IND vs SL: శ్రీలంక‌తో మూడో టీ20.. గిల్ వ‌చ్చేశాడు! ఆ న‌లుగురికి రెస్ట్‌ | India vs sri lanka 3rd t20, Playing 11 | Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రీలంక‌తో మూడో టీ20.. గిల్ వ‌చ్చేశాడు! ఆ న‌లుగురికి రెస్ట్‌

Jul 30 2024 8:12 PM | Updated on Jul 30 2024 8:30 PM

India vs sri lanka 3rd t20, Playing 11

ప‌ల్లెకెలె వేదిక‌గా మూడో టీ20లో భార‌త్‌-శ్రీలంక జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖ‌రి టీ20కు భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ ఏకంగా నలుగురు ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌మ‌య్యారు. 

వారి స్ధానాల్లో శివమ్ దూబే, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ఖాలీల్ ఆహ్మ‌ద్‌, శుబ్‌మ‌న్ గిల్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. మ‌రోవైపు శ్రీలంక కూడా త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. షనక స్థానంలో ఆల్‌రౌండ‌ర్‌ విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. ఇక ఇప్ప‌టికే సిరీస్‌ను 2-0 తేడాతో భార‌త్ సొంతం చేసుకుంది.

తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీప‌ర్‌), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్‌), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో

Advertisement
 
Advertisement
Advertisement