పల్లెకెలె వేదికగా శ్రీలంకతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం(జూలై 30) సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‍పై కన్నేసింది. మరోవైపు శ్రీలంక కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్నగిల్‌కు విశ్రాంతిని పొడగించాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో సంజూ శాంసన్ కొనసాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఆఖరి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వీరిముగ్గరి స్ధానంలో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్ తుది జట్టులో రానున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment