెందిన సీనియర్ మహిళా లోకోపైలట్ ఒకరు చెప్పారు. ‘మెయిన్ జంక్షన్లలో తప్పితే.. చాలా స్టేషన్లలో 1–5 నిమిషాలు మాత్రమే రైలును ఆపుతారు. ఆ టైంలోనే వెనుక ఉన్న బోగీకి లేదా స్టేషన్‌లోని వాష్‌రూంకు వెళ్లి.. పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి తిరిగి రాకపోతే.. ట్రైన్ నిర్ణిత సమయం కన్నా ఎక్కువ సేపు ఆగితే.. వివరణ ఇచ్చుకోవాలి.దాని కన్నా.. వెళ్లకపోవడమే బెటరని చాలామంది భావిస్తారు’అని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల వల్ల తాను కూడా మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్ బారిన పడ్డానని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకునేవారేరి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా.. ఒకసారి ఇంజన్ క్యాబిన్లోకి ప్రవేశిస్తే విధులు ముగిసేవరకు బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే వాకీటాకీల్లో పై అధికారులకు సమాచారం అందజేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మహిళా లోకోపైలట్లు చెబుతున్నారు.పైగా కొన్ని చోట్ల స్టేషన్లు చాలా ఖాళీగా ఉంటాయి. అలాంటి స్టేషన్లలో వాష్‌రూంను వినియోగించడమంటే తమ భద్రతను పణంగా పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎనిమిది గంటల డ్యూటీ అంటారు. కానీ ఒక్కసారి బండెక్కితే పదకొండు గంటలు దాటిపోతుంది.అప్పటి వరకు ఆపుకోవాల్సిందే’అని దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ఒక సహాయ మహిళా లోకోపైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రాన్ని ఆపుకోవడం లేదా నీళ్లు తక్కువగా తాగడం వల్ల మహిళల్లో మూత్రనాళం, కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఇది ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ శాంతి రవీంద్రనాథ్ హెచ్చరించారు.రైలు నడుపుదామనుకున్నా.. కానీ.. ⇒ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది లోకో పైలట్ అవ్వాలని వచి్చ.. డెస్క్ జాబ్‌లో సర్దుకుంటున్నారు. .. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉండేది. లోకో పైలట్ క్వాలిఫై అయి ఐదేళ్లయింది. వాష్‌రూం లేని చోట పనిచేయడం ఇబ్బందని.. డెస్క్ జాబ్ చేస్తున్నాను’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ చెప్పారు. తాను లోకోపైలట్ అయినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యానని.. అయితే మహిళలు శానిటరీ న్యాప్కిన్లు ధరించి డ్యూటీకి రావాల్సిన దుస్థితిని కల్పిస్తున్న ఇలాంటి పని వాతావరణంలోకి రావడానికి ఎందరు ఇష్టపడతారని ఓ లోకోపైలట్ ప్రశ్నించారు.నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు పడలేక.. సెలవు పెట్టడమే బెటరని భావిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్ డ్యూటీలు చేయలేని వాళ్లకు స్టేషన్డ్యూటీలు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు అంతగా ఇవ్వడం లేదు. ప్రెగ్నెన్సీతో విధులకు హాజరయ్యే మహిళలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నారు. ‘గతంలో చాలాసార్లు స్టేషన్ డ్యూటీ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కావడం వల్ల స్టేషన్ డ్యూటీ ఇచ్చారు’అని సికింద్రాబాద్‌కు చెందిన రేవతి చెప్పారు. చేస్తామని చెప్పి.. చేయలేదురైలింజన్లలో వాష్‌రూంలు లేకపోవడంపై ద ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ వర్మ అప్పట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రతి ఇంజన్ క్యాబిన్లో ఏసీ సదుపాయంతో పాటు వాష్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని హక్కుల కమిషన్ 2016లో ఆదేశించింది. దీనికి సమాధానంగా అన్ని రైళ్లలో వాష్‌రూంను ఏర్పాటు చేస్తామని రైల్వే చెప్పింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. దేశంలో కొన్ని డివిజన్లలోని ఇంజన్లలో వీటి ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. క్లీనింగ్ తదితర నిర్వహణ సమస్యలతోపాటు ఇంజిన్లోకి లోకోపైలట్ మినహా ఎవరినీ అనుమతించ రాదనే నిబంధనలు వంటి కారణాలతో దాన్ని అమలు చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఇది లోకోపైలట్ల కనీస హక్కులను హరించడమేనని అలోక్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం వస్తున్న వందేభారత్‌లలో ఈ సమస్య పెద్దగా లేదని చెప్పారు. మిగతావాటి పరి స్థితి ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, యూరప్, బ్రిటన్లలో లోకోపైలట్లకు ప్రతి 4 గంటలకు 20–25 నిమిషాల బ్రేక్ ఉంటుందని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్/సాక్షి, సెంట్రల్డెస్క్కమిటీ వేసినా.. ముందడుగు పడలేదు..రైలింజన్లలో వాష్‌రూంలు, సరైన విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు కల్పించాలని ఇప్పటికి అనేక సార్లు రైల్వేబోర్డుకు విన్నవించాం. 3 నెలల క్రితమే రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు. – మర్రి రాఘవయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) -
ఇది కదా అసలైన ప్రేమంటే..
కర్నూలు (టౌన్): కర్నూలు అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ చిగురించింది. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో సుఖాంతమైంది. కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో ఎతిక్స్ హోమ్స్‌లో కోరకోల కిషోర్‌కుమార్, కడపటింటి ప్రేమమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు కొరకోల కీర్తి కుమార్ ముంబై ఐఐటీలో చదువుకున్నాడు. మూడేళ్ల క్రితం జపాన్‌లో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతనికి అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న టోక్యో పట్టణానికి చెందిన మట్ సుమోటో రియోకో, మట్ సుమోటో తఢాక దంపతుల కూతురు మట్ సుమోంటో రింకతో పరిచయం ఏర్పడింది. మూడున్నరేళ్ల వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. రింక అబ్బాయిని తన తండ్రికి పరిచయం చేసింది.ఇరు కుటుంబాలు అంగీకరించడంతో శనివారం కర్నూలులోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చిలో పెళ్లి తంతు నిర్వహించారు. చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి -
బాత్రూంలో తోటి విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ.. ముగ్గురు అమ్మాయిలపై కేసు
యశవంతపుర: ఉడుపి పట్టణంలోని మహిళా నర్సింగ్ కాలేజీ బాత్రూమ్లో ఓ వర్గానికి చెందిన విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీశారంటూ వారం రోజులుగా కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివాసం ఉంటున్న ఉడుపి వాసి, సమాజ సేవకురాలు రశ్మి సమంత్ ట్వీట్ చేసి మరో వర్గానికి చెందిన ముగ్గురు యువతులు వీడియో తీశారంటూ పెట్టిన పోస్టు సంచలనం కలిగించింది. దీంతో ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఉడుపి ఎస్పీ అక్షయ్ మశ్చింద్రను వివరణ కోరగా సోషల్ మీడియాలో మరో రకమైన వీడియో చూపించారని, అందులో వాయిస్ ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు తెలిపారు. సుమోటా కేసుగా నమోదు చేసినట్లు చెప్పారు. చర్యలు తీసుకుంటున్నాం: బాత్రూమ్లో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రాజ్యోతి నర్సింగ్ కళాశాల డైరెక్టర్ రశ్మీ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కారకులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య -
వాష్‌రూమ్ వెళ్లొస్తానని చెప్పిన యువతి.. ఎంతసేపటికీ రాకపోవడంతో..
సాక్షి, అడ్డగుట్ట(హైదరాబాద్): వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తమిళ్నాడులోని రాణిపేట్ జిల్లాకు చెందిన మిని ఏంజెల్(22) తండ్రిపేరు బాబు థామస్, వృత్తి రీత్యా స్టాఫ్ నర్స్. ఈ నెల 29న మిని ఏంజెల్ కుటుంబ సభ్యులందరూ తమిళనాడు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి శబరి ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తున్నారు. వాష్‌రూమ్ వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన మిని ఏంజెల్ ఎంతసేపటికీ రాకపోవడంతో అక్కడికి వెళ్లి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్దిపేట జిల్లాలో విద్యార్థినులతో టాయిలెట్స్ క్లీనింగ్
-
విద్యార్థినులతో టాయిలెట్స్ క్లీనింగ్
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): చీపుర్లు పట్టి టాయ్‌లెట్స్ శుభ్రం చేస్తున్న వీరంతా సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. ఈ పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు 560 మంది విద్యార్థినులున్నారు. హౌస్ కీపింగ్, ఇతర పనులకు విద్యార్థినులను పురమాయించడం రివాజుగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఇటీవల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదవండి: ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా! బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు.. -
‘మరుగు’న‘బడి’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరుగుదొడ్ల నిర్మాణంలో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మల, మూత్ర విసర్జన కోసం ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ముఖ్యంగా విద్యార్థినుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతి పాఠశాలలో చేపట్టారు. అయితే నిర్మాణాలు సకాలంలో పూర్తికాకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 251 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గుర్తించిన పనులపై నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు. దీంతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు మంజూరు చేసింది. ఇందులో విద్యాశాఖ 60శాతం, ఉపాధిహామీలో 40శాతం నిధులను వినియోగించాల్సి ఉంటుంది. తొమ్మిది శాతమే పూర్తి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అనుకున్న మేరకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారు. అనేక పాఠశాలల్లో నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 251 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా.. కట్టడాలు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 94 పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 70 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా.. 24 నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం మరుగుదొడ్ల లక్ష్యంలో 9.56 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. నిర్మాణాలకు నిధులు విడుదలవుతాయో? లేదో? అనే సందేహంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. వీటి నిర్మాణం విషయంలో అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు శ్రద్ధ తీసుకుంటేనే నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం ఉంది. మరుగుదొడ్లు లేకపోవడంతో.. పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర విసర్జన చేయాలంటే సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఎస్ఎంసీలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. పలుచోట్ల గతంలో సర్పంచ్‌లు కూడా కాంట్రాక్టర్లుగా వ్యవహరించగా.. వీరి పరిధిలోని నిర్మాణాలు ముందుకు సాగలేదు. పలు పాఠశాలల్లో నత్తనడకన.. జిల్లాలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. తిరుమలాయపాలెం మండలంలోని పాఠశాలల్లో 12 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే ఇక్కడ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఖమ్మం రూరల్ మండలంలో 10 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. కారేపల్లి మండలంలో 12 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. నేలకొండపల్లిలో 10 మంజూరు కాగా.. రెండు మాత్రమే ప్రారంభమయ్యాయి. కామేపల్లిలో 16 మంజూరు కాగా.. ఒకటి మాత్రమే ప్రారంభమైంది. ఖమ్మం అర్బన్‌లో 17 మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. త్వరితగతిన పూర్తి చేయిస్తాం.. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఉపాధిహామీ సిబ్బంది మరుగుదొడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభం కాని వాటిపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
మనుషుల్ని మింగే కార్పెట్ కొండ చిలువ
కాన్బెర్రా : ఆస్ట్రేలియాకు చెందిన 59 ఏళ్ల హెలెన్ రిచర్డ్స్ ఫేస్బుక్ సాక్షిగా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఆమె సూచనలు చదివి ఇంతేనా.. అనుకోవండి. తన సూచనలను హెచ్చరికలుగా భావించకపోతే చావు తథ్యం అంటున్నారామే. విషయమేంటో ఆమె మాటల్లోనే.. ‘గత మంగళవారం ఉదయం వాష్‌రూమ్‌కి వెళ్లిన నాకు చావుతప్పి కన్నులొట్టబోయినంత పనైంది. ఎప్పటిలానే నా పనిలో నేనుండగా.. నా వెనక భాగాన్ని ఏదో గట్టిగా గీటింది. దాంతో భయంతో ఎగిరి దుమికాను. లెట్రిన్ బేసిన్లో కప్ప దాగుంది కావొచ్చు అనుకున్నాను. బద్ధకంతో వాష్‌రూమ్‌లో లైట్ కూడా వేసుకోకపోవడంతో.. చీకట్లో ఏమీ కనిపించలేదు. ఏమై ఉంటుందబ్బా.. అని లైట్ వేశాను. అంతే.. దిమ్మతిరిగి పోయింది..! బేసిన్లో ఉన్నది కప్ప కాదు. పొడవైన పాము. ఇక అంతే.. నోట మాట రాలేదు. చచ్చాన్రా దేవుడా అనుకున్నాను. ఒక్క నిముషం గడ్డకట్టుకుపోయాను. కాస్త ధైర్యం కూడదీసుకుని మరోసారి బేసిన్లో కొంచెం పరిశీలనగా చూశాను. మనసుకు కాస్త ఊరట కలిగింది. బేసిన్లో నక్కి.. నన్ను కాటు వేసింది విష రహితమైన కొండచిలువ అని గ్రహించాను. అయితే, అది విషం కక్కే కొండ చిలువ కాకపోయినా.. మనుషుల్ని సైతం మింగే కార్పెట్ జాతి కొండ చిలువ. నా అదృష్టం కొద్దీ అది చిన్న సైజులో ఉంది. లేదంటే.. దానికి ఆహారమయ్యేదాన్నే..’ అని తన హారిబుల్ పైథాన్ స్టోరీని చెప్పుకొచ్చారు హెలెన్. మొత్తం మీద చిన్న గాయంతో బయటపడ్డానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాగా, చాపెల్ హిల్‌లో నివాసముంటున్న హెలెన్ పిలుపుతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ ఆ కార్పెట్ పైథాన్ పట్టుకొని అడవిలో వదిలేశారు. హెలెన్ తమను సంప్రదించడం.. ఘటనా సమయంలో ఆమె భయాందోళనలన్నింటినీ కలిపి స్నేక్ క్యాచర్స్ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేయడంతో అది వైరల్ అయింది. -
విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడి సాహసం
పాట్నా : తొలిసారి ఎక్కడికైనా వెళ్లినా, ఏదైనా పని ప్రారంభించిన, ఏదైనా వస్తువును కొన్నా కాస్తా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే తొలిసారి విమానయానం చేసేవారు అంటే ఈ కంగారు మరి కాస్తా ఎక్కువే. ఎందుకంటే విమానాలను దగ్గర నుంచి చూడ్డమే చాలా అరుదు. అలాంటప్పుడు ఇక వాటి గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. దాంతో తొలిసారి విమానయానం చేసేటప్పుడు సహజంగా కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. ఇలాంటి పొరపాటు సంఘటనే ఒకటి ఢిల్లీ నుండి పట్నా వెళ్తున్న గోఎయిర్ విమానంలో చోటు చేసుకుంది. రాజస్థాన్ అజ్మీర్‌కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి తొలిసారిగా విమానం ఎక్కాడు. ఈ క్రమంలో.. నిబంధనలు సరిగ్గా అర్థం కాకపోవడంతో తాను ఇబ్బంది పడ్డమే కాక ప్రయాణికులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. సదరు ప్రయాణికుడు విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు. విస్తుపోయిన ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో.. సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం విమానం పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే అతడు చెప్పిన సమాధానం విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం గురించి సదరు ప్రయాణికుడు తనకు విమాన ప్రయాణం కొత్త అని.. తాను విమానం ఎక్కడం ఇదే తొలిసారని.. అందువల్లే వాష్ రూమ్ డోర్‌కి, ఎగ్జిట్ తలుపుకి తేడా తెలుసుకోలేకపోయానని తెలిపాడు. ఫలితంగా ఈ పొరపాటు జరిగిందని వివరించాడు. దాంతో పోలీసులు తెలియక చేసిన తప్పుగా భావించి సదరు వ్యక్తిని విడిచిపెట్టారు. విమాన సిబ్బంది కూడా అనుకోని ఈ పరిణామానికి తొలుత కొంత భయపడినా.. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తి గనుక బలవంతంగా ఎగ్జిట్ డోర్ తెరిచి ఉంటే.. అనుకోని ప్రమాదం సంభవించి ఉండేదని సిబ్బంది తెలిపారు. జరిగిన సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా గోఎయిర్ యాజమాన్యం తమ సిబ్బందిని ఆదేశించింది. అంతేకాక నిబంధనల గురించి ప్రయాణిలకు సరైన రీతిలో అర్థం అయ్యేలా చెప్పాలని తెలిపింది. గతంలో కూడా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రాంచీలోని బ్రిసా ముందా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్ తీసి అందరినీ బెంబేలెత్తించాడు. విమానాశ్రయంలో దిగి ఎయిర్ఏసియా విమానం రన్‌వేపైకి వస్తుండగా ప్రయాణికుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల ఆ ఘటన జరిగింది. -
మహిళా కాలేజీలో ఆకతాయిలు
ప్రకాశం, చీరాల: పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పూనుకున్నారు. విద్యార్ధినుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించారు. వివరాలు.. పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థినులు రైలు పట్టాల పక్కన నూతనంగా నిర్మించిన వాష్ రూమ్‌కు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. గోడపై నుంచి ఇద్దరు యువకులు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన విద్యార్థినులు పెద్దగా కేకలు వేయగా పరారయ్యేందుకు యత్నించారు. ఇద్దరిలో ఒకరిని స్థానికులు పట్టుకుని కళాశాల అధ్యాపకులకు అప్పగించగా మరొకడు పరారయ్యాడు. పట్టుబడిన యువకుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన యువకుడు ఒంగోలుకు చెందిన పాలపర్తి కార్తీక్‌గా గుర్తించారు. తన బాబాయిని చూసేందుకు చీరాల వచ్చానని చెబుతున్నాడు. పట్టుబడిన యువకుడి వద్ద ఎటువంటి సెల్ఫోన్లు దొరకలేదు. పరారైన మరో యువకుడి వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నట్లు ఒన్‌టౌన్ పోలీసులు తెలిపారు.రైలు పట్టాలు పక్కన ప్రహరీ వద్ద చిల్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మలవిసర్జనకు ఎక్కువ మంది ఆ వైపునకు వెళ్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. -
బాత్రూంలో నిద్రపోతూ దొరికిపోయాను: నటి
‘నేను పాఠశాలకు వెళ్లి, బాత్రూమ్లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు టీచర్ నేను బాత్రూమ్లో నిద్రపోతుండగా పట్టుకుంది. తరగతి గదిలో నేను కనిపించకపోవడంతో అనుమానించి బాత్రూమ్లోకి వచ్చేసింది. అలా దొరికిపోవడంతో ఒక వారంపాటు నేను తరగతిగదిలో బల్లలను తుడవాల్సి వచ్చింది’ అంటూ చిన్ననాటి చిలిపి బాల్యాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ‘వారంపాటు తరగతిలో బల్లలు తుడవడం అంటే మాటలు కాదు. ఇది చాలా కష్టం. కాబట్టి ఎవరూ తరగతి గదిలో నిద్రపోకూడదు. కావాలంటే ఇంట్లో నిద్రపోండి’ అంటూ సలహా ఇచ్చింది. బాలల దినోత్సవం సందర్భంగా ముంబైలో అకోర్న్ (ACORN) ఫౌండేషన్ పిల్లలతో అలియా ప్రత్యేకంగా ముచ్చటించింది. ‘ఈ సందర్భంగా నా వయస్సు ఎంత అని పిల్లలను అడిగాను. ఓ పిల్లాడు 32 ఏళ్లు అని చెప్పాడు. కానీ, నేను చిన్నపిల్లనే. కాబట్టి మీతో బాలల దినోత్సవం జరుపుకోవడానికి వచ్చానని వారికి చెప్పాను’ అని ఆమె విలేకరులతో తెలిపింది. ప్రతి ఏడాది పిల్లలతో కలిసి ఇలా బాలల దినోత్సవం జరుపుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. -
బాత్రూమ్ లోనూ 'సెల్ఫీ' కోసం వెంటపడ్డాడు!
ముంబై: సెలబ్రిటీ సినీ తారలంటే ప్రజల్లో క్రేజ్ ఉండటం సహజం. కానీ వారు ఎక్కడికీ వెళ్లినా వెంటపడటం.. బాత్రూమ్లోకి వెళ్లినా.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ ఓ 'సెల్ఫీ' కోసం బతిమాలుకోవడం ఏమన్నా బావుంటుందా? ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఇదేరకమైన వింత అనుభవం ఎదురైంది. బాలీవుడ్ లివింగ్ లెజెండ్ అమితాబ్‌కు కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా బిగ్ బీ చుట్టూ అభిమానులు గుమిగూడటం సహజమే. అయితే ఇటీవల ఓ 'తిక్క' అభిమాని బాత్రూమ్లోనూ 'సెల్ఫీ' కోసం ఆయన వెంటపడ్డాడట. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించాడు. 'ఇటీవల పెరిగిపోయిన కమ్యూనికేషన్స్, వ్యక్తుల కోరికలు, తమ జీవిత చరిత్రలో 'సెల్ఫీ'ని కూడా భాగం చేసుకోవాలన్న భయంకరమైన ఆలోచనలు నన్ను విస్తుగొలిపాయి. ఇటీవల పబ్లిక్ వాష్‌రూమ్‌లో కొందరు తారసపడ్డారు. నిజమే వాష్‌రూమ్‌లోనే. అందులో ఒకతను నాతో 'సెల్ఫీ' దిగాలని కోరాడు. నిజంగా నీకేమైనా తిక్కనా? దీనికి నేను ఎలా అంగీకరిస్తానని నువ్వు అనుకున్నావు?' అని బిగ్ బీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. 'ఈ ప్రపంచంలో అందరిదే ఇదే అజెండా. ఆ లక్ష్యం కోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. దీని నుంచి బయటపడాలి' అని 'సెల్ఫీ' మోజును వదులుకోవాలంటూ ఆయన సూచించారు. అమితాబ్ ప్రస్తుతం విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి 'టీఈ3ఎన్' సినిమాలో నటిస్తున్నారు.