
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. కివీస్‌పై కూడా గెలిచి గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్‌లోని ఐసీసీ ఆకాడమీ గ్రౌండ్‌లో మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్‌తో పాటు స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌కు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ బుధవారం జరిగిన టీమ్ నెట్ ప్రాక్టీస్‌కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అస్వస్థత కారణంగా గిల్ హోటల్ రూమ్‌కే పరిమితం కాగా.. రోహిత్ శర్మ మైదానంకు వచ్చినప్పటికి ప్రాక్టీస్‌లో మాత్రం పాల్గోలేదని క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్‌ను రోహిత్ స్కిప్ చేశాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
కాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని ఓవర్ల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలో వచ్చాడు. అయినప్పటికి రోహిత్ అంత ఫిట్‌నెస్‌గా కన్పించలేదు. అయితే రోహిత్, గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండడంపై బీసీసీఐ నుంచి ఎటుంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సూపర్ ఫామ్‌లో గిల్..
కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 101 పరుగులు చేసిన గిల్.. పాకిస్తాన్‌పై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బ్యాట్‌ను ఝలిపించాడు.
ఒకవేళ వీరిద్దరూ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైతే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. రోహిత్, గిల్ కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే వారి స్ధానాల్లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment