శుభమన్‌తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్! | Sara Ali Khan Reacts To Dating Rumours With Shubman Gill In Koffee With Karan Show, Video Viral - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: నేను కాదండి.. అందరూ నా వెంట పడ్డారు.. డేటింగ్‌పై సారా కామెంట్స్!

Published Mon, Nov 6 2023 4:36 PM | Last Updated on Mon, Nov 6 2023 4:49 PM

Sara Ali Khan REACTS To Dating Rumours With Shubman Gill  - Sakshi

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది.  అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్‌ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్‌ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

శుభమన్‌తో డేటింగ్?
 
అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్‌కపూర్‌తో అనన్య డేటింగ్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్‌లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే.

సారాపై రూమర్స్!

ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్‌మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్‌ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్‌లో  సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్‌ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement