Sara Tendulkar
-
సారా టెండుల్కర్ స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిన ఫొటోలు
-
చిన్ననాటి కలను నెరవేర్చుకున్న సారా.. సాగరంలో సాహస విహారం (ఫొటోలు)
-
సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్స్.. హీరోయిన్స్‌ను మించి(ఫోటోలు)
-
గిల్‌కు ఎంతో ప్రత్యేకం: బ్రిస్బేన్‌లో సారా టెండుల్కర్, ఇతర సెలబ్రిటీల సందడి
-
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్‌లో దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన సారా
-
లవ్ యూ.. నిన్ను చూసి గర్విస్తున్నా:సారా టెండుల్కర్ (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో సచిన్- అంజలి గారాలపట్టి హొయలు (ఫొటోలు)
-
సచిన్ టెండుల్కర్ కుటుంబం.. కొత్త ఫొటోలు చూశారా?
-
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి. -
కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ కూతురు!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సార్ గ్లాస్‌లాంటి స్కిన్‌తో అత్యంత అందంగా ఉంటుంది. ఇప్పటికే ఆమె 2021లో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ సెల్ఫ్ పోర్ట్రెయిట్ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడూ గ్లామర్ రంగంలో ఎంట్రీ ఇస్తూ..ప్రఖ్యాత భారతీయ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ లానీజ్ అంబాసిడర్‌గా వ్యవవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సారా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ..ఆరోగ్యకరమైన మెరస్తున్న చర్మం కోసం లానీజ్ బ్రాండ్‌ని ఎంపిక చేసుకుని సరికొత్త ముఖంతో థ్రిల్‌గా ఉన్నాను. మీరు కూడా నాలాగే ప్రకాశవంతమైన చర్మంతో ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. తాను ఆ బ్రాండ్ ఆవిష్కరణ, నిబద్ధతను అభినందిస్తున్నాని చెప్పింది. తాను కొంతకాలంగా ఈ ఉత్పత్తులను వినయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి కాంతివంతంగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తాను ఈ లానీజ్తో మరింత అందంగా కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని రాసుకొచ్చింది సారా. సారా గ్లామర్ పరంగా సింపుల్ మేకప్‌తో క్యూట్ లుక్‌తో సందడి చేస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది సారా. అందుకు తగ్గట్లు ఆమె ధరించే డిజైన్‌వేర్‌లు ఆమె అందాన్ని మరింత ఇనమడింప చేస్తాయి. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) ( చదవండి: ఈ ఏడాది మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?) -
ఇన్‌స్టాలో అందాల ముద్దుగుమ్మల సందడి (ఫోటోలు)
-
LBW అంటూ సచిన్ విషెస్.. ముద్ద మందారంలా సారా
కాబోయే వధూవరులు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్లకు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. అందమైన జంట విషయంలో 'LBW' అంటే వేరే అర్థం ఉందంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. కాగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబానీల స్వస్థలం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముందుస్తు పెళ్లి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్చి 1-3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వ్యాపార దిగ్గజాలు సహా సినీ, క్రీడా ప్రముఖులంతా విచ్చేశారు. సచిన్ టెండుల్కర్ సైతం సతీమణి అంజలి, కుమార్తె సారాతో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో పాలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘‘అనంత్, రాధిక విషయంలో ‘LBW’ అంటే ప్రేమ(Love), ఆశీర్వాదాలు(Blessings), అభినందనలు(Wishes). అందమైన జంటకు శుభాకాంక్షలు’’ అని సచిన్ టెండుల్కర్ కాబోయే జంట ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి విషెస్ తెలిపాడు. అన్నట్లు క్రికెట్ పరిభాషలో.. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్. బ్యాటర్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బౌలర్ సంధించే బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల ముందే అతడికి దొరికి పోయి పెవిలియన్ చేరాల్సిందే! స్పెషల్ అట్రాక్షన్‌గా సారా అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ముఖ్యంగా ఎరుపు వర్ణం లెహంగాలో ముద్ద మందారంలా చక్కగా కనిపించింది. ఆ ఫొటోలను సారా ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! The 'LBW' here stands for Love, Blessings, and Wishes for Anant and Radhika! Best wishes to the beautiful couple. pic.twitter.com/L14RvNefXH — Sachin Tendulkar (@sachin_rt) March 4, 2024 -
సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల తనయ సారా టెండూల్కర్ అందరికీ సుపరచితమే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈసారి ఆమె తన సోదరుడు అర్జున్‌తో కలిసి ఇన్‌స్టాలో తాము తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌ల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తాము రోజు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో, ఏవి ఇష్టంగా తింటారో సవివరంగా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అంతేగాదు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉదయాన్ని ప్రారంభిస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమేగాక మంచి ఎనర్జీ కూడా వస్తుందని చెబుతోంది. తమలా ఇలాంటి ఆరోగ్యకరమైన అల్పహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలనుకుంటే ఈ లిస్ట్ ఫాలో అవ్వండి అంటూ ఆ రెసిపీల వివరాలు వెల్లడించింది సారా. అవేంటంటే.. అవకాడో టోస్ట్లైట్తో గిలకొట్టిన గుడ్లు.. హోల్ గ్రెయిన్బ్రెడ్ టోస్ట్‌పై క్రీమీ అవోకాడోని జత చేసి, దానికి ప్రోటీన్ ప్యాక్డ్ గిలకొట్టిన గుడ్లను జోడించండి. కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి కాస్త పెనంపై కాల్చాలి. చివరిగా వేడి సాస్‌తో గార్నిష్ చేసి తింటే టేస్ట్ అదుర్స్. పోహా! అటుకులనే పోహా అంటారు. తేలకగా జీర్ణమయ్యే ఆహారం. ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి, చివరగా తాజా కొత్తిమీర నిమ్మకాయ జల్లుకుని తింటే నోటిలో నీళ్లు ఊరడం ఖాయం. దోస దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందిన అల్పహారం. దక్షణ భారతదేశంలో అత్యంత ఫేమస్ వంటకం. బియ్యం మినప్పులతో చేసిన దోసపిండిని పెనం మీద చక్కగా అట్టులా పోసి మసాల బంగాళ దుంప కూరని పెట్టి దొరగా కాల్చి తీయాలి. ఆ తర్వా కొబ్బరి చట్నీ, సాంబారుతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఉప్మా మంచి పోషకాలతో కూడిన దక్షిణ భారతదేశ వంటకం. సుగంధ ద్రవ్యాలు, చక్కటి పప్పు ధాన్యాలు, కూరగాయాలతో తయారు చేసే మంచి రెసిపీ. ఇడ్లీ మృదువుగా ఉంటుంది. ఆవిరిపై ఉడికించే వంటకం ఇది. రైస్ కేక్ మాదిరిగా ఉంటుంది. దీన్ని కూడా కొబ్బరి చట్నీ, సాంబార్‌తో తింటే ఉంటుంది.. సామీరంగా వదిలిపెట్టరు. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైన అల్పహార రెసిపీలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ డైట్లో జోడించండి, ఆరోగ్యంగా ఉండండి అంటోంది అందాల సారా. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయ్యిపోండి. (చదవండి: వరల్డ్ దోస డే! దోస రెసిపీని మొదటగా ఎవరు చూశారు? అంత క్రేజ్ ఎలా వచ్చిందంటే..?) -
Sara Tendulkar Photos: మచ్చలేని అందం సారా.. సంగీత్‌కు రెడీ అంటున్న సచిన్ తనయ (ఫొటోలు)
-
లేత గులాబీ చీరలో కుందనపు బొమ్మలా సచిన్ కూతురు!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముద్దల తనయ సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటి కప్పుడూ తన లేటెస్ట్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి చీర కట్టులో ముగ్ద మనోహరంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో చమీ అండ్ పాలక్ శారీస్ బ్రాండ్‌కి చెందిన పింక్ జార్జెట్ చీరలో తళుక్కుమంది. ఈ చీరకు తగ్గట్టు ఎంబ్రాయిడరీ నెక్ బ్లౌజ్‌తో చాలా అద్భుతంగా కనిపించింది. ఆ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా చెవిపోగులు, పాపిడి బోట్టు, మ్యాచింగ్ గాజులతో కుందనపు బొమ్మలా ఉంది. చక్కగా తెలుగింటి వారి ఆడపడుచులా జడ వేసుకుని కనిపించింది. ఆ లేత గులాబి చీరలో ఉన్న మరో అందమైన గులాబీ ఏమో అనేంత అందంగా ఉంది. ఇక సారా ధరించి ఈ లేత గులాబీ జార్జెట్ చీర ధర రూ. 37,000/-. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సారా మీరు అద్భుతంగా ఉన్నారని ఒకరూ, కళ్లు చెదిరే అందం మీ సొంతం అని మరోకరూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) (చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్‌లో లుక్ మాములుగా లేదుగా!) -
అప్పుడు సారా.. ఇప్పుడు సచిన్ టెండుల్కర్!
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలకు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు డీప్‌ఫేక్ బారిన పడగా.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా తాజాగా ఆ బాధితుల జాబితాలో చేరాడు. ఓ గేమింగ్ అప్లికేషన్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్లుగా నకిలీ వీడియోను రూపొందించి నెట్టింట వదిలారు సైబర్ నేరాలకు అలవాటు పడ్డ మాయగాళ్లు. ఇది కాస్తా తన వరకు చేరడంతో.. ఎక్స్ వేదికగా స్పందించాడీ బ్యాటింగ్ లెజెండ్. ఇవన్నీ నకిలీ వీడియోలు ‘‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇంతలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్, అప్లికేషన్లు గనుక మీ దృష్టికి వస్తే ప్రతి ఒక్కరు తప్పక రిపోర్టు చేయండి’’ ని సచిన్ టెండుల్కర్.. తన ఫాలోవర్లకు సూచించాడు. అదే విధంగా.. ‘‘ఇలాంటి ఫిర్యాదుల పట్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా వేగంగా స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలి. డీప్‌ఫేక్స్, తప్పు సమాచారవ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మేనేజ్మెంట్లకు విజ్ఞప్తి చేశాడు సచిన్ టెండుల్కర్. గిల్‌తో ఉన్నట్లుగా ఫొటో మార్ఫ్ చేసి కాగా సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ కూడా డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోను సృష్టించారు. తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్తో సారా దిగిన ఫొటోను మార్ఫ్ చేసి లీక్ చేశారు. అంతేకాదు ఆమె పేరిట ఫేక్ అకౌంట్లు సృష్టించి గిల్ పట్ల ప్రేమను చాటుకుంటున్నట్లుగా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన సారా టెండుల్కర్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది. చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే! -
Sara Tendulkar: సారా టెండుల్కర్ స్టన్నింగ్స్ లుక్స్ (ఫొటోలు)
-
నా డీప్‌ఫేక్ ఫొటోలు షేర్ చేస్తున్నారు: సారా టెండుల్కర్ ఆవేదన
తన పేరిట జరుగుతున్న దుష్ప్రచారంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తనకు ఎటువంటి ఖాతా లేదని స్పష్టం చేసింది. కొంతమంది కావాలనే డీప్‌ఫేక్ ఫొటోలతో తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ అకౌంట్లను వెంటనే తొలగించాలని ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు సారా విజ్ఞప్తి చేసింది. కాగా సచిన్ తనయగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతో సారా టెండుల్కర్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలు అభిమానులతో పంచుకోవడం ఆమెకు అలవాటు. అయితే, ఎక్స్(ట్విటర్)లోనూ సారా టెండ్కులర్ పేరిట బ్లూ టిక్‌తో ఓ అకౌంట్ ఉంది. పేరడి అకౌంట్‌గా పేర్కొన్న ఈ ఖాతాలో సారా ఫొటోలు షేర్ చేయడమే గాకుండా.. టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్ పట్ల ఆమెకు ప్రత్యేక శ్రద్ధగా ఉన్నట్లుగా కొన్నిరోజులుగా పోస్టులు పెడుతున్నారు. వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియాను సపోర్టు చేస్తూ సారా స్టేడియాలకు వెళ్లిన విషయం తెలిసిందే. గిల్‌తో ఆమె ప్రేమలో ఉందన్న వదంతులకు ఇలాంటి ఘటనలు మరింత బలాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో సారా పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో గిల్‌కు ఆమె విషెస్ చెబుతున్నట్లు.. అతడు అవుటైన సందర్భాల్లో బాధ పడిటన్లు పోస్టులు పెట్టారు. ఇక మరో ఖాతాలో తన తమ్ముడు అర్జున్‌తో సారా ఉన్న ఫొటోల్లో గిల్ ముఖంతో మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కలత చెందిన సారా టెండుల్కర్ ఇన్‌స్టా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మన సంతోషాలు, బాధలు.. రోజూవారీ కార్యకలాపాలు అభిమానులతో పంచుకోవడానికి దొరికిన ఒక అద్భుత మాధ్యమం సోషల్ మీడియా. కానీ కొంతమంది సాంకేతికను దుర్వినియోగం చేస్తూ అభూత కల్పనలతో ఇంటర్నెట్ను నింపేస్తున్నారు. నాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ ఫొటోలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ వాస్తవదూరాలు. అంతేకాదు ఎక్స్‌లో నా పేరిట ఖాతా తెరిచి ప్రజలను తికమకకు గురిచేస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్ ఖాతా లేనేలేదు. ఇలాంటి అకౌంట్లను పరిశీలించి వాటిని నిషేధిస్తారని భావిస్తున్నా. నిజాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా వినోదం అందించాల్సిన అవసరం లేదు. నమ్మకం, వాస్తవాల ఆధారంగా నడిచే కమ్యూనికేషన్‌ను ఎంకరేజ్ చేద్దాం’’ అని సారా పేర్కొంది. కాగా ఇటీవలి కాలంలో డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో దుమారం రేపగా.. కత్రినా కైఫ్, కాజోల్ వంటి నటీమణులకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తాంటూ కేంద్రం హామీ ఇచ్చింది. -
గిల్‌తో ఫొటో షేర్ చేసి ‘రిలేషన్’ కన్ఫర్మ్ చేసిందంటూ ప్రచారాలు.. వాస్తవం ఇదే
Fact Check: డిజిటల్ యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో పోల్చుకోవడం కష్టతరంగా మారింది. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత మార్ఫ్డ్ ఫొటోలు, వీడియోల వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. సెలబ్రిటీలను ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ.. సైబర్ క్రిమినల్స్ చేసే ఇలాంటి చెత్త పనుల వల్ల.. సామాన్యులు కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. అమ్మాయిల భద్రతపై ఆందోళన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారిన తరుణంలో.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్‌కు సంబంధించిన ఫొటోపై నెట్టింట చర్చ మొదలైంది. ప్రేమలో ఉన్నారంటూ వదంతులు కాగా టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. గిల్ సోదరి షానిల్కు సారా స్నేహితురాలు. ఈ క్రమంలో గిల్- సారా మధ్య కూడా పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందని గాసిప్ రాయుళ్లు గతంలో కథనాలు అల్లారు. సోషల్ మీడియాలో శుబ్‌మన్ గిల్- సారా ఒకరినొకరు ఫాలో అవడం.. గిల్ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సారా కామెంట్లు చేయడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. సారా వైపునకే కెమెరాలు ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ముంబైలో టీమిండియా మ్యాచ్ సందర్భంగా సారా టెండుల్కర్ స్టేడియానికి రావడంతో మరోసారి పాత రూమర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా గిల్ షాట్లు ఆడినప్పుడల్లా కెమెరాలు ఆమె వైపునకు తిప్పడం.. ఆ సమయంలో సారా చప్పట్లుకొడుతూ జట్టు(గిల్‌ను మాత్రమే అన్నట్లు అపార్థాలు)ను ఉత్సాహపరుస్తూ కనిపించడం ఇందుకు కారణం. స్టేడియంలో అల్లరిమూకల అతిచేష్టలు ఇక స్టేడియంలో కొంతమందైతే గిల్ షాట్ బాదినప్పుడల్లా సారా వదిన అంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం మరీ దారుణం. ఇలాంటి తరుణంలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవంలో వీరిద్దరు కలిసి కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సారా... శుబ్‌మన్‌ను ప్రేమగా హత్తుకుని ఉన్నట్లుగా ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, వాస్తవానికి అది మార్ఫ్డ్ ఫొటో. నిజం ఇదే: తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 24న సారా టెండుల్కర్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘నా చిన్నారి తమ్ముడు ఈ 24న 24వ వసంతంలోకి!! హ్యాపియెస్ట్ బర్త్‌డే. మీ అక్క నీకెప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందులో తమ చిన్ననాటి ఫొటోలతో పాటు ప్రస్తుత ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. వాటిలో ఓ ఫొటోలో అర్జున్‌కు ఆత్మీయంగా హత్తుకున్న సారా ఫొటోను మార్ఫ్ చేసినట్లు స్పష్టమైంది. అర్జున్ ప్లేస్‌లో శుబ్‌మన్ ఫొటో పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. అయితే, సారా ఇన్స్టాగ్రామ్ పరిశీలించగా అర్జున్ ఫేస్‌కు బదులు శుబ్‌మన్ ఫేస్ యాడ్ చేసి ఈ ఫొటో మార్ఫింగ్ చేసినట్లు బయటపడింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
శుభమన్తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శుభమన్తో డేటింగ్? అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్కపూర్తో అనన్య డేటింగ్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. సారాపై రూమర్స్! ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్‌మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్‌ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్‌లో సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్‌ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
అయ్యో శుబ్‌మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా శ్రీలంకపై టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో తన తొలి వరల్డ్‌కప్ సెంచరీని గిల్ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 92 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్.. 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మధుశంక బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి గిల్ తన వికెట్‌ను కోల్పోయాడు. వాంఖడేలో సారా సందడి.. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ గారాల పట్టి, శుబ్‌మన్ గిల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సారా టెండూల్కర్ వాంఖడే స్టేడియంకు వచ్చింది. గిల్ బౌండరీలు కొట్టిన ప్రతీసారి సారా చప్పట్లు కొడుతూ కన్పించింది. కాగా గిల్ సెంచరీకి చేరువలో ఔటైన వెంటనే సారా తీవ్ర నిరాశ చెందింది. ఒక్కసారిగా సారా ముఖం వాడిపోయింది. అయితే గిల్ నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా.. సారా చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవిషేన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WC 2023: ఇదేం షాట్ రా బాబోయ్.. విరాట్ కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్ I don’t know how to express this pain but same Sara didi same #INDvSL pic.twitter.com/6z8CNquRyT — Fenil Kothari (@fenilkothari) November 2, 2023 Sara Tendulkar clapping and appreciating Shubman Gill's Incredible innings. pic.twitter.com/5QKzyjjQn2 — CricketMAN2 (@ImTanujSingh) November 2, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
ముంబైలో చక్కర్లు కొడుతున్న గిల్- సారా టెండూల్కర్! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సచిన్ టెండుల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా నవంబర్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ప్రస్తుతం భారత జట్టు ముంబైలో ఉంది. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్, సారా ఇద్దరూ కలిసి ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. శుభ్‌మన్ గిల్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ వేసుకోగా.. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ సారా దర్శనమిచ్చింది. గిల్ ఎంట్రెన్స్ గేట్ నుంచి బయటకు రాగా.. సారా మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంట్రీ గేట్ వద్దే ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రేమ జంట ముంబై వీధుల్లో చక్కెర్లు కొడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీలో గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 104 పరుగులు చేస్తున్నారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
WC 2023: వదినమ్మా! పనీపాటా ఏం లేదా? ఎందుకో ఇలా?
ICC ODI WC 2023- Ind Vs Ban: వన్డే వరల్డ్‌కప్-2023.. గురువారం.. పుణెలో టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది.. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) శుభారంభం అందించారు. ఈ జంటను విడదీసిన భారత బౌలర్లు మిడిలార్డర్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(38) తన భుజాల మీద వేసుకున్నాడు. మరో ఎండ్‌లో తౌహీద్ హృదోయ్ కూడా తన వంతు పోరాటం చేస్తున్నాడు. అయితే, 38వ ఓవర్ రెండో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో హృదోయ్ ఇచ్చిన క్యాచ్‌ను టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఒడిసిపట్టాడు. సింపుల్ క్యాచ్ అందుకున్న గిల్ మిడ్‌వికెట్ మీదుగా హృదోయ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను గిల్ అందుకోగానే.. కెమెరాలన్నీ స్టేడియంలో ఓ అమ్మాయి వైపునకు తిరిగాయి. ఆమె మరెవరో కాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ గారాల కుమార్తె సారా టెండుల్కర్. కాగా గిల్, సారా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్న క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వాటిని బలపరుస్తూ తామిద్దరం డేటింగ్లో ఉన్నట్లు ఈ జంట ఎన్నోసార్లు సంకేతాలు కూడా ఇచ్చింది. గిల్- సారా బ్రేకప్ కూడా అంటూ అయితే, దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ పెట్టిన పోస్టుతో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుబ్‌మన్ గిల్ కనిపించడంతో ఆమెతో అతడి పేరును లింక్ చేసేశారు. అయినప్పటికీ సారా టెండుల్కర్ ఎక్కడ కనిపించినా గిల్ ఇష్టసఖిగా పేర్కొంటూ ఆమె ఫొటోలను వైరల్ చేయడం నెటిజన్లకు పరిపాటిగా మారింది. తాజాగా టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్స్ సైతం గిల్ క్యాచ్ అందుకోగానే కెమెరాను మరోసారి సారా వైపునకు ఫోకస్ చేయడం గమనార్హం. టీమిండియాకు సపోర్టుగా సారా ఈ నేపథ్యంలో.. ‘‘వదినమ్మ సూపర్’’ అంటూ గిల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా.. ‘‘కెమెరామెన్‌కు కూడా.. మీలాగే ఏం పనీపాటా లేనట్లుంది. సారా టీమిండియాకు సపోర్టుగా వచ్చింది’’ అంటూ సచిన్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. మరికొంతమందేమో.. ‘‘కెమెరాపర్సన్కి పబ్లిక్ పల్స్ బాగా తెలుసు.. అందుకే సారాను స్పెషల్‌గా చూపిస్తున్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 256 పరుగులు స్కోరు చేసింది. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన Shubman Gill took a catch and cameraman show sara tendulkar 👀👀 #INDvsBAN pic.twitter.com/6dkKn3x634 — Jashan (@Jashan1705) October 19, 2023 Sara Tendulkar in the stands. pic.twitter.com/H0N5KWToiA — Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023 Sara Tendulkar is in the house😀#INDvBAN #indiavsbangladesh #Saratendulkar #ShubmanGill pic.twitter.com/HolLVxNIpK — Nikhil 🇮🇳 (@niks9326) October 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) Sara Tendulkar clapping after Shubman Gill's two sixes. pic.twitter.com/cGKHDUyyX4 — Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023 -
శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ ట్వీట్..?
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో గిల్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడటంం అనుమానంగా మారింది. గిల్ త్వరగా కోలుకుని ఆసీస్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. గిల్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ కూడా కోరుకుంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. అయితే సారా చేసిన ఈ ట్వీట్ ఫేక్ అని కూడా ప్రచారం జరుగుతుంది. సారాకు అసలు ట్విటర్ అకౌంటే లేదని గతంలో సచిన్ చెప్పాడు. దీంతో సారా ఈ ట్వీట్ చేసిందా లేదా వేరెవరైనా ఫేక్ ట్వీట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. Get well soon #ShubmanGill 💙🇮🇳 pic.twitter.com/sF1Nlr9Qbj — Sara Tendulkar (@imsaratendulkar) October 6, 2023 కాగా, శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొంతకాలంగా సోషల్‌మీడియా కోడైకూస్తున్న విషయం తెలిసిందే. సారా తాజా ట్వీట్ నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు అనుకుంటున్నారు. మొత్తానికి గిల్ కోసం సారా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఇటీవల శుభ్‌మన్ బర్త్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ కూడా వైరలైన విషయం తెలిసిందే. సచిన్ గిల్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను రేపు (అక్టోబర్ 8) ఆడనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో టీమిండియా ఆసీస్‌ను ఢీకొంటుంది. డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్న గిల్ ఈ మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. మరోవైపు టీమిండియా హార్దిక్ పాండ్యా సేవలను కూడా కోల్పోనున్నట్లు తెలుస్తుంది. చెన్నైలో ప్రాక్టీస్ చేస్తుండగా హార్దిక్ గాయపడ్డాడని సమాచారం. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో గిల్, హార్దిక్‌లు ఆడకపోతే అది టీమిండియాపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. -
‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌కు సచిన్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
Happy Birthday Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పుట్టినరోజు నేడు(సెప్టెంబరు 8). పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో జన్మించిన ఈ హ్యాండ్సమ్ బ్యాటర్ నేటి(శుక్రవారం)తో 24వ పడిలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం గిల్‌ను ప్రత్యేకంగా విష్ చేయడం హైలైట్‌గా నిలిచింది. కాగా 2018 అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు గిల్. 104.5 స్ట్రైక్‌రేటుతో 418 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీగా నాటి ఐసీసీ ఈవెంట్లో కెప్టెన్ పృథ్వీ షాకు డిప్యూటీగా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు అతడిని దాటుకుని టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. మరుసటి ఏడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు. డబుల్ సెంచరీ వీరుడు ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 టెస్టులు, 29 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన శుబ్‌మన్ గిల్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 966, 1514, 304 పరుగులు సాధించాడు. టెస్టుల్లో రెండు శతకాలు సాధించిన ఈ పంజాబీ కుర్రాడు.. వన్డేల్లో 4 సెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ హవా పొట్టి ఫార్మాట్లోనూ ఒక శతకం సాధించి.. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడి ఖాతాలో ఏకంగా 3 సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని రోల్ మోడల్‌గా భావించే గిల్.. భవిష్యత్తులో అతడి స్థాయికి ఎదగలడని ప్రశంసలు అందుకుంటున్నాడు. భావి భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు గిల్ గురించి జోస్యం చెబుతున్నారు. సొట్ట బుగ్గల కుర్రాడు.. అమ్మాయిల కలల రాకుమారుడు మేటి బ్యాటర్‌గా ఎదుగుతున్న శుబ్‌మన్ గిల్‌కు అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అహ్మదాబాద్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా ఓ యువతి.. ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా గిల్ అంటూ ప్లకార్డు ప్రదర్శించడం చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ‘సారా’లతో ప్రేమాయణం పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ సొట్ట బుగ్గల కుర్రాడి ‘ప్రేమాయణాలు’ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే! సచిన్ టెండుల్కర్ గారాలపట్టి సారా టెండుల్కర్తో గిల్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరు ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. అడపాదడపా కలిసి బయట కనిపించడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, దేవతలను ప్రేమించకూడదంటూ గిల్ పెట్టిన పోస్ట్‌తో సారాతో బ్రేకప్ అయ్యిందని ఊహాగానాలు వినిపించాయి. పటౌడీల యువరాణితో చెట్టాపట్టాల్ ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుబ్‌మన్ గిల్ కలిసి కనిపించడం మరోసారి రూమర్స్‌కు దారితీసింది. పటౌడీ పరగణా వారసురాలితో ఈ కుర్ర క్రికెటర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. కెరీర్‌పై ఫుల్ ఫోకస్ అయితే, ఇవన్నీ పట్టించుకోకుండా తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టాడు గిల్. వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనను తాను నిరూపించుకుంటూ.. టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడయ్యాడు. ప్రస్తుతం ఆసియా కప్-2023తో బిజీగా ఉన్న గిల్.. తదుపరి వన్డే వరల్డ్‌కప్-2023తో ఐసీసీ ఈవెంట్ బరిలో దిగనున్నాడు. సచిన్ టెండుల్కర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే తన కుమార్తె సారాతో గిల్ ప్రేమ వార్తల నేపథ్యంలోనూ సచిన్ టెండుల్కర్ ఈ యువ క్రికెటర్‌ను ఎప్పటికపుడు ఆకాశానికెత్తడం విశేషం. తన కళ్ల ముందే టీ20 మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సెంచరీ సాధించిన సందర్భంగా సచిన్ అతడిపై గతంలో ప్రశంసలు కురిపించాడు. తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా.. ‘‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే శుబ్‌మన్ గిల్. ఈ ఏడాది నువ్వు పరుగుల వరద పారించాలి. మరిన్ని గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాలి’’ అని సచిన్ ఆకాంక్షించాడు. ఇక రాబిన్ ఊతప్ప, అక్షర్ పటేల్ సహా సహచర క్రికెటర్లు బర్త్‌డే బాయ్ గిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: పాక్ ఫాస్ట్‌బౌలర్లే కాదు.. టీమిండియా పేసర్లూ భేష్! వాళ్లకు చుక్కలు ఖాయం - Double hundred in ODIs. - Hundred in Test. - Hundred in T20I. - Hundred in IPL. - Player of the tournament in U-19 WC. Happy Birthday to the future Super-star of the World Cricket, Shubman Gill. pic.twitter.com/xUs1IcAtFI — Johns. (@CricCrazyJohns) September 8, 2023 5️⃣8️⃣ intl. matches 2️⃣7️⃣8️⃣4️⃣ intl. runs Youngest ODI double-centurion (in Men's cricket) 🔝 Youngest all-format centurion in Men's intl. cricket 👌 Here's wishing Shubman Gill a very happy birthday 👏 🎂#TeamIndia pic.twitter.com/BAaXEBClRN — BCCI (@BCCI) September 8, 2023 Happiest birthday to you @ShubmanGill. May the upcoming year be full of runs and great memories. — Sachin Tendulkar (@sachin_rt) September 8, 2023 -
సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గతంలో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఎవరూ కూడా నోరు విప్పలేదు. (ఇది చదవండి: Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..) అయితే అంతలా కలిసి తిరిగినా వీరిద్దరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లేనా అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. గతంలోనూ సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడే గానీ డేటింగ్ గురించి స్పందించలేదు. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) అయితే కొన్ని నెలల క్రితం సోనమ్ బజ్వాతో ఇంటర్వ్యూలో గిల్ చివరకు సారాతో డేటింగ్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?" గిల్‌ని ప్రశ్నించగా.. అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ బదులిచ్చారు. కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నారు. -
ముంబై , గుజరాత్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్!
ఐపీఎల్ 16వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ట్విటర్లో ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది. ఇలా ఎందుకున్నది ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ల మధ్య ప్రేమాయణం నడుస్తుదంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ గిల్ టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించినప్పటి నుంచి సారా, గిల్ల మధ్య మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే తాము మంచి స్నేహితులమని గిల్ పేర్కొన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చింది ఊహించుకుంటూ బతికేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. ముంబై ఇండియన్స్ తరపున సారా టెండూల్కర్ సోదరుడు అర్జున్ మ్యాచ్‌లో బరిలో ఉండడమే. ఒకవైపు గుజరాత్ తరపున శుబ్‌మన్ గిల్.. ముంబై జట్టు తరపున అర్జున్ ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో సారా ఎవరికి మద్దతివ్వాలో తెలియక మ్యాచ్ చూడడం మానేసిందని కొందరు అభిమానులు ట్విటర్లో ఫన్నీ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్, శుబ్‌మన్ గిల్లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు. గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్ అర్జున్ వేసినప్పటికి ఆ ఓవర్లో నాలుగో బంతిని గిల్ ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. ఇక తన రెండో ఓవర్ తొలి బంతికే సాహాను ఔట్ చేసిన అర్జున్ బౌలింగ్ ఎదుర్కొనే చాన్స్ గిల్‌కు రాలేదు. మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్జున్ 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ శుబ్‌మన్ గిల్ సీజన్లో మూడో అర్థసెంచరీ సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ''ఏది ఏమైనా గుజరాత్, ముంబై మ్యాచ్‌లో అటు సోదురుడు అర్జున్ టెండూల్కర్.. ఇటు గిల్ ఇద్దరు మంచి ప్రదర్శన కనబరచడంతో సారా టెండూల్కర్‌కు ఎలాంటి బాధ లేదని.. పైగా ఈ ఇద్దరు ఎదురుపడినా ఎవరు పైచేయి సాధించకపోవడం సారాకు సంతోషం కలిగించి ఉంటుందని'' ఫ్యాన్స్ పేర్కొన్నారు. Sara Tendulkar while watching match between ShubmanGill and Arjun Tendulkar 😌#GTvsMI #GTvMI pic.twitter.com/5ptef3bVQ2 — Abhinav Jha 🇮🇳 (@abhinavj617) April 25, 2023 Arjun Tendulkar bowling to Shubman Gill 🔥 Is Sara Tendulkar is in the stands?#MIvsGT | #GTvMI | #IPL2023 pic.twitter.com/pCZrgInyKI — ₹ (@cricket_banana) April 25, 2023 Sara after Shubman Gill fifty be like.#MIvsGT #IPL2023 #GTvsMI pic.twitter.com/IB8FtF5zWi — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 25, 2023 Sachin and Sara watching Shubman Gill's fifty pic.twitter.com/Os9G1qwfiv — Sagar (@sagarcasm) April 25, 2023 చదవండి: వికెట్లు తీసేవాడేమో.. తప్పు చేశాడని బౌలింగ్ ఇవ్వకుంటే ఎలా? -
ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా?
Sachin- Anjali Love Story In telugu: తొలి చూపులోనే ప్రేమ.. ప్రణయంలో ఐదేళ్ల ప్రయాణం.. వయసులో ఐదేళ్ల వ్యత్యాసం... అతడు ఆమె కంటే చిన్నవాడు కావడం వల్లపెద్దల నుంచి నో అనే మాట వినాల్సి వస్తుందేమోనన్న భయం.. అతడు మొహమాటపడ్డాడు.. ఆమె బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది.. మనసిచ్చిన వాడితో కలిసి జీవితాంతం నడవాలన్న కలను నెరవేర్చుకునేందుకు తనే ముందుడుగు వేసింది.. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పింది.. వాళ్లు అర్థం చేసుకున్నారు.. ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.. ఆటలో రికార్డుల రారాజే అయినా.. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడే భర్త కోసం ఆమె తన కెరీర్‌ను త్యాగం చేసింది.. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. అదే ఆమె ప్రపంచం.. నిజానికి ఆమె లేకుంటే అతడు లేడు.. తను క్రికెట్ దేవుడిగా ఎదగడంలో ఆమెది కూడా కీలక పాత్రే.. అలాంటి భార్యను పొందడం తన అదృష్టం అంటాడతడు.. నిజమే.. సంపన్న కుటుంబంలో పుట్టి.. ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగి.. డాక్టర్ అయినప్పటికీ కుటుంబం కోసం బంగారం లాంటి కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ మహిళ పేరు అంజలి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సతీమణి. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ గోల్స్ సెట్ చేసిన అంజలి- సచిన్ ప్రేమకథ. తొలి చూపులోనే ప్రేమ 17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు సచిన్ టెండుల్కర్. పాకిస్తాన్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో భాగంగా అరంగేట్రం చేసిన అతడు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు.. కానీ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని జట్టుతో పాటు భారత్‌కు పయనమయ్యాడు. స్వదేశానికి చేరుకుని స్వస్థలానికి పయనమయ్యే క్రమంలో ఎయిర్‌పోర్టులో తొలిసారి అంజలిని చూశాడు. తన తల్లిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆమె డాక్టర్ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ మరోసారి కలుసుకున్నారు. స్నేహం పెరిగి.. ప్రేమగా మారింది. అప్పుడప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు సచిన్.. మరోవైపు అంజలి మెడిసిన్ చదువుతోంది.. ప్రేమలో ఉన్నా సచిన్ ఆటను, అంజలి చదువును నిర్లక్ష్యం చేయకుండా కెరీర్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. చదువులో చురుకైన అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు.. అయితే, ఎప్పుడైతే సచిన్‌ను ఇష్టపడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆటపై కూడా ఆసక్తి పెంచుకుంది.. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జర్నలిస్టు అని చెప్పు సరేనా! అంజలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకున్న సచిన్.. ఆమెను ఓ రోజు ఇంటికి ఆహ్వానించాడు. అయితే, ఇంట్లో వాళ్లందరికీ ముందే విషయం తెలిసిపోతే బాగుండదని భావించి తనను తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకోమని అంజలికి చెప్పాడు. నువ్వు ఎలా అంటే అలా! సరే అంది అంజలి. సల్వార్ కమీజ్‌లో డ్రెస్సప్ అయి సచిన్ ఇంటికి వెళ్లింది. కాబోయే అత్తామామలను పరిచయం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఫోన్ బిల్స్ కట్టలేక 1990లలో మొబైల్ ఫోన్స్ ఉనికి పెద్దగా లేదు. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే అంజలి ఎంతో విశాలమైన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అంజలి స్వయంగా చెప్పింది. 1994లో నిశ్చితార్థం.. మరుసటి ఏడాది పెళ్లి తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్ మొహమాట పడటంతో అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది. అలా సచిన్- అంజలిల నిశ్చితార్థం 1994లో న్యూజిలాండ్ టూర్లో ఉన్న సమయంలో జరిగింది. ఆ మరుసటి ఏడాది మే 24న వీరి వివాహం జరిగింది. 1997లో తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. సారా మోడల్‌గా, అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కుటుంబం కోసం త్యాగం పిడియాట్రిషియన్గా ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం పొందిన అంజలి.. భార్యగా, డాక్టర్‌గా రెండు పడవల మీద ప్రయాణం చేయలేకపోయింది. సచిన్ తన కెరీర్లో బిజీ కావడంతో పిల్లల కోసం గృహిణిగా మారిపోయింది. ఎవరినీ ఊహించుకోలేను ‘‘సచిన్ కాకుండా నా జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్నప్పుడైనా.. భార్యగా మారిన తర్వాతైనా మా బంధంలో ఎలాంటి మార్పు లేదు. తను కాకుండా నా జీవితంలో వేరే వ్యక్తిని అసలు ఊహించుకోలేను. తను ఆడే ప్రతి మ్యాచ్‌ను నేను తప్పకచూసేదాన్ని. స్టేడియానికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లోనే టీవీలో తన బ్యాటింగ్ చూసేదాన్ని. మా ఇంట్లో ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ టీవీ ఉంది. దాని పక్కనే గణేషుడి విగ్రహం కూడా! సచిన్ క్రీజులో ఉన్నంత సేపు అలా చూస్తూ ఉండిపోతా. ఆ సమయంలో కనీసం తినడానికి కూడా అక్కడి నుంచి కదలను. కనీసం నీళ్లు కూడా ముట్టను. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లకు ఆన్సర్ కూడా చేయను’’ అంటూ సచిన్‌తో పాటు తన ఆటను కూడా అంతే ప్రేమిస్తానని అంజలి ఒక సందర్భంలో చెప్పింది. అంజలి గురించి ఆసక్తికర విశేషాలు ►గుజరాతీ కుటుంబంలో జన్మించిన అంజలి ముంబైలో పెరిగింది. ►అంజలి తండ్రి ఆనంద్ మెహతా గుజరాతీ పారిశ్రామికవేత్త. ఆమె తల్లి అన్నాబెల్ బ్రిటిష్ సంతతికి చెందినవారు. అప్నాలయ పేరుతో ఎన్జీవో స్థాపించారు. ►అంజలి తాతయ్య భూస్వామి. ఆమె కుటుంబానికి బ్రీచ్‌కాండీ ఏరియాలో అత్యంత విలాసమైన రెసిడెన్షియల్ బంగ్లాలు ఉన్నాయి. ►అంజలి కజిన్లలో చాలా మంది మెక్సికన్ మూలాలు ఉన్నవారు ఉన్నారు. ►అంజలి కుటుంబానికి నెహ్రూ- గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవట. చదవండి: #HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి -
ఎట్టకేలకు నోరు విప్పిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ..
Shubman Gill Reveals His Crush Name: టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఆటతోనే కాదు చూడచక్కటి రూపంతోనూ ఆకట్టుకునే యువ క్రికెటర్ల జాబితాలో ముందుంటాడు. ఈ సొట్టబుగ్గల కుర్రాడికి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 23 ఏళ్ల ఈ హ్యాండ్సమ్ బ్యాటర్‌కు.. ఇటీవల మైదానంలోనే ఓ అమ్మాయి ప్రపోజ్ చేసింది. తన స్వీట్ ప్రపోజల్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సచిన్ టెండుల్కర్ సమక్షంలో గిల్ శతకం బాది పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ లేడీ ఫ్యాన్.. ‘శుబ్మన్తో నాకు జోడీ కలపండి’’ అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. గిల్‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి! సచిన్ తనయ.. సారాతో ఇక ఇప్పటికే సచిన్ తనయ సారా టెండుల్కర్, బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ పరగణా యువరాణి సారా అలీఖాన్‌తో కలిపి గిల్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సారాతో బ్రేకప్ అయిన తర్వాత సారా అలీఖాన్‌తో అతడు ప్రేమలో పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గిల్- సారా టెండుల్కర్ నా క్రష్ ఆమే! ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో సంభాషణలో భాగంగా శుబ్‌మన్ గిల్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. నీ క్రష్ ఎవరో చెప్పాలని కోరగా.. తొలుత సంశయించినప్పటికీ ఎట్టకేలకు నోరు విప్పాడు గిల్. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక మందన్న అంటే తనకు ఇష్టమన్నాడు. ఆమే నా సెలబ్రిటీ క్రష్ అంటూ నేషనల్ క్రష్ రష్మిక పేరు చెప్పాడు. గిల్- రష్మిక ఈ క్రమంలో గిల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘సారా’లలో ఎవరో ఒకరి పేరు చెప్తావనుకుంటే ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా! అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఆన్సర్‌కు రష్మిక ఎలా బదులిస్తూ చూడాలి అంటూ ఆట పట్టిస్తున్నారు. రష్మిక మందన నిరాశపరిచిన గిల్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో కేఎల్ రాహుల్ ఆడగా.. అతడు విఫలమైన కారణంగా గిల్ మూడో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చాడు. అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఉసూరుమనిపించాడు. మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేసిన గిల్ నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్న నాలుగో టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంది. 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేనకు.. ఆఖరి టెస్టులో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్- శ్రీలంక టెస్టు సిరీస్ ఫలితం తేలితేనే ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో పోటీ పడేది ఎవరన్న అంశంపై స్పష్టత వస్తుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై బాధ్యత మరింత పెరిగింది. చదవండి: WI vs SA: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్! Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్ దిగ్గజం -
వాలెంటైన్స్ డే ఎంత పని చేసింది.. శుభ్‌మన్, సారా రిలేషన్‌ను బయటపెట్టింది..!
టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ అడ్డంగా బుక్కయాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారాతో రిలేషన్ విషయంలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఇనాళ్లు తాను దాచిన నిజాన్ని తన వాలెంటైన్స్ డే-2023 పోస్ట్‌తో పొరపాటున బహిర్గతం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా నయా స్టార్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారాతో డేటింగ్లో ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) అయితే, ఈ విషయంపై మీడియా శుభ్‌మన్,సారాలను ఎన్ని సార్లు ప్రశ్నించినా స్పందించలేదు. ఇంతలో శుభ్‌మన్ డేటింగ్ చేస్తోంది సచిన్ కుమార్తె సారాతో కాదని, బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ప్రియ తనయ సారా అలీ ఖాన్‌తో అని ప్రచారం మొదలైంది. శుభ్‌మన్-సారా అలీ ఖాన్ రిలేషన్‌ను కనుక్కునేందుకు అభిమానులు, మీడియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి క్లారిటీ దొరకలేదు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) దీంతో శుభ్‌మన్ ఏ సారాతో రిలేషన్లో ఉన్నాడని తెలుసుకోలేక సచిన్, సైఫ్, శుభ్‌మన్, ఇరువురు సారాల అభిమానులు జట్టు పీక్కున్నారు. తాజాగా శుభ్‌మన్ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ ద్వారా అభిమానులకు ఓ విషయంపై క్లారిటీ వచ్చింది. శుభ్‌మన్ తన 2023 వాలంటైన్స్ డే పోస్ట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ.. What Day Is It Again? అని కామెంట్ జోడించాడు. ఈ పోస్ట్‌లో ఫోటోనే శుభ్‌మన్, సారా టెండూల్కర్ రిలేషన్‌ను బయటపెట్టింది. ఈ ఫోటోలో శుభ్‌మన్ ఓ రెస్టరెంట్లో కాఫీ తాగుతూ కనిపించాడు. గతంలో ఇదే ప్లేస్‌లో దిగిన ఫోటోను సారా టెండూల్కర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇరువురు పోస్ట్ చేసిన ఫోటోల్లో ఓ కామన్ పాయింట్ బట్టి చూస్తే.. గతంలో శుభ్‌మన్, సారా టెండూల్కర్ ఇద్దరు ఇదే ప్లేస్‌లో కలిసి కూర్చున్న విషయం స్పష్టమవుతుంది. దీని ఆధారంగా శుభ్‌మన్-సారా టెండూల్కర్‌తోనే రిలేషన్లో ఉన్నాడన్న విషయాన్ని అభిమానులు నిర్ధారించుకున్నారు. మరోపక్క ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. శుభ్‌మన్.. సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే. అయితే వారిద్దరు ఇప్పుడు విడిపోయారని, వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక శుభ్‌మన్ సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగించాడని, ప్రస్తుతం సారా అలీ ఖాన్‌కు కూడా శుభ్‌మన్ బ్రేకప్ చెప్పాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. శుభ్‌మన్ వాలంటైన్స్ డే పోస్ట్ తర్వాత నెటిజన్లు మరో కొత్త విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. శుభ్‌మన్ ఇద్దరు సారాలతో డేటింగ్ చేసింది వాస్తవమే. అయితే గిల్ సారా టెండూల్కర్‌ను మర్చిపోలుకపోతున్నాడు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ.. అభిమానులకు.. శుభ్‌మన్ సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేశాడన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గిల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. -
గిల్, సారా టెండూల్కర్ల లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్ పడినట్లేనా?!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, భారత యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ సారా టెండూల్కర్ కానీ, శుబ్‌మన్ గిల్ కానీ స్పందించింది లేదు... తాజాగా ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందుకు కారణం గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందుకు సంకేతంగా ఉంది. దీంతో వారిద్దరి లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్ పడినట్లేనని ప్రచారం జరగుతోంది. కాగా ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చిన గిల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. అనంతరం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అంతర్జాతీయ కెరీర్లో డెబ్యూ సెంచరీ సాధించిన గిల్ వరుసగా రెండో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ ఎగురేసుకుపోయాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టేందుకే సారా టెండూల్కర్‌తో బ్రేకప్ చేసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా శుబ్‌మన్ గిల్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ''లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్'' అంటూ కొటేషన్ జోడించాడు. గతంలో జరిగినపోయిన దానికి తాను బాధ్యుడిగా కానంటూ గిల్ చేసిన పోస్టు సారాను ఉద్దేశించి పెట్టిందేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల కిందట సారా టెండూల్కర్ ఫోటోపై శుబ్‌మన్ గిల్ కామెంట్ చేయడం...శుబ్‌మన్ గిల్ ఫోటోలపై సారా పెట్టిన కామెంట్లతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్త... సోషల్ మీడియాలో గుప్పుమని వ్యాపించింది. అయితే ఈ ఇద్దరూ ఒకటిగా ఎప్పుడూ కనిపించింది లేదు. సారా టెండూల్కర్ కంటే శుబ్‌మన్ గిల్ వయసులో ఏడాది చిన్నవాడు కావడం విశేషం. అయితే ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని సచిన్ టెండూల్కర్ - అంజలి నిరూపించారు. సారా కూడా వారి దారిలో నడుస్తుందని వార్తలు వచ్చాయి. అంతలోనే ఈ ఇద్దరూ అన్‌ఫాలో అవ్వడంతో ‘బ్రేకప్’ వార్త... సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) Shubman Gill-Sara Tendulkar unfollowed each other, what happened to the breakup? #ShubmanGill #SaraTendulkar #INDvPAK pic.twitter.com/AXgIgP4k66 — @Radhaannu (@Radhaannu3) August 24, 2022 చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా... బ్రేకప్ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్! గిల్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌కు పయనం కానున్న భారత ఓపెనర్! -
శుభ్ మన్ గిల్, సారా టెండుల్కర్ ఇంకా డేటింగ్ లో ఉన్నారా ?
-
ట్రెండింగ్‌లో సచిన్ కూతురు.. అందాల సారాకు ఆ అవకాశం!
-
Sara Tendulkar: గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా.. మోసం చేసే వాళ్లు గిల్‌కు వద్దులే!
Sara Tendulkar: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయ, మోడల్ సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్లు పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో కెనడియన్- పంజాబీ రాపర్ ఏపీ థిల్లాన్ నిర్వహించిన కన్సర్ట్కు సారా హాజరయ్యారు. పంజాబీ పాట ‘బ్రౌన్ ముండే’కు తన స్నేహితురాలు, అలవియా జఫేరీతో కలిసి స్టెప్పులేశారు. కాగా సారా ఇటీవలే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత క్లాతింగ్ బ్రాండ్‌కు ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇక ప్రస్తుతం సారా గోవా టూర్లో ఉన్నారు. స్నేహితులతో కలిసి అక్కడ ఉల్లాసంగా గడుపుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు మరోసారి సారా ‘ప్రేమ’ విషయాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. ‘‘శుభ్మన్తో రిలేషన్షిప్లో ఉన్నారా.. లేదంటే బ్రేకప్ చెప్పారా’’ అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి.. ‘‘సారాలా మోసం చేసే వాళ్లు కాకుండా.. ఈసారైనా శుభ్‌మన్‌కు మంచి మనసున్న అమ్మాయి దొరకాలి’’ అంటూ ఆమెపై విషం చిమ్ముతున్నారు. కాగా టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా డేటింగ్ చేసినట్లు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే, కొన్నాళ్ల క్రితం.. ‘‘దేవతలను ప్రేమించకూడదు’’అంటూ గిల్ బ్రేకప్‌నకు సంబంధించిన కోట్ షేర్ చేయడంతో వీరి బంధానికి ఫుల్స్టాప్ పడిందంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్ చేశారు. అయితే, ఇంతవరకు వీరిద్దరూ తమ గురించి వస్తున్న రూమర్లపై స్పందించకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
Sara Tendulkar: అభిమానులను ఆశ్చర్యపరిచిన సారా.. వీడియో వైరల్
Sachin Tendulkar Daughter Sara Enters Into Modelling World Video Viral: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయ సారా టెండుల్కర్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్‌కు ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సారా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో.. నటి బనితా సంధు, తానియా ష్రాఫ్‌తో కలిసి సారా టెండుల్కర్ తళుక్కుమంది. ఈ క్రమంలో అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మోడలింగ్ కెరీర్లో విజయవంతంగా కొనసాగాలంటూ విష్ చేస్తున్నారు. కాగా సచిన్- అంజలి దంపతులకు సారా, అర్జున్ సంతానం అన్న సంగతి తెలిసిందే. అర్జున్ ఇప్పటికే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోగా.. సారా మోడల్‌గా తన ప్రయాణం ఆరంభించింది. ఇక అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్.. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా దేశవాళీ టీ20 క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా.. టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సరదాగా సంభాషించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఇద్దరూ ఈ విషయంపై మౌనం వహించడం.. ఇటీవలే గిల్ బ్రేకప్‌నకు సంబంధించి కోట్స్ షేర్ చేయడంతో రూమర్స్‌కు చెక్ పడింది. మరోవైపు.. సింగర్ కనికా కపూర్‌తో సారా నైట్డేట్కు వెళ్లడం.. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడేమో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్లు చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఏదో ఒక వార్తతో సారా పేరు నెటిజన్ల నోళ్లలో నానుతూ ఉంది. చదవండి: Ind Vs Nz 2nd Test: ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే! IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే! View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
Sara Tendulkar: నైట్ డేట్‌కు వెళ్లిన సారా.. ఫొటోలు వైరల్.. ఇంతకీ ఎవరా వ్యక్తి!
Sachin Tendulkar Daughter Sara Tendulkar Goes on Date Night Guess Who: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్డేట్లు పంచుకుంటూ ఫాలోవర్లకు చేరువగా ఉంటుంది. ముఖ్యంగా టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పోస్టులకు సారా.. స్పందించడం.. అతడు కూడా ఆమెతో సరదాగా సంభాషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే.. ఇటీవల గిల్... ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్ రాసి ఉన్న షర్టు ధరించి ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ గాసిప్ రాయుళ్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సారా చేసిన తాజా పోస్టు మరోసారి ఊహాగానాలకు తావిచ్చింది. ఓ వ్యక్తి చేయి పట్టుకున్న సారా.. డేట్ నైట్ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ క్రమంలో.. ‘‘గిల్ టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ బిజీగా ఉంటే.. సారా మాత్రం డేట్‌కి వెళ్లింది.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేసేలా సింగర్ కనికా కపూర్ సైతం ఇదే తరహా పోస్టు పంచుకున్నారు. సారాతో డేట్‌కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: David Warner: ‘అప్పు’ను గుర్తుచేసిన వార్నర్.. అదైతే కష్టం కానీ! మరి ఆర్సీబీకి ఆడతావా బ్రో! -
ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే!
Mumbai crowd chants Sachin, Sachin after Shubman Gill smashes a four: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఓ అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పుజారా ఓపెనర్‌గా వచ్చాడు. దీంతో మూడో రోజు గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మూడో రోజు ఆటలో భాగంగా కీవిస్ బౌలర్ సౌథీ వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా గిల్ బౌండరీకు తరలించాడు. దీంతో ఒక్క సారిగా స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు సచిన్ సచిన్ అంటూ గట్టిగా అరిచారు. కాగా గిల్, టెండూల్కర్ కుమార్తె సారా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌ను టార్గెట్ చేస్తూ.. అభిమానులు అలా అరిచినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇక ముంబై వాంఖడే స్టేడియం సచిన్ హోం గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్ ఆడించలేదు!ఔ pic.twitter.com/V073ZkjiC6 — Addicric (@addicric) December 5, 2021 -
Shubman Gill: ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’.. ‘బ్రేకప్ అయ్యిందా బ్రో’
Shubman Gill Instagram Post Leaves Fans Guessing About His Breakup Goes Viral: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తనకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్... 17 మ్యాచ్‌లలో 17 ఇన్నింగ్స్ ఆడి 478 పరుగులు చేశాడు. కేకేఆర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఇంతవరకు టీ20 మ్యాచ్‌లలో భారత్ తరఫున అరంగేట్రం చేయని శుభ్‌మన్ గిల్‌కు... టీ20 ప్రపంచకప్- 2021 ఆడే భారత జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. దీంతో... అతడికి బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తున్న శుభ్‌మన్ గిల్... తాజాగా పంచుకున్న ఓ ఫొటో చర్చకు దారితీసింది. సిగ్మా రూల్ నెంబర్ 1 అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఫొటోను గిల్ షేర్ చేశాడు. ఇందులో గిల్ నల్లని టీ షర్టు ధరించినట్లుగా కనిపిస్తోంది. అంతేగాక షర్టు వెనుక భాగంలో... ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్ రాసి ఉంది. దీంతో గిల్‌కు తన ప్రేయసి గుడ్‌బై చెప్పిందేమో... బ్రేకప్ అయిపోయిందా అంటూ కొంతమంది నెటిజన్లు ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. గిల్ షర్టుపై ఉన్న కోట్కు తమకు నచ్చిన భాష్యాలు చెబుతున్నారు. కాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్తో శుభ్‌మన్ గిల్ ప్రేమలో పడ్డాడనే వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్ చేస్తూ.. కాస్త స్నేహంగా ఉన్నట్లు కనిపించడంతో గాసిప్ రాయుళ్లు ఈ కథనాలు అల్లేశారు. అయితే... గిల్, సారాలు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. ఇక ఇప్పుడు శుభ్‌మన్ ఈ ఫొటో షేర్ చేయడంతో మరోసారి అతడి రిలేషన్షిప్ స్టేటస్‌కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్ మాదే' అన్న పాక్ అభిమాని.. స్టువర్ట్ బ్రాడ్ సూపర్ రిప్లై View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) -
తమ్ముడికి సారా టెండూల్కర్ అదిరిపోయే గిఫ్ట్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈరోజు(సెప్టెంబర్ 24న) 22వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ తన తమ్ముడికి అదిరిపోయే బర్త్‌డే గిప్ట్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్ననాటి అర్జున్ వీడియోనూ షేర్ చేసింది. ఆ వీడియోలో చిన్ననాటి అర్జున్‌తో పాటు పక్కన సారా అతన్ని ఆడిస్తూ కనిపించింది. '' నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. ఈరోజుతో 22వ పడిలోకి అడుగుపెడతున్నాడు.. లవ్ యూ బ్రదర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. వీడియోకు లవ్ సింబల్స్‌ను ఎమోజీ రూపంలో పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: పొలార్డ్‌కే దంకీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్ చూసుకుంటా కాగా అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో పాల్గొంటున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ కనీస మద్దతు ధర రూ. 20 లక్షలకు అర్జున్ను కొనుగోలు చేసింది. కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో ఆడడం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో అనుకున్నంత విధంగా రాణించడం లేదు. ఇప్పటికే 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై ఇండియన్స్ 4 విజయాలు.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్ 26న ఆర్సీబీతో ఆడనుంది. చదవండి: టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు.. ❤❤ pic.twitter.com/Jgvsqj7VEQ — Simran (@CowCorner9) September 24, 2021 -
జిమ్ డ్రెస్‌లో .. స్టార్స్ మనసు కొల్లగొడుతున్న సచిన్ తనయ
ఇండియన్ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయ సారా టెండూల్కర్ సైతం ఫ్యాషన్‌తో అభిమానుల మనసులు కొల్లగొడుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంటుంది. కాగా ఇటీవల సారా ఓ ఫోటో అప్లోడ్ చేయగా, అది వైరల్ అయ్యింది. అందులో ఆమె జిమ్ డ్రెస్ వేసుకోగా, వెనుక డంబుల్స్ ఉన్నాయి. ఫ్రెండ్ కొత్తగా రూపొందించిన స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈ పిక్‌ని అప్లోడ్ చేసింది. ఈ పిక్కి.. ‘నా స్నేహితురాలు డాల్జీ ఈ క్రీడ దుస్తులను క్రియేట్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇవీ ఎంతో సౌకర్యంగా ఉన్నాయ’ని క్యాప్షన్‌ని జోడించింది. సారా ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ పోస్ట్‌కి లక్షల్లో లైక్స్ వచ్చాయి. కాగా ఈ పోస్ట్‌ని బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ కూడా లైక్ చేశారు. దీంతో ఈ పిక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, భారత క్రికెటర్ శుభమన్ గిల్‌తో 23 ఏళ్ల ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్న విషయం విదితమే. కానీ ఇప్పటి వరకు ఎవరూ దీనిపై స్పందించలేదు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
సారాతో రిలేషన్.. గిల్ క్లారిటీ!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నడుస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ల కనెక్షన్ గురించి మీమ్స్ కుప్పలుగా కనిపిస్తుంటాయి. అయితే రిలేషన్‌షిప్‌పై ఇంతకాలం ఇద్దరిలో ఏ ఒక్కరు స్పందించిన సందర్భం లేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు శుభ్‌మన్ గిల్. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు గిల్. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘ఆర్ యూ సింగిల్’ అని అడిగాడు. దానికి గిల్ ‘అవును.. ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేద’ని చెబుతూ.. పుకార్లకు చెక్ పెట్టాడు. దీంతో వాళ్ల రిలేషన్ ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది. చదవండి: గిల్‌పై సారా ఫన్నీ కామెంట్ కాగా, గిల్-సారా ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. గిల్ బాగా ఆడినప్పుడల్లా సారా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏదో నడుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికితోడు ఈ జనవరిలో ఇద్దరూ ఒక పోస్టును సేమ్ క్యాప్షన్‌తో పెట్టారు. ‘ఐ స్పై’ అని కన్ను ఎమోజీని ఉంచారు. ఇది చూసి వాళ్లు డేటింగ్లో ఉన్నారంటూ ఊహించుకుని కొన్ని మీడియా హౌజ్‌లు కథనాలు రాశాయి. తాజా స్టేట్మెంట్తో ఆ పుకార్లకు చెక్ పడింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సన్నద్ధమవుతున్నాడు. -
వైరల్: ఫ్రెండ్‌తో కాఫీ షాపులో సారా టెండూల్కర్
సాక్షి, ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ముంబై వీధుల్లో సందడి చేశారు. తన స్నేహితురాలితో కలిసి ఓ కాఫీ షాపుకు వచ్చిన సారా ఫోటోలను ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ క్లిక్‌మనిపించారు. ఇందులో సారా వైట్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ క్యాజువల్ వేర్లో కనిపించారు. ఇప్పటికే సారాకు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్న సారాకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. 1995 మే 24ను అంజలి మెహతాను పెళ్లాడిన సచిన్ టెండూల్కర్.. 1997 లో టీమిండియా కెప్టెన్‌గా సహారా కప్‌ను గెలుచుకున్నాడు. దీనికి గుర్తుగా తన కుమార్తెకు సారా అని పేరు పెట్టినట్లు స్వయంగా సచిన్ ఓ సందర్భంలో చెప్పాడు. కాగా సారా టెండూల్కర్ బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమవుతోందని అప్పట్లో టాక్ వినపించింది. అయితే తండ్రి సచిన్ మాత్రం ఆ వార్తలను ఖండించారు. ప్రస్తుతానికి సారా చదవు మీదే దృష్టి పెట్టిందని, ఇప్పుడు సినిమాల ఆలోచన లేదని వివరణ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన సారా..ప్రస్తుతం లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. (మరోసారి వార్తల్లో శుభ్‌మన్, సారా టెండూల్కర్) -
మళ్లీ వార్తల్లో శుభ్‌మన్, సారా టెండూల్కర్
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ సుత్రాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో క్రీడాకారులు కూడా మైదానాలకు దూరంగా.. ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ క్వారంటైన్ టైమ్‌లో చాలా మంది క్రీడాకారులు తమలో దాగి ఉన్న కొత్త కళలను బయటికి తీసుకువస్తున్నారు. తాజాగా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా తనలోని ఫొటో ఎడిటింగ్ స్కిల్స్‌ను చూపెట్టాడు. ఓ ఫొటోలో బ్యాగ్రౌండ్ ఒకే విధంగా కనబడేలా.. ఓవైపు వర్క్ అవుట్స్ చేస్తున్నట్టు, మరోవైపు విశ్రాంతి తీసుకున్నట్టు ఎడిటింగ్ చేశారు. ఈ ఫొటోను శుభ్‌మన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు శుభ్‌మన్ ఎడిటింగ్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మాత్రం విభిన్నంగా స్పందించారు. ఆ ఎడిటింగ్ అతనే చేశారని భావిస్తున్నారా? అంటూ కామెంట్ చేశారు. దీంతో శుభ్‌మన్, సారా మధ్య ఏదో ఉందనే వార్తలు మరోసారి ప్రచారంలోకి వచ్చాయి. సారానే ఈ ఎడిటింగ్ చేసి ఉంటారని కొందరు, వీరిద్దరు డేటింగ్లో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి : ‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’) గతేడాది శుభ్‌మన్ కొత్త కారు కొన్న సందర్భంగా ఓ ఫొటో పోస్ట్ చేయగా.. సారా అతనికి కంగ్రాట్స్ చెప్పారు. దీనిపై స్పందించిన టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. శుభ్‌మన్‌ను ఆటపట్టించేలా ఓ ఫన్నీ కామెంట్ చేశారు. దీంతో అప్పటి నుంచే సారా, శుభ్మన్ల మధ్య ఏదో ఉందనే వార్తలకు ప్రచారం కల్పించినట్టయింది. View this post on Instagram One is focused while the other is chilling. Which one are you this week😉 A post shared by Ꮪhubman Gill (@shubmangill) on Apr 19, 2020 at 6:52am PDT -
వెళ్లు.. ప్రపంచాన్ని జయించు: సచిన్ భావోద్వేగం
ముంబై: కూతురు సారా గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న క్షణాన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్ తరువాత కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సచిన్.. శుక్రవారం లండన్‌లో సారా పట్టాను అందుకున్న తరుణంలో ట్విటర్లో తన అనుభూతిని పంచుకున్నాడు. ‘నిన్నమొన్ననే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు మాకు గర్వంగా ఉంది. వెళ్లు...ప్రపంచాన్ని జయించు’ అని సచిన్ ట్వీట్ చేశాడు. సారా స్నాతకోత్సవ కార్యక్రమానికి సచిన్ భార్య అంజలితో హాజరయ్యాడు. ముంబై ధీరుభాయ్ అంబాని ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యనభ్యసించిన సారా లండన్ యూనివర్సిటీ కళాశాలలో మెడిసన్ పూర్తిచేసుకుంది. It feels like just yesterday when you left home for @ucl, and now you are a Graduate. Anjali and I are so proud of you! May you go out and conquer the 🌎 Sara. pic.twitter.com/y9d8bpNzs3 — Sachin Tendulkar (@sachin_rt) 7 September 2018 -
సచిన్ కూతురి పేరిట అసభ్య పోస్టులు.. టెకీ అరెస్ట్
సాక్షి, ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. నితిన్ షిశోడే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్థానిక అంధేరీలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ టెకీ సెలట్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం, వారి కూతుళ్ల పేరిట సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేయడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలు నకిలీవని అసలు వారికి సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ సంబంధిత సంస్థలకు సచిన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నితిన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సారా పేరిట ఫేక్ ట్వీటర్ అకౌంట్ క్రియేట్ చేసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేసినట్లు సైబర్ విభాగం పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీలు, వారి కూతుళ్ల పేరిట ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి కొందరు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడతారని.. చివరికి చేసిన తప్పులకుగానూ కటకటాలపాలు కావాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. గతంలో సచిన్ ఆందోళన తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ గతంలో సచిన్ వరుస ట్వీట్లు చేశారు. తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. -
సచిన్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్
కోల్‌కతా: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్ కుమార్(32)గా గుర్తించారు. వేధింపులకు పాల్పడటమే కాకుండా సారాను కిడ్నాప్ చేస్తానని నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. సచిన్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు. తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని సచిన్ ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సచిన్ ఇంటిలోని లాండ్ నంబర్‌కు 20 సార్లు ఫోన్ చేసి సారా గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డిసెంబర్ 2న చివరిసారిగా ఫోన్ చేశాడని, డిసెంబర్ 5న బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. టెలిఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. నిందితుడి మానసికస్థితి సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడిని ముంబైకి తీసుకొచ్చి, కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, సచిన్ ఫోన్ నంబర్ అతడికెలా తెలిసింది, నిందితుడి మానసిక పరిస్థితి నిజంగానే సరిగా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సచిన్ ఆందోళన.. క్షణాల్లో ట్వీట్ వైరల్!
ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో తన కుటుంబసభ్యులకు చెందినవిగా కొన్ని ఖాతాలు క్రియేట్ చేసి వాటి నుంచి లేనిపోని విషయాలు పోస్టింగ్ కావడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ కు ఓ విజ్ఞప్తి చేశారు. తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ సచిన్ వరుస ట్వీట్లు చేశారు. కామెంట్లు, రీట్వీట్లతో ఆ ట్వీట్లు కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఆ పోస్టుల కారణంగా తప్పుగా అర్థం చేసుకుని తమ కుటుంబాన్ని గాయపరిచే అవకాశం ఉందన్నారు. గతంలో 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. I reiterate the fact that my children Arjun & Sara are not on twitter. We request @Twitter to remove all such accounts at the earliest (1/2) pic.twitter.com/lbcdU546aS — sachin tendulkar (@sachin_rt) 16 October 2017 Impersonation wrecks havoc, creates misunderstanding & traumatises us. I appeal to the platforms to take corrective measures immediately 2/2 — sachin tendulkar (@sachin_rt) 16 October 2017 -
అమీర్ చేతుల్లో ‘సారా’ ?
సాక్షి, సినిమా : కొత్త కొత్త నటులను ప్రోత్సహించటంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. లగాన్ దగ్గరి నుంచి త్వరలో రిలీజ్ కాబోతున్న సీక్రెట్ సూపర్ స్టార్(అమీర్ నిర్మాత) దాకా పరిశీలిస్తే ఈ విషయాన్ని గమనించవచ్చు. అయితే త్వరలో మరో ఫేమస్ సెలబ్రిటీ కూతురిని కూడా అమీర్ పరిచయం చేయబోతున్నాడని వినికిడి. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ బాలీవుడ్ మాగ్జైన్ ఓ కథనం కూడా ప్రచురించింది. తనకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని సారా సచిన్‌తో చెప్పగా, ఆయన అందుకు సానుకూలంగా స్పందించినట్లు దాని సారాంశం. అయితే సారా లాంఛింగ్ కు అమీర్ ఖాన్ అయితేనే కరెక్టన్న భావనలో సచిన్ ఉన్నాడంట. దీంతో ఈ మేర ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రణ్‌బీర్ కపూర్ లేదా రణ్వీర్ సింగ్‌లలో ఎవరో ఒకరిని హీరోగా పెట్టి అమీర్ నిర్మాణంలో ఆ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే సచిన్ వారసుడు అర్జున్ క్రికెట్లో రాణిస్తుండగా.. 19 ఏళ్ల సారా సినిమాల్లోకి వస్తుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. -
సచిన్ కూతురితో హీరో ఫొటో
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియా చక్కెర్లు కొడుతోంది. 19 ఏళ్ల సారా టెండూల్కర్ సాధారణంగా ఫేజ్ త్రీ సర్కిల్ లో కనిపించదు. చాలా మంది సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా ప్రచారానికి దూరంగా ఉంటుంది. అలాంటిది రణవీర్ సింగ్ తో కలిసి ఆమె ఫొటో దిగింది. గుబురు గెడ్డం, మీసాలతో ఉన్న రణవీర్ నవ్వుతూ సారాతో ఫొటో దిగాడు. సోషల్ మీడియా చక్కెర్లు కొడుతున్న ఈ ఫొటోను అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా, బాలీవుడ్ లో హీరోయిన్ గా సారా తెరంగ్రేటం చేయనుందని రెండేళ్ల క్రితం ఊహాగానాలు వచ్చాయి. షాహిద్ కపూర్ సరసన ఆమె నటించనుందని అప్పట్లో రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని సచిన్ టెండూల్కర్ ట్విటర్ ద్వారా తెలిపాడు. సారా చదువుకుంటోందని, సినిమాల్లోకి వస్తుందన్న వార్తలు నిరాధారమని పేర్కొన్నాడు. తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమాతో టెండూల్కర్ తెరగ్రేటం చేస్తుండడం విశేషం. లండన్ ను చెందిన జేమ్స్ ఇరస్కీన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 26న విడుదలకానుంది. -
మోడీయే మన భావి ప్రధాని: సారా టెండూల్కర్
సచిన్ టెండూల్కర్‌కి భారతరత్న అవార్డు ఇచ్చింది ఎవరు.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టింది ఎవరు.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. కానీ ఆయన గారాల కూతురు సారా టెండూల్కర్ మాత్రం, భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవిలో ఎవరిని చూడాలనుకుంటోందో తెలుసా.. నరేంద్ర మోడీని!! అవును.. ఇది అక్షరాలా నిజం నరేంద్రమోడీకి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, ఆయనే మన భావి ప్రధానమంత్రి అవ్వబోతున్నారని స్వయంగా సారా టెండూల్కర్ ఇటవల ట్విట్టర్లో కామెంట్ పెట్టారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం బాగానే చక్కర్లు కొడుతోంది. టెండూల్కర్ కుమార్తె కావడం, ఆమె నరేంద్రమోడీ ప్రధాని అవుతారని చెప్పడంతో చాలామంది ఆసక్తిగా ఆమె కామెంట్ల కోసం ట్విట్టర్‌ను గాలించారు. అయితే సారా టెండూల్కర్ పేరుతో చాలా ఖాతాలు ఉండటంతో ఏది సరైన ఖాతాయో పట్టుకోడానికే చాలా సమయం పడుతోంది. @Imsara_st అనేది సారా టెండూల్కర్ అసలైన ట్విట్టర్ ఖాతా. So as per the survey last night I must say @narendramodi has got a huge fan base and he is going to be our future prime minister! — Sara Tendulkar (@Imsara_st) January 26, 2014