
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్‌లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్‌ను వీక్షించారు.
అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్‌మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్‌పై గతంలో కూడా సారా అలీ ఖాన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్‌లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్‌లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment