బాత్రూంలో నిద్రపోతూ దొరికిపోయాను: నటి
బాత్రూంలో నిద్రపోతూ దొరికిపోయాను: నటి
Published Mon, Nov 14 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
‘నేను పాఠశాలకు వెళ్లి, బాత్‌రూమ్‌లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు టీచర్ నేను బాత్‌రూమ్‌లో నిద్రపోతుండగా పట్టుకుంది. తరగతి గదిలో నేను కనిపించకపోవడంతో అనుమానించి బాత్‌రూమ్‌లోకి వచ్చేసింది. అలా దొరికిపోవడంతో ఒక వారంపాటు నేను తరగతిగదిలో బల్లలను తుడవాల్సి వచ్చింది’ అంటూ చిన్ననాటి చిలిపి బాల్యాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ‘వారంపాటు తరగతిలో బల్లలు తుడవడం అంటే మాటలు కాదు. ఇది చాలా కష్టం. కాబట్టి ఎవరూ తరగతి గదిలో నిద్రపోకూడదు. కావాలంటే ఇంట్లో నిద్రపోండి’ అంటూ సలహా ఇచ్చింది.
బాలల దినోత్సవం సందర్భంగా ముంబైలో అకోర్న్ (ACORN) ఫౌండేషన్ పిల్లలతో అలియా ప్రత్యేకంగా ముచ్చటించింది. ‘ఈ సందర్భంగా నా వయస్సు ఎంత అని పిల్లలను అడిగాను. ఓ పిల్లాడు 32 ఏళ్లు అని చెప్పాడు. కానీ, నేను చిన్నపిల్లనే. కాబట్టి మీతో బాలల దినోత్సవం జరుపుకోవడానికి వచ్చానని వారికి చెప్పాను’ అని ఆమె విలేకరులతో తెలిపింది. ప్రతి ఏడాది పిల్లలతో కలిసి ఇలా బాలల దినోత్సవం జరుపుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది.
Advertisement
Advertisement