బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‍మన్ గిల్ గతంలో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఎవరూ కూడా నోరు విప్పలేదు.
(ఇది చదవండి: Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..)
అయితే అంతలా కలిసి తిరిగినా వీరిద్దరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లేనా అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. గతంలోనూ సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడే గానీ డేటింగ్ గురించి స్పందించలేదు.
(ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి)
అయితే కొన్ని నెలల క్రితం సోనమ్ బజ్వాతో ఇంటర్వ్యూలో గిల్ చివరకు సారాతో డేటింగ్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?" గిల్‌ని ప్రశ్నించగా.. అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ బదులిచ్చారు. కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment