RR VS RCB: రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం | IPL 2025: RR VS RCB Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

RR VS RCB: రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

Published Sun, Apr 13 2025 3:13 PM | Last Updated on Sun, Apr 13 2025 6:54 PM

IPL 2025: RR VS RCB Live Updates And Highlights

Photo Courtesy: BCCI

రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ​స్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌ 9, నితీశ్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్‌ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్‌లో 100 హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. 

పడిక్కల్‌ (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్‌ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
8.4వ ఓవర్‌- 92 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. కుమార్‌ కార్తికేయ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫిలిప్‌ సాల్ట్‌ (65) ఔటయ్యాడు. 

28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన సాల్ట్‌ 
174 పరుగుల ఛేదనలో సాల్ట్‌ 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్‌కు (59) జతగా మరో ఎండ్‌లో కోహ్లి 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 82/0గా ఉంది. 

టార్గెట్‌ 174.. ధాటిగా ఆడుతున్న కోహ్లి, సాల్ట్‌
174 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులుగా ఉంది. విరాట్‌ 16, సాల్ట్‌  34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

రాణించిన జైస్వాల్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన రాయల్స్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ​స్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌ 9, నితీశ్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీశారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌.. జైస్వాల్‌ ఔట్‌
15.6వ ఓవర్‌- 126 పరుగుల వద్ద రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ (75) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జురెల్‌కు జతగా హెట్‌మైర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌
13.2వ ఓవర్‌- 105 పరుగుల వద్ద రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పరాగ్‌ (30) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ 57, ధృవ్‌ జురెల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌
6.5వ ఓవర్‌- 49 పరుగుల వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (15) స్టంపౌటయ్యాడు. శాంసన్‌ అప్పటికే పరుగులు చేసేందుక ఇబ్బంది పడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత రాయల్స్‌ స్కోర్‌ 50/1గా ఉంది. జైస్వాల్‌ 32, రియాన్‌ పరాగ్‌ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. 

5 ఓవర్ల తర్వాత రాయల్స్‌ స్కోర్‌ 36/0
రాయల్స్‌ ఇన్నింగ్స్‌ నిదానంగా సాగుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 36/0గా ఉంది. యశస్వి జైస్వాల్‌ 29, సంజూ శాంసన్‌ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

3 ఓవర్ల తర్వాత రాయల్స్‌ స్కోర్‌ 19/0
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌ నిదానంగా ఆడుతుంది. 3 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 19/0గా ఉంది. జైస్వాల్‌ 13, సంజూ శాంసన్‌ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 13) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ తలపడుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దించుతుండగా.. రాయల్స్‌ ఓ మార్పు చేసింది. 

ఫజల్‌ హక్‌ ఫారూకీ స్థానంలో వనిందు హసరంగ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్‌ కలర్‌ జెర్సీతో బరిలోకి దిగింది. చెట్లు నాటే విషయంలో అవగాహన నిమిత్తం ఆర్సీబీ గత కొన్ని  సీజన్లుగా ఓ మ్యాచ్‌లో గ్రీన్‌ జెర్సీతో బరిలోకి దిగుతుంది.

తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, ఫజల్‌హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement