అయ్యో శుబ్‌మన్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌! సారా రియాక్షన్‌ వైరల్‌ | ODI World Cup 2023, India Vs Sri Lanka: Sara Tendulkar Disappointed After Shubman Gill Misses Debut World Cup Century; Video Viral - Sakshi
Sakshi News home page

World cup 2023: అయ్యో శుబ్‌మన్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌! సారా రియాక్షన్‌ వైరల్‌

Published Thu, Nov 2 2023 5:04 PM | Last Updated on Thu, Nov 2 2023 6:02 PM

Sara Tendulkar In Attendance To Watch India-srilanka match - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా శ్రీలంకపై టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తృటిలో తన తొలి వరల్డ్‌కప్‌ సెంచరీని గిల్‌ మిస్‌ చేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో 92 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్‌.. 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మధుశంక బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి గిల్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. 

వాంఖడేలో సారా సందడి..
కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్‌ టెండుల్కర్‌ గారాల పట్టి, శుబ్‌మన్‌ గిల్‌ రూమర్డ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సారా టెండూల్కర్‌ వాంఖడే స్టేడియంకు వచ్చింది. గిల్‌ బౌండరీలు కొట్టిన ప్రతీసారి సారా చప్పట్లు కొడుతూ కన్పించింది. కాగా గిల్‌ సెంచరీకి చేరువలో ఔటైన వెంటనే సారా తీవ్ర నిరాశ చెందింది.

ఒక్కసారిగా సారా ముఖం వాడిపోయింది. అయితే గిల్‌ నడుచుకుంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా.. సారా చప్పట్లు కొడుతూ స్టాండింగ్‌ ఓవిషేన్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: WC 2023: ఇదేం షాట్‌ రా బాబోయ్‌.. విరాట్‌ కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement