Sachin Daughter Sara Tendulkar Enjoying Goa Vacation, Pics And Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sara Tendulkar: గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న సారా... బ్రేకప్‌ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్‌!

Published Thu, Dec 23 2021 1:16 PM | Last Updated on Thu, Dec 23 2021 2:19 PM

Sara Tendulkar Enjoy In Goa Fans Cant Keep Calm Asks Her About This - Sakshi

Sara Tendulkar: టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయ, మోడల్‌ సారా టెండుల్కర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్లు పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో కెనడియన్‌- పంజాబీ రాపర్‌ ఏపీ థిల్లాన్‌ నిర్వహించిన కన్సర్ట్‌కు సారా హాజరయ్యారు. పంజాబీ పాట ‘బ్రౌన్‌ ముండే’కు తన స్నేహితురాలు, అలవియా జఫేరీతో కలిసి స్టెప్పులేశారు. 

కాగా సారా ఇటీవలే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత క్లాతింగ్‌ బ్రాండ్‌కు ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇక ప్రస్తుతం సారా గోవా టూర్‌లో ఉన్నారు. స్నేహితులతో కలిసి అక్కడ ఉల్లాసంగా గడుపుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు మరోసారి సారా ‘ప్రేమ’ విషయాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. ‘‘శుభ్‌మన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారా.. లేదంటే బ్రేకప్‌ చెప్పారా’’ అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు.  

మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి.. ‘‘సారాలా మోసం చేసే వాళ్లు కాకుండా.. ఈసారైనా  శుభ్‌మన్‌కు మంచి మనసున్న అమ్మాయి దొరకాలి’’ అంటూ ఆమెపై విషం చిమ్ముతున్నారు. కాగా టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా డేటింగ్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే, కొన్నాళ్ల క్రితం.. ‘‘దేవతలను ప్రేమించకూడదు’’అంటూ గిల్‌ బ్రేకప్‌నకు సంబంధించిన కోట్‌ షేర్‌ చేయడంతో వీరి బంధానికి ఫుల్‌స్టాప్‌ పడిందంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్‌ చేశారు. అయితే, ఇంతవరకు వీరిద్దరూ తమ గురించి వస్తున్న రూమర్లపై స్పందించకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement