![Shubman Gill, Sara Tendulkar Spotted Together Amidst Dating Rumours - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/1/sara2.jpg.webp?itok=EO8G1WL9)
టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సచిన్ టెండుల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా నవంబర్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ప్రస్తుతం భారత జట్టు ముంబైలో ఉంది.
ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్, సారా ఇద్దరూ కలిసి ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. శుభ్‌మన్ గిల్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ వేసుకోగా.. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ సారా దర్శనమిచ్చింది. గిల్ ఎంట్రెన్స్ గేట్ నుంచి బయటకు రాగా.. సారా మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంట్రీ గేట్ వద్దే ఉండిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రేమ జంట ముంబై వీధుల్లో చక్కెర్లు కొడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీలో గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 104 పరుగులు చేస్తున్నారు.
చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం
Comments
Please login to add a commentAdd a comment