రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుత భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే.. విరాట్ కీలక సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక చాలా మ్యాచ్‌ల్లో వీరిద్దరూ తమ ప్రదర్శనలతో అద్భుతవిజయాలను అందించారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతంరం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అప్పటిలో ఊహాగానాలు వినిపించాయి.
డ్రెసింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలగా విడిపోయారని.. రోహిత్ గ్రూప్, విరాట్ గ్రూప్ ఉన్నయాని తెగ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి, రోహిత్ మధ్య మనస్పర్థలున్న మాట నిజమేనని శ్రీధర్ సృష్టం చేశాడు. అయితే వీరిద్దరి మధ్య అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కరమైంది అని శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు.
"2019 వన్డే ప్రపంచ కప్ అనంతరం కాస్త గందరగోళం నెలకొంది. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే మేము సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై ఉన్నాం. అటువంటి సమయంలో విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త మమ్మల్ని మరింత కలవరపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయని మాకు తెలిసింది.
అదే విధంగా సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లి ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ప్రపంచకప్ ముగిసిన 10 రోజుల తర్వాత మేమే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే రవిశాస్త్రి కోహ్లి, రోహిత్‌ను తన గదికి పిలిచాడు. భారత క్రికెట్ ఆరోగ్యం ఉండాలంటే.. ఇద్దరి మధ్య విభేదాలను తుడిచిపెట్టేయాలని అతడు సూచించాడు. వారిద్దరి ఎంతోగానే రవి నచ్చచెప్పాడు.
సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి. మీరిద్దరూ చాలా సీనియర్ క్రికెటర్లు కాబట్టి ఇటువంటి మనస్పర్థలు మీ మధ్య ఉండకూడదు అని రవి చెప్పాడు. ఇవన్నీ విడిచిపెట్టి జట్టును ముందుకు నడిపించడంలో కృషి చేయండి అని రోహిత్, విరాట్‌కు శాస్త్రి సలహా ఇచ్చినట్లు శ్రీధర్ తన తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు.
చదవండి: BBL 2023: చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
Comments
Please login to add a commentAdd a comment