శ్రీలంక పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య బంగ్లాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
టెస్టు క్రికెట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్‌ను గిల్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్‌కు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే.
అయితే ఆల్‌ఫార్మాట్లలో టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కు అప్పగించే దిశగా భారత క్రికెట్ బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తప్పించి.. గిల్‌ను రోహిత్ శర్మ డిప్యూటీగా నియమించాలని బోర్డు యోచిస్తుందట.
ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత వైట్‌బాల్ వైస్ కెప్టెన్‌గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ గిల్‌కు అప్పగించింది.
అదేవిధంగా కెప్టెన్‌గా కూడా గిల్ ఆకట్టుకున్నాడు. అతడి సారథ్యంలోనే జింబాంబ్వేతో టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment