
బాలీవుడ్ భామ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా జన్మించింది. గతేడాది జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఈ ఏడాది ఆల్ఫా అనే మూవీలో కనిపించనుంది.
అయితే ఆలియా భట్‌కు పూజా భట్, షాహీన్ భట్ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన షాహీన్ భట్ ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ ఇషాన్ మెహ్రాతో డేటింగ్‌లో ఉన్నారు. ఇవాళ అతని బర్త్ డే కావడంతో షాహీన్ భట్ విషెస్ చెబుతూ అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అతనితో రిలేషన్‌లో ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.
ఇది చూసిన అలియా భట్ తన సిస్టర్ షాహీన్ భట్‌కు మద్దతుగా నిలిచింది. ఇషాన్ మెహ్రా పుట్టినరోజు సందర్భంగా అలియా భట్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా షాహీన్ చేసిన పోస్ట్‌ను అలియా భట్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై నీతూ కపూర్, పూజా భట్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, పరిణీతి చోప్రా, బాద్షా,మసాబా గుప్తా సైతం స్పందించారు. షాహీన్ భట్ భాయ్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. షాహీన్ భట్ గతంలో హాస్యనటుడు రోహన్ జోషితో రిలేషన్ షిప్‌లో ఉన్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు.
కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో షాహీన్ భట్.. ఇషాన్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కానీ అతని ఎవరు అనేది వెల్లడించలేదు. ఈ ఏడాది కపూర్, భట్ కుటుంబాలు న్యూ ఇయర్ సందర్భంగా థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోకి షాహీన్ తన ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఒక ఫోటోలో ఆమె ఇషాన్ పక్కన నిలబడి పోజులిచ్చింది. మరో చిత్రంలో క్రూయిజ్‌లో ఉన్నప్పుడు వారిద్దరు కౌగిలించుకున్నారు. అప్పటి నుంచే ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.