R Sridhar
-
ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌లతో ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో శ్రీథర్ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉంది.శ్రీథర్‌కు కోచింగ్ విభాగంలో అపార అనుభవం ఉంది. అతను 2021 టీ20 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రి అండర్లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. 2008-14 వరకు అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అలాగే 2014 ఇండియా అండర్-19 వరల్డ్‌కప్ స్క్వాడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. శ్రీథర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కూడా పని చేశాడు. స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన శ్రీథర్ ఆఫ్ఘన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీథర్.. ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అండర్లో పని చేయనున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్‌లోని నోయిడా వేదిక కానుంది. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఆ జట్టుకు నోయిడాను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. సెప్టెంబర్ 18 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ షార్జా వేదికగా జరుగనుంది. -
'హార్దిక్, రాహుల్ కాదు.. రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్'
టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ను కాదని మరి గిల్‌ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన గిల్.. తన నాయకత్వ లక్షణాలతో అందరని ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది."యశస్వీ జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ ఎంత చెప్పుకున్న తక్కువే. అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్‌గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా గిల్ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్‌కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా? -
Ind Vs Aus: పూర్తిగా అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! నా వల్ల కాదు!
India vs Australia- Test Series- Jasprit Bumrah: 2018- 19.. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. తొలి టెస్టులో టీమిండియా విజయం.. రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపు.. మూడో మ్యాచ్‌లో కోహ్లి సేన ఘన విజయం.. ఇంకొక్క అడుగు పడితే.. ట్రోఫీ గెలిచే అవకాశం.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 9 వికెట్లతో చెలరేగి కంగారూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాపై భారీ అంచనాలు. సిడ్నీలోనూ సత్తా చాటుతాడని అభిమానుల ఆశలు.. అయితే, పిచ్ మాత్రం పేసర్లకు మరీ అంత అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా కంగారు పడ్డాడు. వెంటనే బౌలింగ్ కోచ్ దగ్గరికి వెళ్లి కాస్త మొహమాటపడుతూనే తన మనసులో మాట బయటపెట్టాడు. అలసిపోయాను సర్.. నా వల్ల కాదు ‘‘సర్.. వికెట్ అనుకున్న విధంగా లేదు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు చేయగలిగిందేమీ లేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నా శరీరం పూర్తిగా అలసిపోయింది. మానసికంగానూ బలహీనం అయిపోయాను. ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ. పిచ్ మరీ డల్‌గా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నన్నేం చేయమంటారు సర్? కాస్త నెమ్మదిగా బౌలింగ్ చేయనా? నాకు ఏది సరైంది అనిపిస్తే అలాగే చేయమంటారా?’’ అని భరత్ అరుణ్‌ని అడిగాడు. ఎవరేం చెప్పినా ఓపికగా వినే భరత్ అరుణ్.. బుమ్రా మాటలను ఆసాంతం విన్నాడు. అయితే, తనేం చెప్పదలచుకున్నాడో పూర్తిగా అర్థమయ్యాక.. బుమ్రాను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. తనదైన వ్యూహాలతో స్వేచ్ఛగా బౌలింగ్ చేసేందుకు సమ్మతించాడు. స్పిన్నర్ల విజృంభణ బుమ్రా అన్నట్లుగానే సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిపోయింది. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. పేసర్ షమీకి రెండు, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కగా.. బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్‌కు 4 వికెట్లు దక్కాయి. టీమిండియా మాజీ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్ ఈ మేరకు బుమ్రా- భరత్ మధ్య జరిగిన సంభాషణ గురించి తన పుస్తకం.. ‘‘కోచింగ్ బియాండ్’లో ప్రస్తావించాడు. ముందు మ్యాచ్‌లో అత్యద్భుతంగా ఆడిన బుమ్రా.. మరుసటి మ్యాచ్‌లో ఎలాంటి మానసిక ఆందోళనకు గురయ్యాడో వివరించాడు. సత్తా చాటిన బుమ్రా.. ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో.. కాగా నాటి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తంగా 21 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నుంచి జట్టుకు దూరమైన భారత పేసు గుర్రం బుమ్రా ఇంతవరకు పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులోకి రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఓ మ్యాచ్ ఆడినప్పటికీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో మరోసారి దూరమయ్యాడు. స్వదేశంలో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు సైతం బుమ్రా దూరం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్‌లో) ఘనత సాధించాడు. చదవండి: Women T20 WC: 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు 'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్ -
