మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది.
ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది.
పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది.
‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారా
సాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్‌లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment