PCOS
-
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
స్టార్ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కోలీవుడ్ భామ శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్ కూతురనే బ్రాండ్ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే శృతిహాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది భామ. మొదటి పీరియడ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్షీట్స్తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ.. పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువనిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ( పీసీఒఎస్) వ్యాధి కారణంగా స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది. -
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి. -
PCOD And PCOS రెండూ ఒకటేనా? ట్రీట్మెంట్
-
ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ!
రెగ్యులర్ పీరియడ్స్ మంచి ఆరోగ్యానికి సంకేతమని తెలుసా? అవును.. హార్మోన్ల సమతౌల్యం, అసమతౌల్యం, సంతానోత్పత్తికి, మానసిక ఆరోగ్య స్థితికి కూడా ఇది ముందస్తు సూచనగా వ్యవహరిస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రానివారిలో పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య తలెత్తుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా యుక్తవయసు బాలికల్లో, మహిళల్లో సాధారణంగా కనిపించే రుగ్మత. బెంగళూరులోని లా ఫెమ్ హాస్పిటల్ డైరెక్టర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రాజ్‌పాల్ సింగ్ ఏం చెబుతున్నారంటే.. పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లక్షణాలు మెటబాలిక్ సిండ్రోమ్‌లో పీసీఓఎస్ ఒక భాగం. ఇది ఇన్సులిన్ విడుదలను నిరోధించడం, మేల్ ఆండ్రొజెన్ హార్మోన్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మరీ అంతప్రమాదమా అంటే ప్రమాదమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడేవారిలో రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడం, జుట్టు రాలడం, సంతాన సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం.. వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, డిప్రెషన్, అధిక రక్తపోటు ఉండేవారిలో సాధారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. మన దేశంలో సగటున 20 నుంచి 30 శాతం మంది మహిళలు పిల్లల్నికనే వయసులో పీసీఓఎస్ బారిన పడుతున్నారు. మహిళల్లో సంతానవైఫల్యానికి ఇది కూడా ఒక కారణమే! గుండె సంబంధిత సమస్యలు రెండింతలు ఎక్కువ.. అసహజ జీవక్రియ కలిగిన మహిళల్లో హృదయసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం రెండింతలు ఎక్కువ. ఏదిఏమైనప్పటికీ పీసీఓఎస్‌పై అవగాహన కలిగి ఉండటం మాత్రం అవసరమనే చెప్పాలి. మెట్ఫార్మిన్, ఎసిఇ/ఎఆర్‌బి ఇన్హీబిటర్స్, ఆస్పిరిన్ వంటి మందులు వాడే రోగుల్లో గుండె సంబంధిత సమస్యలు ముడిపడి ఉన్నాయని డా. రాజ్‌పాల్ వెల్లడించారు. సమస్య తగ్గాలంటే.. ఈ సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడం, ఆహార భద్రతలు, శారీరక వ్యాయామం, పొగతాగడానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా గైనకాలజీ చెక్అప్లు చేయించుకోవడం.. వంటి కొద్దిపాటి మార్పులు జీవనశైలిలో భాగంగా పాటించాలి. అంతేకాకుండా గుండె, న్యూరోలాజికల్ సంబంధమైన లక్షణాలు బయటపడినప్పుడు ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టును సంప్రదించడం మరచిపోకూడదని డా. రాజ్‌పాల్ సూచించారు. చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! -
మీసం మెలేసిన మహిళ.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?
మానవ రూపురేఖలను పోల్చేటప్పుడు ఏది అసహజంగా అనిపించినా అది లోపమేనని నమ్ముతుంది లోకం. ఆడవారంటే సౌమ్యంగానే ఉండాలి, మగవారంటే బలిష్టంగానే ఉండాలి, స్వరంలో, రూపంలో ఇరువురి మధ్య వ్యత్యాసం ఉండి తీరాలి.. అనే కొన్ని బలమైన ఆలోచనలు, తీర్మానాలు.. అందుకు భిన్నమైన జీవితాలను బలిపెట్టేలానే ఉంటాయి. అలాంటి భిన్నమైన వ్యక్తే ‘హర్మాన్ కౌర్’. ఎన్నో అవమానాలకు ఎదురొడ్డి, గేలి చేసిన వారికి గుణపాఠంగా నిలిచిన సాహసం ఆమె!! బ్రిటన్‌లో నివసించే హర్మాన్ కౌర్.. గడ్డం ఉన్న అమ్మాయి. ఆమెకు 11 ఏళ్ల వయసు వచ్చేసరికి.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్యతో మగవారిలా గడ్డాలు, మీసాలు రావడం మొదలయ్యాయి. దాంతో ఆ చిన్న వయసులోనే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంది. చదువుకునే చోట, చుట్టుపక్కలా ఎన్నో అవమానాలు భరించింది. వ్యాక్సింగ్ చేయించుకున్నప్పుడల్లా నరకమే. ప్రతి ఐదురోజులకి బలంగా, దృఢంగా వెంట్రుకలు పెరిగిపోయేవి. చర్మం కోసుకుపోయేది. ముట్టుకుంటే నొప్పిపుట్టేంత బిరుసుగా మారిపోయేది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించింది. లోపాన్ని అవమానంగా భావించి జీవితాన్ని అంతం చేసుకునేకంటే దాన్నే గుర్తింపుగా మలచుకొని ధైర్యంగా బతకడం కరెక్ట్ కదా అని! అంతే.. వాక్సింగ్ చేయించడం ఆపేసి, గడ్డం పెంచడం మొదలుపెట్టింది. మీసాలు షేప్ చేసుకుని, తలకు స్టయిల్‌గా క్లాత్ చుట్టి ప్రత్యేకమైన రూపాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే గడ్డం ఉన్న అతి పిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. తన గడ్డానికి సుందరి అని పేరు కూడా పెట్టుకుంది. తన రూపాన్ని తన ఎడమ కాలిపై టాటూగా వేయించుకుంది. 2014లో ఆమె లండన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి, గడ్డంతో ఉన్న మహిళా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు, ఆమె అనేక బ్రాండ్లకు మోడల్‌గా మారింది. నేటికీ తన జీవితాన్ని పలు మాధ్యమాల సాయంతో ప్రపంచానికి తెలియజేస్తూ.. ఎన్నో మోటివేషన్ క్లాసులు ఇస్తూంటుంది. పరిష్కారం లేని సమస్యకు.. సమస్యనే పరిష్కారంగా మార్చుకోగల గుండె ధైర్యం ఎంతమందికి ఉంటుంది! అందుకే ఆమె అంటుంది.. ‘నా గడ్డానికి ఒక ప్రత్యేకతుంది. ఇదొక మహిళ గడ్డం’ అని. చదవండి: చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!! -
జుట్టంతా రాలిపోతోంది.. గైనకాలజిస్ట్‌ను కలవాలి!
‘‘బెంగళూరు నీళ్లకు కాబోలు జుట్టంతా రాలిపోతోంది..’’ తల స్నానం చేసి జుట్టుకు హెయిర్ డ్రయర్ పెడుతూ అన్నది నమ్రతా జార్జ్. ‘‘ఓసారి ట్రైకాలజిస్ట్‌ను కలవాలి’ అంది మళ్లీ తనే నమ్రత పక్కనే ఉన్న రూమ్మేట్ థెరిసాతో. ‘‘అప్పర్ లిప్ మీద హెయిర్ వస్తోంది. ముఖమంతా యాక్నే, ఒంటిమీద నల్లగా చుక్కలు కూడా వస్తున్నాయి. డెర్మటాలజిస్ట్‌ను కూడా కలవాలేమో’’ దిగులుగా తనలో తనే అనుకున్నట్లుగా అంటోంది నమ్రత. ‘‘నువ్వు కలవాల్సింది గైనకాలజిస్ట్‌ని’’ డ్రెస్ వేసుకుంటూ, హడావుడిగా టేబుల్ దగ్గరకు వెళ్లి వెజిటబుల్ సలాడ్ ఫోర్క్‌తో నోట్లో పెట్టుకుంటూ బదులిచ్చింది థెరిసా. థెరిస్సాను విచిత్రంగా చూసింది నమ్రత. ‘‘నాకు వరుసగా మూడు నెలలు పీరియడ్స్ మిస్ అయ్యాయని గైనకాలజిస్ట్‌ని కలిశాను కదా! అప్పుడు తెలిసింది ఇవన్నీ పీసీఓఎస్ లక్షణాలని. నన్నయితే బరువు తగ్గమని గట్టిగా చెప్పింది. నువ్వు కూడా ఓ సారి కలువు’’ నమత్ర వైపు చూడకుండా చెప్పుకుంటూ పోతోంది థెరిసా. నమ్రతా జార్జ్, థెరెసా బోబన్లు పదకొండేళ్లుగా స్నేహితులు. ఈ కేరళ అమ్మాయిలు ఏడేళ్లుగా రూమ్మేట్లు. ఇద్దరూ ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్‌లే. సొంతూరు కొచ్చి నుంచి గత ఏడాది బెంగుళూరుకొచ్చి ఫ్యాషన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. థెరిసా సలహాతో నమ్రత గైనకాలజిస్ట్‌ను సంప్రదించింది. నిజమే! ఆమె సమస్య కూడా పీసీఓఎస్నే. అండాశయంలో సిస్ట్లు ఏర్పడ్డాయి. నిండా పాతికేళ్లు లేవు. ఇప్పుడే గర్భాశయ సమస్యలేంటి? అసలీ పీసీఓఎస్ ఏంటి? ఇది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది? అని పరిశోధన చేసినంత పని చేశారు. తమ ఇద్దరిలోనే కాదు ఈ పీసీఓఎస్ ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది మహిళలను వేధిస్తోందనీ, మన దేశంలో ఈ దశాబ్దంలో విపరీతంగా పెరిగిపోతోందనీ తెలుసుకున్నారు. ధైర్యం చెబుతున్నారు మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియచేస్తున్నారు కేరళకు చెందిన ఇద్దరు స్నేహితులు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లికి ముందు రొటీన్ చెకప్‌లలో భాగంగా గైనకాలజిస్టుకు చూపించడానికి తల్లిదండ్రులు భయపడతారు. పెళ్లికావల్సిన అమ్మాయిని గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లినట్లు ఎవరికైనా తెలిస్తే ‘వాళ్లు ఏమనుకుంటారో’ అని ఆందోళన పడుతుంటారు తప్ప సమస్య తొలిదశలో ఉన్నప్పుడే వైద్యం చేయించాలనుకోరు. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే గర్భధారణ సమస్యలు ఎదురవుతాయని తెలిసినా సరే పెళ్లయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించవచ్చని.. సమస్యను తీవ్రతరం చేసుకుంటుంటారు. ఇంకా... పీసీఓఎస్‌కు చికిత్స చేయించుకుందని బంధువులకు, స్నేహితులకు తెలిస్తే ‘ఈ అమ్మాయికి సమస్య ఏ స్థాయిలో ఉందో ఏమిటో, పిల్లలు పుడతారో లేదో’ అనే అనుమానాలను చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తారేమోనని మరొక భయం. తేలిగ్గా వివరిస్తున్నారు ఆడపిల్లలను గైనకాలజిస్టుకు చూపించడం మీద మన సమాజంలో ఉన్న అనేక అపోహలను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు నమ్రతా జార్జ్, థెరెసా బోబన్లు. ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్‌లో పేజీ ఓపెన్ చేసి సందేహాలకు సమాధానాలిస్తున్నారు. గైనిక్ సమస్యల పట్ల యువతులను చైతన్యవంతం చేయడానికి పూనుకున్న స్నేహితుల చొరవ ఇది. డాక్టర్లు వివరించేటప్పుడు వైద్యపరమైన సాంకేతిక పదాలు సామాన్య యువతులను, మహిళల్ని భయపెడుతుంటాయి. ఈ ఫెండ్స్ మాత్రం విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యే çపదాలతో సులువుగా వివరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజీ అంతగా విజయవంతం కావడానికి ఇదీ ఒక కారణమే. ‘‘మొదట్లో కొన్నాళ్లు బెంగళూరు నీటిని తిట్టుకున్నాం. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాం’’ అని నవ్వారు ఈ ఫ్రెండ్స్. – మంజీర సమస్యే కాదు డిజిటల్ మీడియా వేదికగా మేము చేపట్టిన ఈ ఉద్యమం... మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజంలో కరడుగట్టి ఉన్న నిరాసక్తతను పటాపంచలు చేయడానికే. ‘టూ బ్రోక్ గర్ల్స్ విత్ పీసీఓఎస్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాం. అందులో పీసీఓఎస్ లక్షణాల గురించి సమగ్రంగా తెలియచేస్తున్నాం. అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని కూడా సూచిస్తున్నాం. మా పేజీని అనుసరిస్తున్న వాళ్లలో కొందరు తమలో ఉన్న కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా పీసీఓఎస్ కారణంగా దేహంలో ఎదురయ్యే అవాంఛిత రోమాల వంటి వాటి గురించి అమ్మాయిలు విపరీతంగా వ్యాకులతకు లోనవుతుంటారు. ఇది మానసిక వేదనకు లోను కావాల్సిన సమస్య కానే కాదని వాళ్లకు ధైర్యం చెబుతున్నాం. బయటకు చెప్పుకోలేని ఆవేదనను పంచుకోవడానికి, చైతన్యవంతం కావడానికి ఒక వేదిక కల్పించాం. ఇది ఆరోగ్య చైతన్య విప్లవం. – నమ్రత, థెరిసా View this post on Instagram It’s par-TEA time 🍵🍵🍵 We can’t start a day without a glass of one of our favourite brews. While researching for what dietary changes could help reverse the effect of pcos, we came across the benefit of having herbal teas to help control the condition. Some teas even have scientific evidence in helping reversing the side effects of pcos. Have a TEA-rrific day. Do share you experiences with various herbal teas that might have helped you #pcos #periodpositive #tea #women A post shared by Nams & Ter (@twobrokegirlswithpcos) on Feb 4, 2020 at 9:00pm PST -
ముందు బరువు తగ్గండి...
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అవుతోంది. ఇంకా గర్భం రాలేదు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. నా బరువు 87 కిలోలు. పీరియడ్స్ క్రమబద్ధం కావడం కోసం, గర్భం దాల్చడం కోసం కొన్ని నెలలుగా చాలామంది డాక్టర్లను సంప్రదించాను. వారు పీసీఓఎస్ ఉందని అన్నారు. ఎన్నో రకాల మందులు వాడాను. కాని ప్రయోజనం లేదు. నా విషయంలో తగిన సలహా ఇవ్వండి. - నాగమణి, వరంగల్ పీసీఓఎస్ అనేది హార్మోన్ల అసమతౌల్యత వల్ల వచ్చే కండిషన్. మహిళలల్లో దాదాపు 10 - 15 శాతం మందిలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఇది జన్యుపరంగా, వంశపారంపర్యంగా కూడా కుటుంబంలో కనిపిస్తుంటుంది. ఈ కండిషన్ ఉన్నవారిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటాయి. (అండం పెరుగుదల ఉండదు). కొన్ని మందులు వాడటం ద్వారా రుతుక్రమాన్ని సరిదిద్దవచ్చు. అయితే మందులు వాడటం మానేస్తే మళ్లీ రుతుక్రమం దెబ్బతింటుంది. చాలామందిలో ఈ పరిస్థితిని శాశ్వతంగా నయం చేయడం అంతగా కుదరకపోవచ్చు. సంతాన సాఫల్యం కలిగించే విషయంలో అండాల పెరుగుదల కోసం కొన్ని ట్యాబ్లెట్లు, హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావచ్చు. అయితే ఇలాంటి చికిత్సలకు ముందుగా మీరు బరువు తగ్గడం అవసరం. ఇప్పుడు మీ బరువులో కనీసం 10 శాతమైనా తగ్గాలి. ఇలా బరువును నియంత్రించుకొని తగిన మందులు వాడేవారిలో కనీసం 65 నుంచి 75 శాతం మంది గర్భం దాల్చుతారు. మిగతా వారిలో లాపరోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ లేదా ఐవీఎఫ్‌తో ప్రయోజనం ఉండవచ్చు. మీరు ముందుగా కనీసం తొమ్మిది కిలోల బరువు తగ్గి... ఆ తర్వాత ఫెర్టిలిటీ చికిత్స తీసుకోండి. సానుకూల ఫలితాలు కనిపించవచ్చు. నా వయసు 32 ఏళ్లు. నాకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల నేను వీర్య పరీక్ష చేయించుకుంటే అందులో శుక్రకణాలు లేవని తెలిసింది. మాకు తగిన సలహా ఇవ్వడండి. - నాగేశ్వరరావు, విశాఖపట్నం పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేని కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. దీనికి శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన శుక్రకణాలు ప్రయాణం చేసే దారిలో ఏదైనా అడ్డంకి ఉండటం కారణాలు కావచ్చు. అయితే మీలాంటి కేసుల్లో మరల మరల ఇదే పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత మీరు కొన్ని వైద్య పరీక్షలు... అంటే హార్మోనల్ అల్ట్రాసౌండ్, క్యారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కండిషన్‌కు తగిన కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. హార్మోనల్ సప్లిమెంట్స్ ద్వారా శుక్రకణాల సంఖ్య పెంచవచ్చు. అప్పటికీ సాధ్యంకాకపోతే ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) విత్ టెస్టిక్యులార్ స్పెర్మ్ యాస్పిరేషన్తో చికిత్స చేయవచ్చు. అంటే ఈ ప్రొసీజర్‌లో నేరుగా టెస్టిస్ నుంచి శుక్రకణాలు సేకరిస్తారు. అయితే అన్ని కేసుల్లో ఇలా శుక్రకణాల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అదీ సాధ్యం కాకపోయినా మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. - డాక్టర్ ప్రీతీ రెడ్డి కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ, బర్త్ రైట్ బై రెయిన్బో, బంజారాహిల్స్, హైదరాబాద్