స్టార్‌ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన భామ! | Star Heroine Shruti Haasan Reveals Shocking Desease Goes Viral | Sakshi
Sakshi News home page

Shruti Haasan: 'నాకు ఆ సమస్య ఉంది.. అయినా భరిస్తున్నా!'

Published Sun, Jun 2 2024 7:37 AM | Last Updated on Sun, Jun 2 2024 12:30 PM

Star Heroine Shruti Haasan Reveals Shocking Desease Goes Viral

కోలీవుడ్ భామ శృతిహాసన్‌ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇండియన్‌ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్‌ కూతురనే బ్రాండ్‌ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో సక్సెస్‌పుల్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్‌–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే శృతిహాసన్‌ గురించి మరో షాకింగ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్‌ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్‌ పీరియడ్స్‌ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకి‌చ్చింది భామ. మొదటి పీరియడ్‌ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్‌ పీరియడ్‌ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.

కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్‌ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్‌ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్‌షీట్స్‌తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ..  పాటల సన్నివేశాల్లో డాన్స్‌ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో  నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.

పిల్లలు పుట్టే ఛాన్స్‌ తక్కువ

నిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్‌ ఒవరీ సిండ్రోమ్‌ ( పీసీఒఎస్‌) వ్యాధి కారణంగా  స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్‌ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement