టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ను కాదని మరి గిల్‌ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన గిల్.. తన నాయకత్వ లక్షణాలతో అందరని ఆకట్టుకున్నాడు.
జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
"యశస్వీ జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ ఎంత చెప్పుకున్న తక్కువే.
అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్‌లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్‌లో కెప్టెన్‌గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా గిల్ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.
చదవండి: టీ20 వరల్డ్‌కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా?
Comments
Please login to add a commentAdd a comment