Virat vs Rohit: రోహిత్, విరాట్ మధ్య గొడవలు నిజమే.. చక్కదిద్దింది అతడే!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుత భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే.. విరాట్ కీలక సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక చాలా మ్యాచ్‌ల్లో వీరిద్దరూ తమ ప్రదర్శనలతో అద్భుతవిజయాలను అందించారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతంరం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అప్పటిలో ఊహాగానాలు వినిపించాయి. డ్రెసింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలగా విడిపోయారని.. రోహిత్ గ్రూప్, విరాట్ గ్రూప్ ఉన్నయాని తెగ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి, రోహిత్ మధ్య మనస్పర్థలున్న మాట నిజమేనని శ్రీధర్ సృష్టం చేశాడు. అయితే వీరిద్దరి మధ్య అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కరమైంది అని శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు. "2019 వన్డే ప్రపంచ కప్ అనంతరం కాస్త గందరగోళం నెలకొంది. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే మేము సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై ఉన్నాం. అటువంటి సమయంలో విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త మమ్మల్ని మరింత కలవరపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయని మాకు తెలిసింది. అదే విధంగా సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లి ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ప్రపంచకప్ ముగిసిన 10 రోజుల తర్వాత మేమే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే రవిశాస్త్రి కోహ్లి, రోహిత్‌ను తన గదికి పిలిచాడు. భారత క్రికెట్ ఆరోగ్యం ఉండాలంటే.. ఇద్దరి మధ్య విభేదాలను తుడిచిపెట్టేయాలని అతడు సూచించాడు. వారిద్దరి ఎంతోగానే రవి నచ్చచెప్పాడు. సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి. మీరిద్దరూ చాలా సీనియర్ క్రికెటర్లు కాబట్టి ఇటువంటి మనస్పర్థలు మీ మధ్య ఉండకూడదు అని రవి చెప్పాడు. ఇవన్నీ విడిచిపెట్టి జట్టును ముందుకు నడిపించడంలో కృషి చేయండి అని రోహిత్, విరాట్‌కు శాస్త్రి సలహా ఇచ్చినట్లు శ్రీధర్ తన తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. చదవండి: BBL 2023: చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! -
'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'
శుబ్‌మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20లో సుడిగాలి శతకంతో అలరించిన గిల్ తాను టి20ల్లో కూడా ఎంత ప్రమాదకారి అనేది చెప్పకనే చెప్పాడు. అతని ప్రదర్శనపై టీమిండియా దిగ్గజాలు సహా కోహ్లి, రోహిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రెండేళ్ల కిందట ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కోహ్లి, గిల్ల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. ''మార్చి 2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లో ఉన్నాం.నరేంద్ర మోదీ స్టేడియంలో అదే మొదటి మ్యాచ్. అదీ కాకుండా భారత్‌లో జరిగే రెండో డే నైట్ టెస్టు. అప్పటికీ మనకు ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు కాలేదు. ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం. పింక్ టెస్టు కావడంతో స్టేడియంలో సీట్లకు పింక్ కలర్ వేశారు. కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందికి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. ఒక చైర్‌కు పింక్ కలర్ వేసి మరో చైర్‌ను నార్మల్‌గా వదిలేశారు.ఈ విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది. పింక్ బాల్ టెస్టులో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి ఏ దిశలో వస్తుందో పసికట్టడం చాలా కష్టం. అందుకే ఫీల్డింగ్ సెషన్ సమయంలో విరాట్ కోహ్లీ, నాతో కలిసి క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సెషన్లో దాదాపు 200 క్యాచులను అందుకున్నాడు కోహ్లి. రేపు టెస్టు అనగా ప్రాక్టీస్ సెషన్స్‌లో అంత కష్టపడడం రిస్క్ అని నేను చెప్పినా వినలేదు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు శుబ్‌మన్ గిల్ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతను కూడా వచ్చి క్యాచ్ ప్రాక్టీస్‌లో పాల్గొనాలనుకున్నాడు. గిల్ అక్కడికి రాగానే విరాట్ కోహ్లీ నవ్వుతూ అతని వైపు చూసి.. ''నీకు పదేళ్లు ఇస్తా.. తమ్ముడు! ఇందులో సగం క్యాచులైనా నువ్వు పట్టుకో చూద్దాం'' అంటూ నవ్వాడు. విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచులు అలాంటివి. అప్పటికి సెషన్స్ సమయం ముగియడంతో అందరం కలిసి టీమ్ బస్సులో బయలుదేరి పది నిమిషాల్లో హోటల్‌కి చేరిపోయాం'' అంటూ రాసుకొచ్చాడు. చదవండి: తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్ అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ -
బుమ్రా నువ్వు చీట్ చేశావు.. ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటి..?
లండన్: ఆతిధ్య ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసు గుర్రం బుమ్రా, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచి, ఆతర్వాత పలు వివాదాలకు కూడా దారి తీసింది. అయితే, వారిద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందన్న విషయాన్ని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్ మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా ప్రమాదక వేగంతో బౌలింగ్ చేశాడని, దీంతో బెంబేలెత్తిపోయిన ఆండర్సన్.. బుమ్రా నువ్వు చీటింగ్ చేస్తున్నావు.. ఎప్పుడూ లేనిది ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటని ప్రశ్నించాడని, అక్కడి నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైందని అసలు విషయాన్ని రివీల్ చేశాడు. బుమ్రా కెరీర్ ఆరంభం నుంచి 80 నుంచి 85 మైళ్ల వేగంతో బౌలింగ్ చేశాడని, అయితే ఆ మ్యాచ్‌లో ఆండర్సన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బుమ్రా ఏకంగా 90 మైళ్ల వేగంతో బంతులను సంధించడంతో ఆండర్సన్ దడుసుకున్నాడని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌లో బుమ్రా భీకరమైన వేగంతో సంధించిన బంతుల ధాటికి ఆండర్సన్ పలు మార్లు గాయపడ్డాడు. ఆతర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ కూడా బుమ్రాను భౌతికంగా టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసినప్పటికీ అతని పాచిక పారలేదు. ఫలితంగా షమీ సహకారంతో బుమ్రా 9వ వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. -
ఫీల్డర్ల ఏకాగ్రతకు పరీక్ష.. వైరలవుతున్న కొత్త ఫీల్డింగ్ డ్రిల్
లండన్: టీమిండియా ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్స్‌కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్‌ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్స్ వెనుక రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి శ్రీధర్ తనకు రెండు వైపులా ఇద్దరు ప్లేయర్స్‌ను ఉంచాడు. How is that for a drill? Fielding coach @coach_rsridhar keeping the boys on their toes. #TeamIndia #ENGvIND @RishabhPant17 • @Wriddhipops • @prasidh43 • @Hanumavihari pic.twitter.com/LjER4lgFV0 — BCCI (@BCCI) August 10, 2021 బౌలర్ బౌలింగ్ చేస్తుండగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ అటు నుంచి ఇటు బంతిని విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో ఈ బాల్ వల్ల పంత్ తన ఏకాగ్రత కోల్పోకుండా బౌలర్ విసిరిన బంతిని పట్టుకోవాలి. ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది అంటూ బీసీసీఐ ట్విటర్లో సంబంధిత వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఐడియా అదుర్స్ అంటున్నారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా లార్డ్స్ మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తోంది. ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు చమటోడుస్తున్నారు. -
గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే
ముంబై: గబ్బాలో టీమిండియా 32 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. పింక్ బాల్ టెస్ట్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. 40 రోజుల వ్యవధిలో.. అదే ఆస్ట్రేలియాను బ్రిస్బెన్ టెస్ట్‌లో మట్టి కరిపించింది. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికి చారిత్రాత్మక విజయం సాధించిన బ్రిస్బేన్ టెస్ట్‌కు ప్రత్యేకతలేన్నో. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ లీవ్‌లో ఉన్నాడు.. ఇక సీనియర్ ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే ఆధ్వర్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గబ్బా వేదికగా చరిత్రని తిరగరాసింది. పింక్ బాల్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో గబ్బా విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తన యూట్యూబ్ చానెల్లో రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ప్రసంగం అడిలైడ్‌లో ఎదుర్కొన్న ఓటమి నుంచి టీమిండియా అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పిందో వెల్లడించారు. (చదవండి: క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!) ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘36 ఆలౌట్ తరువాత ఏం జరిగిందో మీకు తెలియదు. అప్పుడు రవి (శాస్త్రి) భాయ్ జట్టు సభ్యులను పిలిచి ఇలా అన్నాడు.. ‘‘ఈ 36 ను మీ స్లీవ్స్‌లో బ్యాడ్జ్ లాగా ధరించండి.. ఆ ఓటమి మీలో కసి పెంచుతుంది. మీ ఆట తీరు మారుతుంది. ఇక చూడండి మీరు గొప్ప జట్టు అవుతారు’’ అన్నాడు. 40 రోజుల వ్యవధిలో రవిశాస్త్రి మాటలు నిజం అయ్యాయి. అలాగే, అడిలైడ్ టెస్ట్ అనంతరం రెండు రోజుల వ్యవధిలో మేము ఐదు సార్లు సమావేశం అయ్యాం. విరాట్ (కోహ్లీ), జింక్స్ (అజింక్య రహానె), కోచింగ్ సిబ్బంది కాంబినేషన్స్ గురించి చర్చించారు. విరాట్ కొన్ని అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. వాటన్నింటి ఫలితమే ఈ విజయం’’ అన్నారు శ్రీధర్. (నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్) -
ప్రతీసారి కెప్టెన్ ఆదేశాలు ఇవ్వడం కుదరదు
ఆక్లాండ్: భారత ఫీల్డింగ్ ఇటీవల నాసిరకంగా ఉందనేది వాస్తవం. సరిగ్గా చెప్పాలంటే ప్రపంచకప్ వరకు లేదా అంతకుముందు రెండేళ్ల నుంచి మేం నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాం. దీనిని మెరుగుపర్చేందుకు మేం కచ్చితంగాగా దృష్టి పెట్టాల్సి ఉంది. నిజానికి వరుస మ్యాచ్‌ల కారణంగా మాకు ఫీల్డింగ్ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యే అవకాశమే రావడం లేదు. ఒక ఆటగాడు క్యాచ్ వదిలేశాడంటే దానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా టి20ల్లో మైదానంలో ప్రతీ ఆటగాడు తనను తాను కెప్టెన్‌గా భావిస్తూనే ఫీల్డింగ్ చేయాలి. ఈ విషయం వారికి కూడా చెప్పాం. బంతి గమనం, గాలివాటం వంటివి అంచనా వేసి సరైన స్థానంలో నిలబడి బంతిని అందుకునేందుకు సిద్ధం కావాలి. ప్రతీ సారి కెప్టెన్ ఆదేశాలివ్వడం కుదరదు. – ఆర్. శ్రీధర్, భారత్ ఫీల్డింగ్ కోచ్ -
‘ఈ దశాబ్దంలో అతడే బెస్ట్ ఫీల్డర్’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్లో సైతం వరుస విజయాలు సాధించడం వెనుక ఫీల్డింగ్ కూడా ఎంతో ప్రాముఖ్యత పోషిస్తుంది. అటు బ్యాటింగ్ విభాగం, ఇటు బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా మారినా ఇక్కడ ఫీల్డింగ్‌ను ఎంతమాత్రం తక్కువ చేయలేం. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్ తనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తూ ఫీల్డింగ్ విభాగాన్ని పట్టిషంగా చేసేడనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోనే ఇటీవల సహాయక కోచింగ్ స్టాఫ్‌ల్లో శ్రీధర్ నియమాన్ని మరోసారి పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా, తాజాగా భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరనే దానిపై శ్రీధర్ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డర్ అంటూ కితాబిచ్చాడు. గత పదేళ్లుగా టీమిండియా ఫీల్డింగ్ విభాగాన్ని చూస్తే జడ్డూనే టాప్‌లో నిలుస్తాడన్నాడు. ‘ టీమిండియా అవకాశాల్ని జడేజా చక్కగా అందిపుచ్చుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. ఫీల్డింగ్‌లో అతను చురుగ్గా ఉంటూ అసాధారణ క్యాచ్‌లను అందుకుంటున్నాడు. పదేళ్ల కాలంలో జడ్డూనే బెస్ట్ ఫీల్డర్. భారత్‌కు దొరికిన అత్యుత్తమ ఫీల్డర్ జడేజా’ అని ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. -
‘అందుకే రోడ్స్‌ను ఫైనల్ లిస్ట్‌లో చేర్చలేదు’
ముంబై: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌నే తిరిగి ఎంపిక చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్ కమిటీ మొగ్గుచూపింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండదండలతోనే శ్రీధర్‌ను మళ్లీ నియమించారనేది కాదనలేని వాస్తవం. అయితే రోడ్స్‌ను కనీసం ఫైనలిస్టులో చేర్చకపోవడమే చర్చనీయాంశంగా మారింది. దీనిపై చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ‘ఫీల్డింగ్ కోచ్ ఫైనలిస్టులో శ్రీధర్‌తో పాటు, అభయ్ శర్మ, టి దిలీప్‌లతోనే సరిపెట్టాం. వీరిద్దరికీ భారత్-ఏ జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ)లో కూడా సేవలందించారు. దాంతో రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు’ అని ఎంఎస్కే తెలిపాడు. అయితే శ్రీధర్‌నే తిరిగి నియమించడాన్ని ఎంఎస్కే సమర్ధించుకున్నాడు.‘ ఆర్ శ్రీధర్ ఒక అత్యుత్తమ ఫీల్డింగ్ కోచ్. అందులో సందేహం లేదు. టీమిండియా ఫీల్డింగ్ మెరుగు పడటంలో శ్రీధర్ పాత్ర చాలానే ఉంది. దాంతో మాకు వేరే ఆలోచన లేకుండా శ్రీధర్‌నే ఎంపిక చేశాం’ అని చెప్పుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: సంజయ్ బంగర్‌పై వేటు) -
ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్?
హైదరాబాద్ : క్రికెట్లో ఫీల్డింగ్‌కు పర్యాయ పదంగా చెప్పుకునే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం రోడ్స్ దరఖాస్తు చేసుకోవడంతో అతడి ఎంపిక దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే ఇటీవలే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరల నియామకమైన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో రవిశాస్త్రి వెనక్కి తగ్గటం లేదని, తనకు నచ్చిన వారినే నియమించుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతమున్న సిబ్బందే కొనసాగుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సపోర్టింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేసేందుకు గురువారం భేటీ కానుంది. ఆదే రోజున సహాయక సిబ్బంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్ శ్రీధర్ కోచింగ్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ మరింత బలపడిందని, ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగుపడిందని రవిశాస్త్రి వాదిస్తున్నాడు. దీంతో శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే దిగ్గజ ఫీల్డర్‌గా కీర్తింపబడే జాంటీ రోడ్స్‌కు నిరాశ ఎదురవక తప్పదు. భారత్‌పై తనకున్న ప్రేమ, గౌరవాన్ని అనేకమార్లు చాటిన రోడ్స్.. ఫీల్డింగ్ కోచ్‌గా టీమిండియాకు సేవలందించాలని తెగ ఆరాటపడ్డాడు. అయితే ఆశ్చర్యకరంగా రోడ్స్‌ను పక్కకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇక దాదాపుగా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బౌలింగ్‌లో ఎలాంటి సమస్యలు లేనందున భరత్ అరుణ్ వైపే కమిటీ మొగ్గు చూపుతోంది. అయితే బ్యాటింగ్ కోచ్‌ను తప్పకుంగా మార్చాలనే ఆలోచనలో బీసీసీఐతో పాటు ప్రసాద్ కమిటీ ఉన్నట్లు సమాచారం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంతోపాటు, మిడిలార్డర్ సమస్యను పరిష్కరించలేకపోయిన ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, విక్రమ్ రాథోర్లు రేసులో ముందున్నారు. చదవండి: ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే! ఫీల్డింగ్ కోచ్ బరిలో జాంటీ రోడ్స్ -
పంత్ మరింత వేగంగా కదులు..!
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్‌పై ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఔట్‌ఫీల్డ్‌లో పంత్ మరింత వేగంగా కదలాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతని ఫీల్డింగ్ లోపాలు బయటపడ్డాయని అన్నాడు. ఔట్‌పీల్డ్‌లో అతనికున్న వేగం సరిపోదని మరింత రాటుదేలాలని అన్నాడు. బంగ్లాతో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఫీల్డింగ్‌లో పంత్ మరింత శ్రమించాల్సి ఉంది. ముఖ్యంగా ఔట్‌ఫీల్డ్‌లో వేగంగా కదలడం.. మరీ ముఖ్యంగా బంతిని త్రో చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పంత్‌ను తగిన పొజిషన్లో ఫీల్డింగ్ చేయించాలని కెప్టెన్ కోహ్లి, ఎంస్ ధోని ఆసక్తితో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతను 5 పరుగుల వరకు సేవ్ చేశాడు. ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే, టీమ్ అంచనాలకు తగ్గట్టుగా అతను ఫీల్డింగ్‌లో మెళకువలు నేర్చుకోవాలి.’అన్నాడు. (చదవండి : ‘పంత్‌ను అందుకే అలా పిలుస్తా’) ఇక బంగ్లాతో మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్ ఔట్‌ఫీల్డ్‌లో పంత్ కంటే బెటర్‌గా ఫీల్డింగ్ చేయగలడని అన్నాడు. ఎవరికి వారు తమ స్థానాల్లో మెరుగ్గా ఫీల్డింగ్ చేస్తే.. ఆయా చోట్ల వారినే కంటిన్యూ చేయడం జట్టుకు మేలు చేస్తుందని అన్నాడు. క్రికెట్ మైదానాలన్నీ ఒకే రీతిలో ఉండవనీ, టెక్నిక్‌తో ఫీల్డింగ్ చేసినప్పుడే అంచనాలు అందుకోగలమని చెప్పాడు. ఇక మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులతో విజయం సాధించిన టీమిండియా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : దినేశ్ కార్తీక్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..) -
అమ్మో..అశ్విన్ అన్నీ గుర్తుపెట్టుకుంటాడు.!
-
అమ్మో.. అశ్విన్ అన్నీ గుర్తుపెట్టుకుంటాడు.!
నాగ్‌పూర్: భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తనకు ఏనుగంత జ్ఞాపకశక్తి ఉందని నిరూపించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టి ప్రపంచరికార్డు నెలకొల్పిన అశ్విన్‌ను మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ‘నీ 100వ, 200వ, 300వ వికెట్ బాధితులెవరని ప్రశ్నిస్తూ’.. అశ్విన్ జ్ఞాపకశక్తిని పరీక్షించాడు. దీనికి అశ్విన్ ముంబైలో100వ వికెట్ డారెన్ సామీ, కాన్పూర్‌లో 200వ వికెట్ కన్నే విలియమ్సన్, నాగ్‌పూర్‌లో 300వ వికెట్ గామెజ్ అని టకాటకా సమాధానం ఇచ్చాడు. ఇక భవిష్యత్తుపై ప్రశ్నించగా ‘నేను ఇప్పటికి 50 టెస్టులు మాత్రమే ఆడాను. ఇప్పుడు సాధించిన వికెట్ల సంఖ్యను భవిష్యత్తులో రెట్టింపు చేస్తాననే నమ్మకం ఉంది’...అని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు. డేవిడ్ వార్నర్‌ను పలుమార్లు అవుట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా క్యారమ్ బంతులు వేయడంలేదు. అందుకే ఆ బంతి వేసి ఈ మైలు రాయి అందుకున్నాని తెలిపాడు. గత కొంత కాలంగా దొరికిన విశ్రాంతి కలిసొచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. .@coach_rsridhar quizzes Milestone man @ashwinravi99. Watch the full interview on https://t.co/uKFHYe2Bag #Ash300 pic.twitter.com/yIvRpGrBGD — BCCI (@BCCI) 27 November 2017 అశ్విన్ ప్రధాన వికెట్ బాధితులు తొలి వికెట్ : డారెన్ బ్రావో (వెస్టిండీస్) 50వ వికెట్ : నిక్ కాంప్టన్( ఇంగ్లండ్) 100వ వికెట్ : డారెన్ సామీ( వెస్టిండీస్) 150వ వికెట్ : ఇమ్రాన్తాహీర్(వెస్టిండీస్) 200వ వికెట్ : కన్నె విలియమ్సన్( న్యూజిలాండ్) 250వ వికెట్ : ముష్పికర్ రహీమ్( బంగ్లాదేశ్) 300వ వికెట్ : గామెజ్ (శ్రీలంక) -
'మన క్రికెట్ జట్టు ఫీల్డింగ్ భేష్'
న్యూఢిల్లీ:ప్రపంచ క్రికెట్ లో భారత జట్టు ఫీల్డింగ్ అత్యుత్తమం అనడంలో ఎటువంటి సందేహం లేదని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లి అండ్ గ్యాంగ్ ఫీల్డింగ్ విషయంలో మరింత రాటుదేలిందన్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ కల్గిన జట్లలో భారత్ కూడా చోటు సంపాదించిందన్నాడు. 'మన జట్టు ఆటగాళ్లు గ్రౌండ్ లో చాలా చురుగ్గా కదులుతున్నారు. ఇందులో మనం చాలా బెస్ట్ గా ఉన్నాం. మన ఫీల్డింగ్ మెరుగుకావడానికి ఐపీఎల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ పదే పదే ఆటగాళ్లను మారుస్తూ ఫీల్డింగ్ చేయడంతో అది జాతీయ జట్టుకు ఉపయోగపడుతుంది. ఇక ఎనిమిది ఓవర్ల గేమ్ లో ఒక చిన్నపొరపాటు మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. భారత బౌలర్ల ఫీల్డింగ్ స్కిల్క్స్ గతంలో చాలా పేలవంగా ఉండేవి. ఇప్పుడు వాటిని అధిగమించేందుకు బౌలర్లు చాలా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం భారత బౌలర్ల ఫిట్ నెస్ లెవల్స్ చాలా మెరుగ్గా ఉంది. దాంతోనే ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ తో దూసుకుపోతున్నాం'అని శ్రీధర్ పేర్కొన్నారు. -
భయపడే ప్రసక్తే లేదు: ఫీల్డింగ్ కోచ్
పల్లెకెలె: శ్రీలంకతో రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు చేయడం వల్లే భారత జట్టు మిడిల్ ఆర్డర్ కుప్పుకూలిందనే వాదనను ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తో్సిపుచ్చాడు. కొన్ని సందర్బాల్లో తడబాటు అనేది సహజంగానే జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలన్నాడు. అంతేకానీ ఆ మ్యాచ్ లో ఏదో జరిగిందని భయపడుతూ ప్రయోగాలకు దూరంగా మాత్రం ఉండమన్నాడు. లంకేయులతో రెండో వన్డేలో ప్రయోగాలు చేయడం వల్ల కొన్ని విషయాలను నేర్చుకున్నామని ఈ సందర్భంగా శ్రీధర్ పేర్కొన్నాడు. 'ప్రతీ గేమ్ నుంచి ఏదొకటి నేర్చుకుంటూ ముందుకు సాగడంపైనే మాదృష్టి. లంకతో ఆడిన గత మ్యాచ్ లో ఒక అద్భుతమైన పాఠాన్ని అయితే మేము నేర్చుకున్నాం. ఒకవేళ ప్రయోగాలు చేయకపోతే నేర్చుకునేది ఏముంటుంది. ఆ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ ను మార్చడం అనేది తప్పిదం కాదు. ధనుంజయ అసాధారణ రీతిలో బౌలింగ్ చేసి మమ్మల్ని కష్టాల్లోకి నెట్టాడు. దానిపై పూర్తి కసరత్తు చేసి తరువాత మ్యాచ్ కు వెళతాం. మరొకసారి ఆ తరహా ఉదాసీనతకు తావివ్వకుండా ఆడతాం. అంతేకానీ ప్రయోగాలు విషయంలో వెనుకడుగు వేయం. వన్డేల్లో ప్రయోగాలను కొనసాగిస్తాం. ఇక్కడ ప్రయోగాలు చేయకపోతే ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా వస్తుంది. వచ్చే 18 నెలల్లో ప్రయోగాలను చేస్తునే వరల్డ్ కప్ కు సన్నద్ధం కావడం మా గేమ్ ప్లాన్ లో భాగం 'అని శ్రీధర్ తెలిపాడు.