PCOS problem
-
పీసీఓఎస్ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?
ప్రస్తుత జీవన విధానంలో టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వివాహిత మహిళల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పీసీఓఎస్. దీని కారణంగా మహిళలు పడే బాధ అంత ఇంత కాదు. అయితే అందుకోసం చాలామంది పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. నిజానికి పీసీఓఎస్ సమస్య ఉంటే పాల ఉత్పత్తులు నివారించాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. నిక్షేపంగా వాటిని తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల పీసీఓఎస్ అవగాహన నెల సందర్భంగా దీని గురించి సవివరంగా తెలుసుకుందాం.!పీసీఓస్ అంటే..పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ అనేది ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత. ఇది కొందరిలో గర్బందాల్చే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో అండోత్సర్గం జరగకపోవచ్చు లేదా ఆండ్రోజెన్ల స్థాయి(పురుష హార్మోన్లు) పెరగడం లేదా అండాశయాలపై చిన్న తిత్తులు రావడం జరుగుతుంది. కొందరికి పిరియడ్స్ అసంబంధంగా(ఇర్రెగ్యులర్)గా ఉండటం, బరువు పెరగటం, ముఖంపై వెంట్రుకలు, మొటిమలు, జిడ్డుగల చర్మం తదితర సమస్యలు ఎదురవుతాయి. డైట్‌తో సంబంధం..అధిక-కార్బోహైడ్రేట్, కొవ్వు ఆహారాలు, తక్కువ-ఫైబర్ ఆహారాలు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌తో కూడిన పాశ్చాత్య ఆహారాలు పీసీఓఎస్ సమస్యను పెంచే ప్రమాద కారకాలు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వంటివి పీసీఓస్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. ఇక్కడ డైరీ ఉత్పత్తులు పీసీఓఎస్ సమస్యను పెంచుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు.డైరీ ఉత్పత్తుల్లో సంతృప్తకొవ్వులు కూడా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవాలని అన్నారు. అయితే కొందరికి లాక్టోస్ అసహనం ఉంటుంది. అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులు తీసుకుంటే అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా మొత్తం ఆరోగ్యాన్నే ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మేలని చెప్పారు. లాక్టోస్ అసహనం లేనట్లయితే చక్కగా పెరుగు, మజ్జిగ రూపంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్లు శరీరానికి అందడమే కుండా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు డైట్లో మార్పులు చేసుకునే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాలను తీసుకుని పాటించటం మంచిదని చెబుతున్నారు అమిత గాద్రే. View this post on Instagram A post shared by Oh, Cheat Day ! (@ohcheatday) (చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!) -
స్టార్ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కోలీవుడ్ భామ శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్ కూతురనే బ్రాండ్ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే శృతిహాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది భామ. మొదటి పీరియడ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్షీట్స్తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ.. పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువనిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ( పీసీఒఎస్) వ్యాధి కారణంగా స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది. -
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి. -
పిజ్జాలు, బర్గర్ల వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యా? అసలెందుకు వస్తుంది?
మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. ►తిరుపతి ఎమ్మార్పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. ► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార. ► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పీసీఓడీ ఎందుకొస్తుందంటే... ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరమవుతుంది. ఈ హార్మోన్ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఇలా ఉంటాయి నెలసరి సక్రమంగా రాదు ఎక్కువగా బ్లీడింగ్, రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. శరరీంలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. వ్యాధులు ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గర్భస్రావాలు, సంతాన లేమి మధుమేహం మానసిక జబ్బులు అసాధారణ గర్భాశయ రక్తస్రావం క్రమ రహిత రుతుక్రమం పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేసి నిర్థారిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... జీవనశైలిలోని మార్పులు కూడా పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం. ఫీజులు గుంజేస్తున్నారు.. గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. – డాక్టర్ ప్రభావతిదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు. – డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
పీసీఓఎస్‌తో నిద్రాభంగాలు ఎందుకంటే...
అండాశయాల్లో నీటితిత్తులు కనిపించే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న కొందరు మహిళల్లో రాత్రివేళల్లో నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి. అంటే... కొందరిలో రాత్రి నిద్రపట్టకపోవడం (ఇన్సామ్నియా), గురకవస్తూ... దాంతో మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం (స్లీప్ ఆప్నియా)తో నిద్రాభంగం అవుతుండటం, కాళ్లు విపరీతంగా కదిలించే ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’తో నిద్రనుంచి లేచి, ఆపై ఎంతకూ నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. పీసీఓఎస్ ఉండి, ఇలాంటి నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అండాశయాల్లో నీటితిత్తులకు హార్మోన్ల అసమతౌల్యతే ప్రధాన కారణం. అంటే కొన్ని హార్మోన్ల స్రావాల్లో హెచ్చు తగ్గులు, ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా ఉండే యాండ్రోజెన్ వంటి హార్మోన్ల మోతాదులు పెరగడం వంటి అంశాలు అసమతౌల్యతకు దారితీస్తాయి. ఈ అసమతౌల్యతే నిద్రా సమస్యలకూ కారణమవుతుంది. ఆహార అలవాట్లతో అధిగమించడం ఇలా... కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచడం వల్ల స్లీప్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. అవి... ఎక్కువగా చక్కెరలను వెలువరించే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకుంటూ... అదే సమయంలో అతి తక్కువగా చక్కెరను వెలువరించే (లో–గ్లైసీమిక్ ఇండెక్స్) ఆహారాలను తీసుకోవడం. (అంటే ఉదాహరణకు వరిలాంటి ఎక్కువ చక్కెరలను వెలువరించే ఆహారాలు కాకుండా కొర్రలు, రాగుల వంటి చిరుధాన్యాలను తీసుకోవడం, అతిగా పాలిష్ చేయనివీ, పొట్టుతో ఉండే ధాన్యాలనే తీసుకోవడం. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో పాటు కొవ్వులు తక్కువగా ఉండి, ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే చిక్కుళ్ల వంటి ఆహారాలను తీసుకోవడం. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానియాలకు దూరంగా ఉండటం. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే బాదం వంటి నట్స్, ఎండుఫలాలను ఎక్కువగా తీసుకోవడం. వేట మాంసాన్ని చాలా పరిమితంగా తీసుకుంటూ, వైట్ మీట్ (చేపలను) ఎక్కువగా తీసుకోవడంతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలితో... క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే (ధ్యానం, యోగా వంటి)టెక్నిక్స్‌తో, బరువును నియంత్రిస్తూ స్థూలకాయం రాకుండా చూసుకోవడం, రోజుకు కనీసం 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవడం వంటి చర్యలతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. దాంతో నిద్రసమస్యలతో పాటు, ఇతరత్రా అనేక సమస్యలూ నివారితమై, మహిళల ఆరోగ్యం అన్ని విధాలా మెరుగుపడుతుంది. డాక్టర్ ఎమ్ రజనీ సీనియర్ గైనకాలజిస్ట్ (చదవండి: అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు) -
PCOD And PCOS రెండూ ఒకటేనా? ట్రీట్మెంట్
-
తీవ్ర అనారోగ్యం.. సర్జరీకి సిద్ధమైన నటి
ముంబై: రియాలిటీ టీవీ స్టార్, హిందీ బిగ్‌బాస్-13 కంటెస్టెంట్ హిమాన్షీ ఖురానా గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్) సమస్య తీవ్రమైన నేపథ్యంలో త్వరలోనే సర్జరీ చేయించుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు వెల్లడించాయి. కాగా హిమాన్షీ కొన్నిరోజుల క్రితం తాను వీల్ చైర్లో కూర్చుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో అభిమానలంతా ఆమె కాలికి గాయమైందని ఆందోళన చెందారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. (చదవండి: 4 రోజుల్లో కంగన వెళ్లిపోతున్నారు: బీఎంసీ ) ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన హిమాన్షీ సన్నిహితులు.. నెలసరిలో అధిక రక్తస్రావం మూలాన ఆమె ఆరోగ్యం క్షీణించిందని, అందుకే తను వీల్‌చైర్‌ను ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘‘తను నడిచే పరిస్థితుల్లో లేదు. కానీ ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ చేయాల్సి ఉంది. దానిని రద్దు చేసే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హిమాన్షీ అలా వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ అయిపోగానే తను సర్జరీ చేయించుకుంటుంది’’ అంటూ వివరణ ఇచ్చారు. ( (చదవండి: రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ...) కాగా పీసీఓఎస్ కారణంగా బరువు అధికంగా పెరిగినందు వల్ల సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన ప్రతిసారీ తాను ట్రోలింగ్ బారిన పడ్డానని హిమాన్షీ గతంలో వెల్లడించారు. ‘‘పీసీఓస్ వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. పీసీఓస్ కారణంగా నాకు తరచుగా బీపీ డౌన్ అవుతుంది. అందుకే ప్రతీ మూడు గంటలకొకసారైనా ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తాను. అయితే అందరు స్త్రీలల్లో ఇదే తరహా అనారోగ్య సమస్యలు తలెత్తకపోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటే దీనిని అధిగమించవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. అండాశయంలో నీటితిత్తులు (పీసీఓఎస్) ప్రస్తుతం చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత అనే సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి. దీనినే పీసీఓడి (పీసీ) లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. వారసత్వంగా, జన్యువులలో ఏదైనా తేడా వచ్చినప్పుడు దీని బారిన పడవచ్చు. లేదా మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన హార్మోన్ల మీద దాని ప్రభావం చూపి పీసీఓడి సమస్య తలెత్తవచ్చు. కాగా.. ఒక్కొక్కసారి ఈ పీసీఓడీ సమస్యకు సరైనరీతిలో చికిత్స తీసుకోకపోతే, హైపోథైరాయిడిజమ్ సమస్యకు కూడా దారితీస్తుంది. అంతేకాకుండా, సంతానం కలిగిన, పుట్టబోయే పిల్లలలో జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు 1) నెలసరుల సమస్యలు 2)సంతానలేమి 3) మగవాళ్ళల్లో ఉండవలసిన ఎండ్రోజన్ హార్మోన్లు స్త్రీలలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి అవాంఛిత రోమాలు, నెలసరులు తరచుగా వస్తూండడం జరుగుతుంది. 4)బరువు అతిగా పెరగటం -
కలిసినప్పటి నుంచీ...
సందేహం నా వయసు 25. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు మూడేళ్లు, పాపకు రెండేళ్లు. రెండు సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. డెలివరీ అయిన అయిదు నెలల వరకు దూరంగా ఉండాలని, లేదంటే సమస్యలు వస్తాయని ఫ్రెండ్స్ చెప్పారు. కానీ మా ఆయన బలవంతం మీద మేము కలిశాం. ఆ తర్వాత చాలా మంటగా అనిపించింది. యోని మొదలు, చివర చీలింది. నాకు బ్లీడింగ్ ఆగిపోయింది. కలిసినప్పటి నుంచి కుట్ల దగ్గర నొప్పిగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా సమస్య కానీ, ఇన్ఫెక్షన్ కానీ వస్తాయా? ప్రెగ్నెన్సీలాగే కడుపు లావుగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎలాంటి వ్యాయామాలు చేసి ఈ కడుపును తగ్గించుకోవాలి. దయచేసి పరిష్కారం చెప్పండి? - జ్యోతి, అనంతపురం సాధారణంగా సిజేరియన్ ఆపరేషన్ అయిన మూడు నెలల తర్వాత కుట్లలో నొప్పి ఏమీ లేకుండా ఉండి, బ్లీడింగ్ కాకుండా, నీరసం లాంటి ఇబ్బంది ఏమీ లేకపోతే.. నాలుగో నెల నుంచి భార్యభర్తలు కలవచ్చు. మీరు ఏ నెలలో కలిశారో రాయలేదు. ఇప్పటికీ ఇంకా నొప్పి, దురద ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. కాన్పుల తర్వాత తొమ్మిది నెలలు బిడ్డను మొయ్యడానికి గాను పొట్ట మీద సాగిన చర్మం, కండరాలు మొత్తంగా సాధారణ స్థితికి రావు. పొట్ట కండరాలు, చర్మం వదులవడం, పొట్టలో కొవ్వుపేరుకు పోవడం వల్ల పొట్ట లావుగా కనిపిస్తుంది. దీనిని చాలావరకు తగ్గించడానికి నడక, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు వంటివి పాటించవలసి ఉంటుంది. ఇవి మీరు సొంతంగా చెయ్యలేనప్పుడు ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి వారి సమక్షంలో కొన్ని రోజులపాటు అబ్డామినల్ వ్యాయామాలు నేర్చుకొని, తర్వాత వాటిని పాటిస్తే సరిపోతుంది. నా వయసు 26. నా బరువు 80. నాకు PCOD ప్రాబ్లమ్ ఉంది. నాకు పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. కానీ ఇంకా పిల్లలు లేరు. నాకు ఎనిమిది ఐయూఐ సైకిల్స్ అయ్యాయి. ఇప్పుడు డాక్టర్ నన్ను నాలుగు నెలలు ట్రీట్మెంట్ను ఆపేయమన్నారు. ఈ నాలుగు నెలలు నాకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడమని చెప్పారు. ఈ రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది సందేహంగా ఉంది. నాకు సరైన సూచనలను దయచేసి ఇవ్వగలరు. - దీపిక, కాకినాడ మీకు PCOD ప్రాబ్లమ్ ఉంది. అలాగే 80 కిలోల బరువు కూడా ఉన్నారు. బరువు ఎక్కువ ఉండి, ్కఇైఈ ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉండడం వల్ల అండం నాణ్యత సరిగా ఉండదు. దానివల్ల అది సరిగా వీర్యకణాలతో ఫలదీకరణ చెందకపోవడం లేదా గర్భాశయం పిండాన్ని అందిపుచ్చుకోకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దాంతో మీకు గర్భం నిలవడానికి ఇబ్బంది అవుతుంది. మీ డాక్టర్ సలహా మేరకు కొన్ని నెలలు చికిత్సకు వ్యవధి ఇచ్చి ఆగవచ్చు. ఈ లోపల బరువు కూడా కనీసం 5-10 కిలోల వరకు తగ్గడానికి ప్రయత్నించాలి. దీని కోసం వ్యాయామాలు, యోగా, పరిమితమైన ఆహారం వంటివి పాటించాలి.ORAL CONTRACEPTIVE PILLS వాడేటప్పుడు గర్భం రాదు. ఈ వ్యవధిలో పిల్స్ వాడటం వల్ల PCODతో ఉండే హార్మోన్ల అసమతుల్యత కొద్దిగా తగ్గి, అవి ఆపిన తర్వాత కొందరిలో గర్భం దానంతట అదే నిలిచే అవకాశాలు పెరుగుతాయి. లేదంటే మళ్లీ ఇన్ఫర్టిలిటీ చికిత్స తీసుకుంటే, త్వరగా గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. బరువు తగ్గడం వల్ల కూడా PCOD తో ఉండే హార్మోన్ల అసమతుల్యత చాలా వరకు తగ్గుతుంది. నాకు ఇప్పుడు 22 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. పిరుదుల్లో మంట, దురదలాగా వస్తోంది. ఇది వచ్చి వెళ్తూ ఉంటోంది. తగ్గింది కదా అని అనుకునేలోపే మళ్లీ వస్తోంది. వేగంగా నడిచినప్పుడు ఈ మంట, దురద బాగా తెలుస్తోంది. కానీ ఏదో ద్రవం లాంటిది కారినట్టు అనిపించి వెంటనే తగ్గిపోతుంది. ఒక్కోసారి మోషన్‌కి వెళ్లిన కొద్దిసేపటికి తెలుస్తుంది. మరోసారి ఎలాంటి సెన్సేషన్ లేకుండా మామూలుగానే వస్తుంది. మోషన్‌కి వెళ్లేటప్పుడు బ్లడ్ కానీ నొప్పి కానీ ఏమీ ఉండవు. నెల నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్కు యాంటీ బయోటిక్స్ వాడుతున్నాను. డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయంగా ఉంది. నా ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చెప్పండి. - లోహిత డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయంగా ఉందని, సొంతంగా మందులు (యాంటీ బయోటిక్స్) వాడటం మంచిది కాదు. కడుపులో నులిపురుగులు ఉన్నా దురద, తెల్లబట్ట అవడం లేదా యోనిలో ఇన్ఫెక్షన్స్, మలాశయ మార్గం నుంచి క్రిములు యోని భాగంలోకి ప్రవేశించినా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా యోని దగ్గర నుంచి తొడల మధ్యలో ద్రవాలు కారడం, దాని ద్వారా మంట, దురద ఏర్పడతాయి. రక్తహీనత ఉన్నా ఈ సమస్య మాటిమాటికీ వస్తుంటుంది. ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వారు మిమ్మల్ని పరీక్షించి, దానికి సంబంధించిన చికిత్సను కూడా మీకు అందిస్తారు. కారణం తెలుసుకోకుండా సొంతంగా నెలపాటు యాంటీ బయోటిక్స్ వాడితే నీరసం, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్